Sunday 23 April 2017

ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 5

 Image result for images of shirdi saibaba
              Image result for images of roses hd
23.04.2017  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 5
      Image result for images of sai ba nisa

సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖై గేట్,  దుబాయి

51.  నీలోని ఆత్మ ఎల్లవేళల పరమాత్మ గురించి ఆలోచించుతూ ఉంటే ఆ పరమాత్ముడు  సదా నీలోనే ఉంటాడు.

52.  ఆధ్యాత్మికము ఎక్కడో పుస్తకాలలో వ్రాసి ఉండలేదు.  నీలో భగవంతుని గురించి తపన ప్రారంభము కాగానే భగవంతుడే  తన గురించి నీహృదయము అనే పలకమీద వ్రాసుకొంటాడు.



53.  వైజ్ఞానిక రంగములో నీవు ఎంత దూరము ప్రయాణించినా భగవంతుని ఉనికిని కూడ తెలుసుకోలేవు.  అదే ఆధ్యాత్మికరంగ ప్రయాణములో భగవంతుని చేరగలవు.

54.  బాధలలో ఉన్నవానికి నీ ప్రేమను పంచు.  అది వాని బాధలను మరచిపోయేలాగ చేస్తుంది.  నీకు తృప్తిని ప్రసాదించుతుంది.

55.  నీమనసులో అసూయ, ద్వేషము ఉన్నంతకాలం నీవు ఎదుటివానిని ప్రేమించలేవు.  భగవంతుడిని దర్శించలేవు.

56.  భగవంతుడు దొంగలలోను, దోపిడిదారులలోను, అందవిహీనులలోను ఉన్నాడు.  నీలోని విజ్ఞతను ఉపయోగించి వారితో మసలుకో.

57.  నీలోని ఆత్మను నీలోని ఆలోచనలతోనే ఉద్దరించగలవు.  అందుచేత నీమనసులో ఎల్లపుడు మంచి ఆలోచనలతో నిండి ఉండని. 

58.   నీవు విధి వ్రాసిన తలరాతను చెరపలేవు.  కాని నీమనసులోని మంచి ఆలోచనలతో నీజీవన విధానమును మార్చగలవు.

59.  ఔషధ గుణాలు గల మొక్కను ఏప్రాంతములో పాతిన ఆ వాతావరణానికి తగినట్లుగా ఎదుగుతుంది.  కాని దానిలోని ఔషధ గుణాలను మార్చుకోదు.  అలాగే మంచి నడవడిక గల మానవుడు ఏదేశములో ఉన్నా తన మంచితనాన్ని విడనాడడు.

60.  నీ ఆత్మ శరీరము అనే వస్త్రాన్ని ధరించుతుంది.  అలాగే నీశరీరము సాలెవాడు నేసిన వస్త్రాన్ని ధరించుతుంది.  ఒకనాడు ఈశరీరము మరియు నీవు ధరించిన వస్త్రము మట్టిలో కలసిపోవలసినదే.

61.  ఒక మంచుగడ్డను ఉష్ణప్రదేశములో నీవు ఉంచినపుడు అది నీరుగా మారి అనేకమంది దాహాన్ని తీర్చుతుంది.  అదే విధముగా నీమనసులోని ఆలోచనలను మంచి మార్గములో ఉంచినపుడు నీఆలోచనలు సమాజములోనివారికి ఉపయోగపడతాయి.

62.  ఈత చెట్టుకు కొమ్మలనిండ ముళ్ళు ఉన్నా ఆ చెట్టు మానవాళికి తినడానికి తియ్యటి ఈతపళ్ళను ఇస్తుంది.  అలాగే నీవు శత్రువుగా భావించే వ్యక్తిలో కూడా ఎక్కడో మంచితనము దాగి ఉంటుంది.  నీవు ఆమంచితనాన్ని అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించు.

63.  బంగారము ఈ ప్రపంచములో ఏప్రాంతములో ఉన్నా దాని విలువ ఎన్నటికి తరగదు.  అలాగే ఈమానవాళిలో మహాత్ములు ఏదేశములో ఉనా వారి గొప్పతనము తరగదు.

64.  ఈప్రపంచము సూర్య, చంద్రుల నిర్ధారిత గతివలయములో మనుగడ సాగించుతున్నది.  అలాగే ఆధ్యాత్మిక ప్రపంచములో ఆత్మ, పరమాత్మల వలయములో మానవుడు జీవించగలుగుతున్నాడు.

65. అపనమ్మకము మానవుని జీవితములో చికాకులకు మూలము.  అదే భగవంతునిపై నమ్మకము నీప్రశాంత జీవితానికి మూలాధారము.

(ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment