Saturday 15 April 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 3 వ.భాగమ్

  Image result for images of sai baba photos hd
         Image result for images of pink rose

15.04.2017  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 3 వ.భాగమ్
        Image result for images of sai banisa

31.   భగవంతుడు నీ హృదయములోనే ఉన్నాడు అని నీవు నమ్మినపుడు, నీవు చేసే ప్రతి పనిని నీవు భగవంతునికి ఆపాదించవచ్చును.

32.  భగవంతుడా నీవు నా హృదయములోని కాంతివి.  ఆ కాంతిలోనే  నేను  జీవించుతున్నాను.



      Image result for images of man offering  food to god
33.  నీవు త్రాగే నీరు, నీవు తినే భోజనము ముందుగా భగవంతునికి సమర్పించు.  ఆయన తినగా మిగిలిన శేష భుక్తమును నీవు ప్రసాదముగా స్వీకరించు.

34.  జ్ఞానము అనేది పుస్తకాలు చదవటము ద్వారా రాదు.  నీలోని ఆత్మశక్తితో భగవంతునితో మాట్లాడు.   అపుడు జ్ఞానము దానంతట అది నీ మనసులోనికి వచ్చి చేరుతుంది.

35.  ప్రాపంచిక రంగములో నీవు ధనవంతుడివి అంటే అది భగవంతుని అనుగ్రహము అని భావించు.

36.  అహంకారము అనే పర్వత శిఖరాలపై నివసించేకన్నా భగవంతుని ప్రేమ అనే లోయలలో నివసించటము మిన్న అని గ్రహించు.

37.  ఈ సృష్ఠిలోని సర్వజీవరాశులయందు సర్వమానవాళియందు ఉన్నది భగవంతుని ఆత్మ అని గుర్తించిననాడు ఈ మానవాళి సుఖశాంతులతో జీవించుతుంది.

38.  భగవంతుని ప్రేమ నీపై ఉన్నపుడే నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది.  అందుచేత సదా భగవంతుని ప్రేమను పొందటానికి ప్రయత్నించు.

39.  నీ మనోనేత్రాలలోని చీకటి పొరలను నీ గురువు తొలగించుతారు.  ఆతర్వాత భగవంతుని నిజస్వరూపమును నీవు చూడగలవు.
       Image result for images of beautiful flowers in the world
40.  భగవంతుడు అందమైన సృష్ఠిని సృష్ఠించినాడు.  కాని మానవుని విషయములో అందమైన మనసును మాత్రమే సృష్ఠించినాడు.  అందుచేత మానవులలోని మానసిక అందమును చూడటము అలవాటు చేసుకోవాలి.

41.  ప్రాపంచిక రంగములోని చీకటిలో నడిచేటప్పుడు చేతిలో లాంతరు కావాలి.  అదే ఆధ్యాత్మిక రంగములోని చీకటిలో నడిచేటప్పుడు సద్గురువు చూపే లాంతరు యొక్క వెలుతురు కావాలి.
          Image result for images of man following shirdisaibaba
42.  భగవంతుని నిజరూపమును చూడాలి అన్నపుడు నీ నేత్రాలను నిజము అనే పవిత్ర­­­­­­­­­­­­­­­­­­­­­­­ జలాలతో కడగాలి.

43.  భగవంతునితో మాట్లాడాలి, భగవంతుని మాటలు వినాలి అన్నపుడు నీనాలుకతో భగవంతుని పవిత్రనామమును సదా ఉచ్చరించుతూ ఉండు.  సద్గురువు చెప్పే­­­­­­­­­ మంచిమాటలు వింటూ ఉండు.

44.  నీవు భగవంతుని గురించి తెలుసుకోగలగటము అది భగవంతుని కృపతోనే సాధ్యపడుతుంది.  అందుచేత భగవంతునికి విధేయుడివి అని జీవించు.
            
                   Image result for images of man following shirdisaibaba
45.  ప్రాపంచిక రంగములో మానవుల మధ్య అపార్ధాలకు తావు ఉంటుంది.  కాని ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేసేవారికి భగవంతునితో అపార్ధాలకు తావు ఉండదు.

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment