Friday 2 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (04)







14.02.1995

నిన్నటిరోజున మనిషిలోని స్వార్ధము దాని పరిణామాల గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి మనిషిలోని స్వార్ధమును తొలగించుకునే మార్గము చూపించమని వేడుకొన్నాను. శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.


1) నీవు యితరులకు సహాయము చేయదలచినపుడు ఎదుటివారి సాంప్రదాయాన్ని గౌరవించుతూ సహాయము చేయవలెను.

2) నీవు ఎదుటివానితో మాట్లాడేటప్పుడు, ఎదుటివాని మాతృభాషలో నీవు అతనితో మాట్లాడటానికి ప్రయత్నము చేయవలెను.
2) నీగురువు (శ్రీసాయి) తన భక్తులలో జాతి, మత, కుల, భేదములు లేకుండ అందరిని సమానముగా ప్రేమించినారు అనే సత్యమును ఎల్లపుడు గుర్తు ఉంచుకోవలెను. ఈవిధముగా మసలుకొన్ననాడు నీలోని స్వార్ధము నిస్వార్ధముగా మారిపోతుంది.

15.02.1995

రాత్రి నిద్రముముందు శ్రీసాయికి నమస్కరించి శ్రీసాయి సత్చరిత్ర నిత్యపారాయణ కావించుచున్నానే మరి సాయి సత్ చరిత్రను సులువుగా అర్ధము చేసుకోలేకపోతున్నానే అనే బాధను శ్రీసాయి ముందు వ్యక్త పరచినాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సలహా.

"నీవు సత్ చరిత్ర చదువుతున్నపుడు నీవుకూడ సత్ చరిత్రలోని ఒక వ్యక్తిగాను, సాయిభక్తుడుగాను ఊహించుకొంటు చవటము అలవాటు చేసుకో. అపుడు నీవు శ్రీసాయి సత్ చరిత్రలో ఒక పాత్రధారుడివిగా నిలిచిపోతావు. సాయిసత్ చరిత్ర నీమనసులో హత్తుకునిపోతుంది."

16.02.1995

శ్రీసాయి తన భక్తులను ఉద్దేశించి నిన్నరాత్రి కలలో యిచ్చిన సందేశము వివరాలు.

1) భగవంతుని పేరిట కొబ్బరికాయ కొట్టి ప్రసాదము అందరికి పంచిపె ట్టాలి, అంతేగాని కొబ్బరిముక్కలను ఫ్రిజ్ లో పెట్టుకొని వారము రోజులపాటు కొబ్బరి చట్నీ చేసుకొని తినటముకాదు.

భగవంతునిపేరిట కొబ్బరికాయ కొట్టడము ఎందుకు? ఆభగవంతుని కించపరచటము ఎందుకు! ఒక్కసారి ఆలోచించు.

2) నీయింటికి వచ్చిన అతిధికి చల్లని మంచినీరు యివ్వటము ముఖ్యము. అంతేగాని ఆ వచ్చిన అతిదిని కూర్చోపెట్టి గాజుగ్లాసులో మంచినీరు యివ్వాలా లేదా యిత్తడిగ్లాసులో యివ్వాలా అని తర్జన భర్జన పడటము ఎంతవరకు సమంజసము - ఒక్కసారి ఆలోచించు.

22.02.1995

నిన్నటిరాత్రి శ్రీసాయికి నమస్కరించి సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో యిచ్చిన సందేశము వివరాలు.

1) సాయిసాగరము ఒడ్డున కట్టిన గొప్పవారి మేడలమీద, బీదవారి గుడిశెలమీద, సాయిసాగరమునుండి వీచేగాలులు సమానముగానే యుంటాయి. 2) గొప్పవారు తినే రేగుపళ్ళు, బీదవారు తినే రేగుపళ్ళ రుచి ఒక్కలాగే యుంటుంది అని గుర్తుంచుకో.


25.02.1995

నిన్నటిరోజున సమాజములోని ప్రజలు వారి స్వభావాలు గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో నేను తెలుసుకోవలసిన విషయాలు చెప్పుతండ్రీ అని వేడుకొన్నాను. శ్రీసాయి కొందరు వ్యక్తులను చూపించి వారి జీవితములో వారు చేసిన తప్పులు, వారు పడ్డ కష్ఠాలు చూపి, నీజీవితమును మంచి మార్గములో నడిపించుకోమని సందేశము యిచ్చినారు. శ్రీసాయి చూపిన దృశ్యవివరాలు.

1) జీవితములో చిన్నతనములోనే తల్లి తండ్రులను పోగొట్టుకొని ధైర్యముగా బ్రతుకుతునా ఆపిల్లలను చూడు.

2) జూదములో సర్వస్వాన్ని పోగొట్టుకొని పిచ్చివాడిలాగా తిరుగుతున్న ఆవ్యక్తిని చూడు.

3) త్రాగుడుకు బానిసగా మారి రోడ్డుమీద శవములాగ పడియున్న ఆవ్యక్తిని చూడు.

4) తన తండ్రికి ఆకులో అన్నము పెట్టడానికి వెనకాడే ఆవ్యక్తి తన మనవడికి వెండికంచములో అన్నము పెడుతున్నాడే ఆవ్యక్తిని చూడు.

5) ప్రక్కయింటివాడి స్థలములో గోతులు త్రవ్వి తన స్థలములో యిల్లు కట్టుకొంటున్న ఆలోభిని చూడు.

6) తన మతము వేరు అయినా విశాల హృదయముతో యితర సాంప్రదాయములలోని సంగీతాన్ని చక్కగా పాడుతు సంగీతములో భగవంతుని చూడగల్గిన ఆవ్యక్తిని చూడు.

7) హిందూమత దంపతులు తమకు పిల్లలు లేనప్పుడు ముస్లి ఔలియా ఆశీర్వచనాలతో పిల్లలను పొంది ఆపిల్లలకు ధైర్యముగా మస్తాన్రావు, మస్తానయ్య అని పేర్లు పెట్టుకొని సంతోషపడుతున్న తల్లితండ్రులను చూడు.

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment