12.04.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుండి భగవంతునిపై సాయి బానిస ఆలోచనలు ప్రచురిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలను పంపించండి.
tyagaraju.a@gmail.com
సంకలనం ఆత్రేయపురపు త్యాగరాజు దుబాయి నుండి.
భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు - 1
1. స్వఛ్చమైన జలాలతో కూడినది ఆధ్యాత్మిక సాగరము. నీవు
ఎంత త్రాగగలవో ఆలోచించి అంత జలాన్ని మాత్రమే త్రాగు.
2. ఈ సృష్టిలోని నీటి బిందువు నీవు. ఏనాటికైన నీవు
ఆధ్యాత్మిక సాగరములో కలసిపోయిన నీ జన్మ ధన్యము.
౩. ఈ సృష్ఠిలోని పంచ భూతాలలో భగవంతుడు ఉన్నాడు.
మరి నీశరీరము కూడా పంచ భూతాల కలయిక. అందుచేత
భగవంతుడు నీలోను ఉన్నాడు.
4. నీకు భగవంతుని అనుగ్రహము కావాలి అంటే నీవు సత్యము
అనే నదీజలాలలో ముందుగా స్నానము చేయి.
5. భగవంతునితో మాట్లాడటానికి భాష అవసరము లేదు.
నీలోని ఆత్మశక్తి భగవంతునితో మాట్లాడుతుంది.
6. నీవు భగవంతుని ప్రేమను పొందదలచిన ముందుగా నీలో
భగవంతుని చూడు. ఆతర్వాత నీతోటివానిలో భగవంతుని
చూడు.
7. భగవంతుని గురించి తక్కువగా మాట్లాడు.
మాట్లాడవలసివచ్చిన మనసు విప్పి మాట్లాడు.
8. నీవు జీవితములో నిజాన్ని అంగీకరించటము అంటే
భగవంతుడిని అంగీకరించినట్లే.
9. నీలో మానసిక శక్తి తగ్గినపుడు నీ ఆధ్యాత్మిక ప్రయాణములో
ఒడిదుడుకులు వస్తాయి. అపుడు నీగురువు నీచేయి పట్టుకొని
ముందుకు నడిపించుతారు.
10. భగవంతుడు ప్రేమస్వరూపుడు అని నీవు మనస్ఫూర్తిగా
అంగీకరించిననాడు నీలో భిన్నత్వానికి, ద్వైతానికి తావే లేదు.
11. నీ ఆత్మకు తెలిసిన భాషతో మాత్రమే నీవు భగవంతునితో మాట్లాడగలవు.
12. భగవంతుని క్పపను నీవు నీఆలోచనల ద్వారాను అనుభూతుల ద్వారానే గ్రహించగలవు.
13. నీవు ఏభాషలో మాట్లాడినా భగవంతుడు దానిని అర్ధము చేసుకోగలడు. కాని ఆయన మాట్లాడె భాషను నీ మనసు మాత్రమే అర్ధము చేసుకోగలదు.
14. ప్రాపంచిక రంగములో నీవు నడుస్తున్నపుడు సదా భగవన్నామస్మరణ చేస్తు ఉండు. అపుడు భగవంతుడు నీకు తోడుగా నీప్రక్కనే నడుస్తాడు.
15. నీవు అన్నీ వదలిపెట్టి భగవంతుని కోసము పరుగు తీసినపుడు భగవంతుడు కూడా అదే వేగముతో నిన్ను కలవడానికి వస్తాడు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment