21.04.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస
ఆలోచనలు –4
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయ్
38. నీ ఆత్మను నీవరకే పరిమితము చేయకు. నీ ఆత్మను పరమాత్మ గురించి ఆలోచించేలాగ చేయి. అపుడు ఈ మానవాళి అంతా పరమాత్మ స్వరూపముగా నీకు కనిపించుతుంది.
39. ఉపవాసాలు చేస్తు శరీరాన్ని హింసించుతు భగవంతుని ధ్యానించటము కన్న, శరీరాన్ని ఆరోగ్యకరముగా ఉంచుకొని భగవంతుని ధ్యానించటము మిన్న.
40. నీలోని ఆత్మతో నీవు మాట్లాడదలచిన నీవు భగవంతుని నామము స్మరించుతు నిద్రావస్థలో ఉన్న నీ ఆత్మను మేల్కొలుపు.
41. నీవు చేసిన తప్పులకు నీవు నీ మనసుకు క్షమాపణ చెప్పిననాడు నీ మనోద్వారము తెరుచుకొని నీ మనసు నీలోని పశ్చాత్తాపాన్ని భగవంతునికి తెలియచేస్తుంది.
42. భగవంతుడె సత్యము అని నీవు నమ్మినపుడు ఆ సత్యాన్వేషణలో ప్రేమ అనే మొదటి అడుగుతో నీ అన్వేషణ ప్రారంభించు.
43. ఆకాశములోని మేఘాలనుండి నీవు పొందే వర్షపు నీరు భగవంతుడు నీకు ఇచ్చిన వరము. అదే భూమిలోనుండి పైకి తీసుకొనివచ్చే నీరు నీ కఠోర తపస్సుకు ఫలితము.
44. ప్రాపంచిక రంగములోని నల్లటి మేఘాలు నీకంటి చూపును తగ్గించుతుంది. అదే ఆధ్యాత్మిక రంగములోని తెల్లటి మేఘాలు నీ మనోనేత్రమును తెరపించి భగవత్ సాక్షాత్కారమును కలిగించుతుంది.
45. నేను పదిమందికి భగవంతుని తత్వాన్ని భోధించుతాను అనే భావనతో జీవించేకన్న, నేను పదిమందితో కలసి భగవంతుని పేరిట మానవసేవ చేయటము ఉత్తమము అని భావించటము మిన్న.
46. నీ మనసు అనే వ్యవసాయ క్షేత్రములో నీవు విత్తనాలను నాటేకంటే “భగవంతుడా నీవు మంచి విత్తనాలను నా మనసులో నాటు” అని ప్రార్ధించటము ఉత్తమము.
47. భగవంతునికి అనేక రూపాలు, అనేక నామాలను ఆపాదించటము చిన్న పిల్లలకు నేర్పే పాఠాలు. అదే భగవంతునికి రూపము లేదు, నామము లేదు అని భగవంతుడిని పూజించేవాడు నిజమైన జ్ఞాని.
48. భగవంతుని గురించి సత్యాన్వేషణ ప్రారంభించినపుడు ఆ అన్వేషణకు అంతము ఉండదు. ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే తపనతోనే మనము మన జీవితాన్ని ముగించుతాము.
49. భగవంతుడు ఎక్కడో స్వర్గములో ఉన్నాడు అనే భావనతో పూజించేకన్న, భగవంతుడు నాహృదయములోనే ఉన్నాడు అనే భావనతో పూజించటము మిన్న.
50. సర్వ జీవకోటిని, సర్వ మానవాళిని సృష్ఠించినది భగవంతుడు ఒక్కడే కదా. మరి అటువంటి భగవంతుడిని మనము అందరము కలసి మెలసి పూజించుదాము.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస
ReplyDeleteఆలోచనలు –2 & 3 ఉంటె నాకు పంపించగలరు
Email : murtheegsn50@gmail.com