Friday, 16 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (09)



సాయి.బా.ని.. డైరీ - 1995 (09)
06.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి, యిచ్చిన సందేశము.


1) తాము భగవంతుని మనుషులమని చెప్పుకొంటు తమాషాలు చేస్తు ధనము వసూలు చేసేవారినుండి, అటువంటి తమాషాలు చేసే వ్యక్తులను ప్రోత్సహించేవారి నుండి దూరముగా యుండు. వారి వ్యవహారాలలో నీవు కలుగచేసుకోవద్దు. వారి గురించి ఎక్కువగా మాట్లాడవద్దు.
2) నేను గొప్పవాళ్ళకు ధనవంతులకు వ్యతిరేకిని కాను. వాళ్ళలోను నాభక్తులు ఉన్నారు. నేను భగవంతుని పేరిట తమాషాలు చేయటానికి మాత్రము వ్యతిరేకిని అని గ్రహించు. - శ్రీసాయి.
07.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఆకుపసర్లతో వైద్యము చేసే వ్యక్తిగా దర్శనము యిచ్చి అన్నమాటలు.
"ఈరోజులలో ధనము మీద వ్యామోహముతో ప్రాణరక్షకులు (డాక్టర్లు) ప్రాణభక్షకులుగా మారిపోతున్నారు. అటువంటి సందర్భములో నేను నాభక్తులకు ప్రాణ రక్షకుడిగా మారవలసి వస్తున్నది."
09.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము
1) "నా పిల్లలకు భగవంతుని పేరిట రంగులగాలి చక్రము (విష్ణు చక్రాలు) యిచ్చిన వారు సంతోషించరు. ఆగాలి చక్రముపై పండగలు అనే గాలిని నేను వీచేలాగ చేసినపుడు ఆరంగుల గాలిచక్రాలు తిరుగుతాయి.
వాటిని చూసి నాపిల్లలు సంతోషించుతారు. అందుచేతనే నేను నాపిల్లల చేత శ్రీరామనవమి, చందన ఉత్సవాలు చేయించుతాను."
2) నాభక్తులు జీవితాలలో జయ, అపజయాలను సమదృష్ఠితో చూడగలగాలని నేను పండగరోజులలో కుస్తీ పోటీలను ప్రోత్సహించుతాను. నాభక్తులు గెలుపులో ఓటమిని, ఓటమిలో గెలుపును చూడాలని నాకోరిక. శ్రీసాయి.
10.04.1995
శ్రీసాయి నిన్నరాత్రి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. "నీవు పూజలపేరిట బీద పిల్లలకు అన్యాయము చేసినరోజున నీయింట ఆపూజలపొగ నీపిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జాగ్రత్త. అంటే నీస్వార్ధముకోసము బీదలకు అన్యాయము చేయవద్దు అని గుర్తించు.
11.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి - యిచ్చిన సందేశము.
1) నీవు మురికి నీరును జామి చెట్టుకు యిస్తున్నా ఆచెట్టు మాత్రము నీకు తియ్యని జామిపండ్లు యిస్తున్నదే. అటువంటి జామిచెట్టు ఫలాలను జామిచెట్టు నిద్రించువేళలలో అంటే రాత్రివేళ కోయటానికి సిధ్ధపడుతున్నావు.

యిది అన్యాయము కాదా ఆలోచించు.
2) నీలో ఎంత విజ్ఞానము ఉన్నా, నీదగ్గర ఎంత డబ్బు ఉన్నా, నీలో ఎంత పొగరు ఉన్నా మృత్యువు నిన్ను పిలిచినపుడు వెళ్ళక తప్పదు.
3) ఆఫీసులో ప్రమోషన్ కోసము పైఅధికారి చుట్టు ప్రదక్షిణలు చేస్తారు ఈమనుషులు. భగవంతుడు నీకు అన్నీ యిస్తాడు అని నేను గట్టిగా చెప్పినా వినరు ఈమనుషులు. మరి ఎంతటి తెలివితక్కువవారు ఈమనుషులు.
(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



No comments:

Post a Comment