04.09.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స.గారు చెబుతున్న కలలలో శ్రీసాయి వినండి.
కలలలో శ్రీసాయి - 3వ.భాగం
ఆంగ్లమూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
బాబా నాకు కలలలో యిచ్చిన రెండు అనుభవాలను మీకు వివరిస్తాను.
సాయికి ఆంగ్లబాష తెలియదనే అభిప్రాయంతో ఉండేవాడిని. తొందరలోనే నాతప్పును తెలుసుకొన్నాను. 1993వ.సంవత్సరంలో సాయి నాకు స్వప్నంలో కనిపించి తెల్లటి ద్రవం యిచ్చి త్రాగమన్నారు. ఆద్రవం అన్నం ఉండికించేటప్పుడు వచ్చే గంజిలాగ ఉంది.
అదేమిటని బాబాని అడిగాను. ఆంగ్లేయులు ఆపానీయాన్ని "బ్రోస్" అంటారని చెప్పారు. ఆపానీయం చాలా వేడిగా ఉండటంతో త్రాగబోయినప్పుడు నోరు కాలింధి. దాంతో నాకు మెలకువ వచ్చింది. వెంటనే బాబా చెప్పిన "బ్రోస్" అనే పదాన్ని కాగితం మీద వ్రాసుకొన్నాను.
మరునాడు "బ్రోస్" అన్నమాటకు అర్ధమేమిటని చూద్దామని ట్వెంటీయత్ సెంచరీ చాంబర్స్ డిక్షనరీ చూశాను. ఆశ్చర్యం బ్రోస్ అన్నపదానికి అర్ధం కనిపించింది. బ్రోస్ అనగా ఓట్ మీల్ లో వేడి పాలుగాని, మరుగుతున్న నీటిని గాని పోసి దానిలో ఉప్పు, వెన్న వేసి తయారు చేయబడే బలవర్ధకమయిన పానీయం అని వుంది.
మరునాడు "బ్రోస్" అన్నమాటకు అర్ధమేమిటని చూద్దామని ట్వెంటీయత్ సెంచరీ చాంబర్స్ డిక్షనరీ చూశాను. ఆశ్చర్యం బ్రోస్ అన్నపదానికి అర్ధం కనిపించింది. బ్రోస్ అనగా ఓట్ మీల్ లో వేడి పాలుగాని, మరుగుతున్న నీటిని గాని పోసి దానిలో ఉప్పు, వెన్న వేసి తయారు చేయబడే బలవర్ధకమయిన పానీయం అని వుంది.
అంటే ఓట్సుతో త్రాగడానికి తయారుచేసే పానీయం. ఆవిధంగా బాబా తనకు ఆంగ్లం కూడా వచ్చని ఈ కలద్వారా నాకు ఓట్సుతో తయారుచేసిన ఆపానీయం త్రాగడానికిచ్చి నిరూపించారు. ఆవిధంగా నాకే ఆంగ్లభాష వచ్చునన్న నాలోని అహంకారాన్ని తొలగించారు.
(బ్రోస్ పదానికి అర్ధం .. ట్వెంటీయత్ సెంచరీ చాంబర్స్ డిక్ష్నరీ పేజ్ నంబరు. 118 లింక్ చూడండి.
https://archive.org/stream/chambersstwentie00daviiala#page/118/mode/2up
1995వ.సంవత్సరంలో మరొక సంఘటన ద్వారా తనకు ఆంగ్లంలో పరిజ్ఞానం ఉందని బాబా వివరించారు. నాకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి హైదరాబాదులో ఉన్న వైద్యుడిని సంప్రదించడానికి అనుమతినిమ్మని, రాత్రి పడుకునేముందు బాబాని ప్రార్ధించాను. బాబా నాకు కలలో కనిపించి ఈవిధంగా చెప్పారు.
"ఆవైద్యుడి వద్దకు వెళ్లకు. నీకు 'లాపిడేషణ్ అనే ఆపరేషన్ చేస్తారు జాగ్రత్త" అని చెప్పారు. మరునాడు 'లాపిడేషన్ ' అన్న పదానికి అర్ధంకోసం డిక్ష్నరీలో వెతికాను. దానికి అర్ధం 'రాళ్ళతో కొట్టి శిక్షించుట ' అని వుంది. అనగా ఆవైద్యుడు నాకు ఆపరేషన్ చేసి చంపేస్తాడని అర్ధం చేసుకొన్నాను. ఈనాటివరకు నేను ఆవైద్యుడి దగ్గరకు వెళ్ళే ధైర్యం చేయలేదు.
సాయి తన భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. దీనికి ఉదాహరణ శ్రీసాయి సత్ చరిత్ర 28వ.అధ్యాయంలోని సంఘటన. బాబా మేఘుడికి కలలో కనిపించి అతనిమీద కొన్ని అక్షింతలను చల్లి "మేఘా! గోడమీద త్రిశూలం గీసి శివుని పూజించు. పరమేశ్వరుడు వస్తున్నాడు".అన్నారు. మరునాడు మేఘుడు ఉదయాన్నే లేచి తన పక్కమీద అక్షింతలు ఉండటం చూసి ద్వారకామాయిలో ఉన్న బాబావద్దకు వెళ్ళాడు.
అప్పుడు బాబా "నేను ప్రవేశించడానికి వాకిలి అవసరం లేదు. నాకు రూపం లేదు. నేను సర్వత్రా నిండి ఉన్నాను. నామీద నమ్మకముంచి నన్ను పూజించువారినందరిని కనిపెట్టుకొని రక్షించెదను. వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను" అని చెప్పారు.
పగటివేళల్లో కూడా బాబా తన భక్తులకు కలలో కనిపించి తన ఉనికిని చాటారు. దీనికి సంబంధించి శ్రీసాయి సత్ చరిత్రలోని కొన్ని సంఘటనలను గుర్తు తెచ్చుకొందాము. శ్రీసాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయంలో బాబా తన భక్తుడు డాక్టర్ పండిత్ కి అతని గురువు రఘునాధ్ మహరాజ్ గా దర్శనమిచ్చారు. ఆవిధంగా అతని చేత తన నుదిటిమీద గంధముతో బొట్టు పెట్టించుకొన్నారు. 12వ.అధ్యాయంలో మూలేశాస్త్రికి బాబా అతనిగురువయిన ఘోలప్ స్వామిగా దర్శనమిచ్చి, అతని గురువును పూజించునట్లుగా పూజ చేయించుకొన్నారు. ఇదే అధ్యాయంలో బాబా ఒక డాక్టర్ కు శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చారు. శ్రీసాయి సత్ చరిత్ర 29వ.అధ్యాయంలో మద్రాసు భజన సమాజం నుంచి వచ్చిన ఒక స్త్రీకి బాబా మధ్యాహ్న హారతి సమయంలో శ్రీరామునిగా దర్శనమిచ్చారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment