Friday 14 November 2014

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢరహస్యాలు - 3


    

14.11.2014 శుక్రవారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢరహస్యాలు - 3
  


ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                              హైదరాబాద్

ముందుగా సాయిప్రేరణ: ఒక్కసారి నన్ను నీరక్షకుడిగా భావించి చూడు, నిన్ను అన్నిరకముల బాధలనుండి విముక్తుడ్ని చేస్తాను. 


3వ.ప్రశ్న: శ్రీసాయి సత్ చరిత్ర ముప్పదిరెండవ అధ్యాయములో శ్రీసాయి అన్న మాటలు: 

"నాగురువు నన్ను ఒక బావి వద్దకు తీసుకొనివెళ్ళి, నాకాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి, బావిలోని నీళ్ళకు మూడు అడుగులు మీద వ్రేలాడదీసిరి.  నాచేతితోగాని, నోటితో గాని, నీళ్ళను అందుకొనలేకుంటిని.  నన్ను ఈవిధముగా వ్రేలాడగట్టి కొంతసేపు తర్వాత బావిలోనుండి బయటకు తీసి ఎట్లుంటివి అని అడిగిరి" ఈ మాటలకు అర్ధము తెలుపగలరు.

జవాబు: మనము ఈ ప్రపంచములోనికి అడుగుపెట్టేముందు మన తల్లి గర్భములో మనము తొమ్మిది నెలలు గడిపిన పరిస్థితి గుర్తు చేసుకొందాము.  తల్లి గర్భములో శిశువు తలక్రిందులుగా తల్లితో ఒక ప్రేగుతో బంధము కలిగియుంటుంది. 
     
       
 శిశువు తల్లి గర్భములోని నీటిలో తేలుతున్నా ఆనీరును త్రాగదు.  ఆశిశువుకు కావలసిన నీరు, గాలి, ఆహారము తల్లితో బంధము కలిగియున్న  ప్రేగు ద్వారా లభించుతుంది.  అంటే శిశువుకు తొమ్మిది నెలలు తల్లి ప్రేగునుండే శక్తిని పొంది నవమాసాలు తర్వాత బాహ్య ప్రపంచంలోనికి తల్లి ప్రేగును తెంచుకొని బయటకు వస్తుంది.


ఈప్రశ్నలో నుయ్యి అనేది ఆధ్యాత్మిక ప్రపంచం.  ఆనూతి గట్టుమీద చెట్టు మన గురువు. మనము కట్టుకొన్న ఆతాడును మన గురువు చేతికి అప్పగించి తలక్రిందుగా తపస్సు చేసుకొనుచున్నాము.  (పూర్వకాలములో మునులు తలక్రిందులుగా కూడా తపస్సు చేసేవారు).  మన తపస్సు ఫలించిన తర్వాత గురువు సాక్షాత్కరించి ఎట్లాగ యున్నావు అని పలకరించటము మన అదృష్ఠము.

శ్రీసాయికి అంకిత భక్తులము అయి సాయిమాత గర్భము (ఆధ్యాత్మిక ప్రపంచము) లో ప్రశాంతముగా జీవించుతు మన గమ్యస్థానమునకు చేరుకొందాము.

జైసాయిరాం
(సర్వం సాయినాధార్పణమస్తు)

మరలా మన బ్లాగులో ప్రచురణ 15 రోజుల తర్వాత జరుగుతుంది.  అంతవరకూ ఇంతకు ముందు ప్రచురించిన సాయిలీలలను మనసారా చదవండి. 

No comments:

Post a Comment