Friday 12 October 2012

రామాయణంలో శ్రీసాయి 7 వ.భాగము





13.10.2012 శనివరము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి


మీరు చదువుతున్న రామాయణంలో శ్రీ సాయిపై మీ అభిప్రాయములను తెలియచేయండి.

రామాయణంలో శ్రీసాయి 7 వ.భాగము

రామాయణంలోని అయోధ్య కాండలో,  శ్రీరామచంద్రులవారికి కులమత భేదాలు లేవు అని చెప్పబడింది. 


శ్రీరామచంద్రులవారు గంగా నదిఒడ్డున గుహుని యొక్క కుటీరానికి వెళ్ళారు.  
కొండజాతి దొర అయినటువంటి గుహుడు శ్రీరామచంద్రులవారిని సాదరంగా ఆహ్వానించి ఆతిధ్యమిచ్చాడు. శ్రీరాములవారు గుహునితో కలసి భుజించి రాత్రికి అక్కడే విశ్రమించారు. భగవంతుడు కులమతాలకతీతుడని తెలియచేయడానికి మనకు ఇదే తార్కాణం. భగవంతుడెప్పుడూ ప్రేమకిభక్తికి కట్టుబడి ఉంటాడనే విషయం మనకి ఈ సంఘటన ద్వారా విశదమవుతుంది.

శ్రీసాయి సత్ చరిత్ర 32వ. అధ్యాయములో కూడా మనకి యిటువంటి సంఘటనే కనపడుతుంది. ఒకసారి బాబా ముగ్గురు స్నేహితులతో కలసి అడవిలో వెడుతున్నపుడు అందరూ దారి తప్పారు. వారికి దారిలో ఒక వర్తకుడు (బంజారా) కలిశాడు. అతను వారితోమీరు కొంత సేపు విశ్రాంతి తీసుకొని భోజనము చేసి ముందుకు సాగిపొండి అని సలహా ఇచ్చాడు.  స్నేహితులు ముగ్గురూ బంజారా యొక్క మాటలను పెడచెవిని పెట్టి భోజనము చేయకుండా ముందుకు సాగిపోయి కష్టాలను కొనితెచ్చుకొన్నారు. బాబా బంజారా ఆతిధ్యాన్ని స్వీకరించిభోజనము చేసి అడవిలో ప్రయాణం సాగించి తన గురువును కలుసుకొన్నారు. ఆవిధంగా రామాయణంలో శ్రీరామ చంద్రులవారు,  యిప్పుడు సాయినాధులవారు ఇద్దరూ కూడా కులమతాలను పట్టించుకోకుండామానవులందరినీ ఒకేవిధంగా ఆదరించి గౌరవించారు. 

అరణ్యకాండలో శ్రీరామచంద్రులవారు తనవద్దకు వచ్చినవారందరికీ కూడా శరణాగతిని ప్రసాదించారు. వాలి వల్ల బాధలు పడిన సుగ్రీవుని వృత్తాంతము మనకందరకూ తెలుసు. శ్రీరాములవారు సుగ్రీవునికి రక్షణ కల్పించారు.  

రావణునిచే పరాభవింపబడిన విభీషణుడికి రామ చంద్రులవారు ఆశ్రయమిచ్చారు. శతృవర్గంలోనించి వచ్చినవాడయినా విభీషనుడికి  శ్రీరాములవారు క్షత్రియ ధర్మాన్నిపాటించి రక్షణ కల్పించారు.   
 
నానాసాహెబ్ చందోర్కర్ బాబా అంకిత భక్తులలో ఒకరు. 1902 వ. సంవత్సరములో ఆయన తహసీల్దారుగా పనిచేస్తూ ఉండేవారు.

బాబా రెండుసార్లు కబురు పంపినా కూడా నానాసాహెబ్ అహంకారంతో షిరిడీకి వెళ్ళలేదు. ఆ రోజుల్లో షిరిడీలో కలరా వ్యాపించి ఉంది. 
షిరిడీ పొలిమేరల్లో గోధుమ పిండిని చల్లమని బాబా సలహా ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వంవారినుంచి డీ.డీ.టీ. పవుడరు తెచ్చి చల్లి ఉండవలసినదనినానా సాహెబ్ బాబాను ఉద్దేశ్యించి వేళాకోళంగా మాట్లాడారు. ఆ నానా సాహెబ్ చందోర్కరేతన కుమార్తె మైనతాయి పురిటి నొప్పులతో విపరీతంగా బాధపడుతున్న సమయములో బాబా పాదాలను ఆశ్రయించి సర్వశ్య శరణాగతి వేడుకొన్నారు.   

దగ్గరలో వైద్య సహాయం కూడా లేదు. ప్రమాదమునించి  తనకుమార్తెను రక్షించమని నానా సాహెబ్ బాబాని వేడుకొన్నాడు. వేరే గత్యంతరం లేక మైనతాయి బాబాను ప్రార్ధించింది. బాబా బాపుగిర్ బువాను ద్వారకామాయికి రప్పించి,  స్వయంగా ఊదీని పట్టుకుని జామ్నేర్ వెళ్ళమని ఆదేశించారు. ఆవిధంగా బాబా తనను ఆర్తితో ప్రార్ధించిన తన భక్తురాలిని రక్షించారు.
 
నానా సాహెబ్ గతచరిత్ర మాటెలా ఉన్నాగాని బాబా కూడా క్షత్రియ ధర్మాన్ని పాటించారు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని పూర్తిగా అవగాహన చేసుకొందాము. బాబాయే టాంగా తోలేవానిగా అవతారమెత్తారు. జామ్నేర్ పొలిమేరల్లో ఉదయాన్నే  టాంగావాలా,బాపుగిర్ బువాకు ఫలహారం పెట్టినారు. టాంగావాలా మరొక మతంవాడిలా కనిపిస్తున్నందువల్ల బాపుగిర్ బువా కొంత సందేహించాడు. సాయి సత్చరిత్రలోని 33వ.అధ్యాయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేద్దాము. "నేను ఘర్వాల్ నించి వచ్చిన క్షత్రియుడిని" అన్నాడు టాంగావాలా. 

మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ముందు  ఫలహారం చేయమని టాంగావాలా చెప్పాడు. ద్వారకామాయిలో బాబా తానెప్పుడు సత్యమునే పలుకుతానని చెప్పారు.

టాంగా తోలేవానిగా బాపుగిర్ బువాతో కూడా వెళ్ళిన బాబా తాను ఘర్వాల్ నుంచి వచ్చిన క్షత్రియుడినని చెప్పారు. మైనతాయి బాబాకు పూర్తిగా సర్వశ్య శరణాగతి చేసింది. బాబాని ఒకసారి విమర్శించినా నానాయే బాబాను ప్రార్ధిoచినాడు. ఇప్పుడు జరిగిన సంఘటనలో బాబా క్షత్రియ ధర్మాన్ని పాటించి మైనతాయిని నానాసాహెబ్ చందోర్ కర్ని రక్షించారు.   

శ్రీరామచంద్రులవారు తన క్షత్రియ ధర్మాన్ని పాటించారు. బాబా టాంగా తోలేవానిగా నటించి తాను ఘర్వాల్ నుంచి వచ్చిన క్షత్రియుడిని అని చెప్పడం వల్లబాబా కూడా క్షత్రియుడయి ఉండవచ్చని నేను (సాయి.బా.ని.స.) భావిస్తున్నాను. మరొక్కసారి సాయి భక్తులందరకు నేను విన్నవించుకొనేదేమెటంటే ఇది పూర్తిగా నా స్వంత భావన మాత్రమే. 

మనమింకాస్త ముందుకు వెడదాము.  .......    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment