Tuesday 27 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (15)




26.03.2012 మంగళవారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 15 వ.భాగాన్ని చదువుకుందాము.


సాయి.బా.ని.. డైరీ - 1995 (15)
27.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి జీవిత ప్రయాణములో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు.  


నేను రోడ్డుమీద సైకిలు త్రొక్కుతు ముందుకు సాగిపోతున్నాను.
రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గోతులు వచ్చినవి. నేను సైకిలు దిగి సైకిలును చేతితో నడుపుకొంటు
ఆగోతులను దాటుకొంటు తిరిగి రోడ్డుమీదకు చేరగానే సంతోషముగా సైకిలు త్రొక్కసాగినాను. కొంత దూరము సైకిలు మీద ప్రయాణము చేసిన తర్వాత ఒక పడవలో కూర్చుని నదిలో ప్రయాణము చేయసాగినాను.
ప్రయాణము సాఫీగానే సాగిపోతున్నది. కాని పడవలోనికి నీరు చేరసాగినది. నేను భోజనము చేసే కంచముతో ఆనీరును తోడివేసి గాలివాలుకు తెరచాప వేసి ప్రయాణము ముందుకు సాగించినాను.
28.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి సాయినాధ కుటుంబ సభ్యుల మధ్య ఉంటున్నపుడు ప్రశాంతముగా జీవించగలిగేలాగ యుండే మార్గము చూపు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీసాయి చూపిన దృశ్యాలు.
1. నేను నా బంధువుల మధ్య తిరుగుతున్నాను. కాని నాచుట్టు ఒక కాంతి చక్రము తిరుగుచున్నది.
ఆకాంతి చక్రమును గురువు ప్రసాదించినారు అని అక్కడి బంధువులు చెప్పుకోసాగినారు.
2. నావాళ్ళు నానుండి దూర దేశాలలో యున్నారు. వాళ్ళు రోజూ నాతో టెలిఫోన్ లో మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు విమానాలలో వచ్చి నన్ను చూడసాగినారు.
3. నేను యిల్లు కడుతున్నాను. ఆయింటికి సిమెంటు బదులు తియ్యటి తేనె పాకము (ప్రేమ పాకము) వాడుతున్నాను.
4. అన్నదమ్ములు యిళ్ళమధ్య గోడలకు బదులు మంచి అరటి చెట్లు పాతినాము.
వాటి ఫలాలు రెండు కుటుంబాలవారు సంతోషముగా తినుచున్నారు.



29.05.0995
నిన్నటిరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి నావాళ్ళనుండి నేను పొందుతున్న మానసిక బాధనుండి విముక్తి ప్రసాదించమని కోరినాను. శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు 1) జీవితములో ఈర్ష్య, ద్వేషాలు అనేవి కుటుంబ సభ్యుల మధ్య స్నేహితులమధ్య నీటిలోని నాచులాగ పెరుగుతు ఉంటుంది. మనిషి జీవించటానికి నీరు (కుటుంబ సభ్యులు - స్నేహితులు)
చాల అవసరము. అనీరు కావలసినపుడు ఆనీటితో వచ్చే నాచును కూడా భరించాలి. ఆనాచుమీద నడవకుండ నాచు ప్రక్కనుండి నడుస్తూ మనజీవిత గమ్యము చేరాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment