06.03.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలలొ మరికొన్ని చదవండి..,
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 3 వ.భాగమ్
18.01.2020 - మానవత్వము నశించిపోయింది
నేడు సమాజములో మానవత్వ విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి. కొందరు తలిదండ్రులు మతిస్థిమితము లేని తమ పిల్లల కాళ్ళకు ఇనుప సంకెళ్ళు వేసి, వారి ఇంట ఇనుపస్థంభాలకు కట్టివేసి, వారికి తినడానికి మాత్రము కంచములో భోజనము పెట్టి వారిని పశువులకన్నా హీనముగా చూడటము నాకు చాలా బాధకలిగించింది. అటువంటి తల్లిదండ్రులను నేను క్షమించలేను. భగవంతుడు మతిస్థిమితము లేని పిల్లలను కాపాడాలి.
నిన్నటి రోజున షిరిడీలో నా భక్తులు నా జన్మస్థలము గురించి వాదులాడుకోసాగారు. బ్రహ్మ నా తండ్రి, మాయ నాతల్లి, వారి కలయిక వలననే నేను జన్మించాను. ఇంక నా జన్మస్థలము గురించి వాదులాడుకోవడంలో అర్ధములేదు. ఈ విశ్వమంతా నా జన్మస్థలమని గుర్తించుకోమని నా భక్తులకు తెలియజేయి.
21.01.2020 - సద్గురువుకు తన్ – మన్ – ధన్ సమర్పించుట
సమర్ధ సద్గురువు లభించిన భక్తుడు తన శరీరము తన మనస్సు, తన ధనము సద్గురువుకు సమర్పించి ఆయన సేవ చేసుకోవాలి.
విశ్లేషణ - తన్ అనగా భక్తుడు తన శరీరమును సద్గురువు సేవలో వినియోగించాలి. శరీరము తనది కాదనే భావనతో తను చేసే ప్రతిపని గురువుయొక్క అనుమతి తీసుకుని జీవించాలి. సద్గురువు శరీరముతో లేకపోయినా, మానసికముగా వారికి ప్రతి విషయము తెలియచేసి, ఆపనిని పూర్తి చేయాలి.
మన్ అనగా మనసు. భక్తుడు అనుక్షణము తన మనసును సద్గురువుపై లగ్నము చేసి జీవించాలి. గృహస్థ ధర్మమును పాటించేవారు దాంపత్య జీవితములో జీవించేవారు మానసికముగా వారి కోరికలు, కష్టసుఖాలు సద్గురువుకు తెలియ చేసుకోవాలి.
ధన్ - తను సంపాదించిన ధనమును తన కుటుంబ సభ్యులకే పరిమితము చేయకుండా సద్గురువును తన కుటుంబ పెద్దగా భావించి, వారితో పంచుకొనవలెను. యావత్ కుటుంబ సభ్యులు సద్గురువు సేవలో తరించాలి. ---- త్యాగరాజు
22.01.2020 - స్నేహాలు – స్నేహితులు
చిన్ననాటి స్నేహాలు నేడు కాలక్షేపానికి పనికివస్తాయి. వర్తమానంలోని స్నేహాలు నీ తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడానికి పనికొస్తాయి. అదే భగవంతునితో స్నేహము మంచి భవిష్యత్ అనే మరు జన్మను ప్రసాదిస్తుందని గ్రహించు.
విశ్లేషణ -- దయచేసి శ్రీసాయి సత్ చరిత్ర 24 వ.ధ్యాయములో సుదాముని కధ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాము.
సుదాముడు తన చిన్నతనమునుండి శ్రీకృష్ణుని తన గృహస్థ జీవితము వరకు సాధారణ స్నేహితునిగా భావించాడు. అదే వృధ్యాప్యములో శ్రీకృష్ణుని భగవంతునిగా భావించి, భగవంతునితో స్నేహము చేసి, తన శేష జీవితాన్ని బంగారు బాటలో పయనింపచేసుకున్నాడు. ----- త్యాగరాజు
(మరికొన్ని రహస్యాలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(మరికొన్ని రహస్యాలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment