09.10.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి
రామాయణంలో శ్రీ సాయి నాలుగవ భాగము
"తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా, దానికి తగిన శిక్షను అనుభవించవలసినదే" అని గౌతమ మహర్షి అహల్యకు శాపమిచ్చే సందర్భములో రామాయణంలో చెప్పారు. సాయిసత్ చరిత్ర 14వ. అధ్యాయములో కాంతా కనకాలే ఆధ్యాత్మిక పురోగతికి అవరోధాలని చెప్పబడింది.
సాయి సత్ చరిత్ర 49 వ. అధ్యాయములో ఒక భక్తుడు సకుటంబంగా సాయి దర్బారుకు వచ్చాడు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ బాబా ప్రక్కనే కూర్చుని ఉన్నాడు.
ఆ వచ్చిన కుటుంబములోని ఒక స్త్రీ బాబా ఆశీర్వాదములు తీసుకోవడానికి ఒక్క క్షణం తన మేలి ముసుగును తీసింది.
అధ్బుతమైన ఆమె సౌందర్యానికి నానాసాహెబ్ కు మనసు చలించి అతని మనసులో ఆమెను మరలా మరలా చూడాలనే కోరిక జనించింది. అపుడు బాబా తన సటకాతో నానాను మెల్లగా తట్టి, "అందం భగవంతుని సృష్టి. మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా కళ్ళతో చూసి ఆనందించవలసినదే. నీకు చెందని దాని కోసం నీవు ఆశపడకూడదు. '
ఒకసారి నేను ధ్యానంలో ఉండగా బాబా నాకు ఈవిధంగా సలహా ఇచ్చారు "సంసార జీవితంలో నీకు నీభార్య ఉండగా పరస్త్రీ గురించి ఎందుకాశపడతావు? భార్య పంచదారవంటిది.జీవితంలో నీకు నీభార్య ఉండగా పరస్త్రీని (పంచదార) కోరడములో నీవు చక్కెర వ్యాధిని (మధుమేహము) కొని తెచ్చుకోవడంవంటిది. (మధుమేహమనగా కష్టాలను కొనితెచ్చుకోవడము)" ఆరోగ్యకరమైనమైన, ప్రశాంతమైన జీవితం కావాలనుకున్నవాడికి పరస్త్రీ వ్యామోహం తగదని రామాయణంలోను, శ్రీ సాయి సత్చరిత్రలోను చెప్పబడింది.
తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్ర మహర్షికి వశిష్ట మహాముని సాదరంగా స్వాగతం పలికి తన ఆశ్రమాన్నంతా చూపించినారు.
ఇందులో నాకు కామధేను( గోవుయొక్క) ప్రాధాన్యత గురించి అర్ధమయింది. రామాయణంలో వశిష్ట మహాముని "కామధేనువు శబల" గురించి వివరంగా చెప్పారు. ఆ కామధేనువు వచ్చిన అతిధులకి వివిధ రకాలయిన పంచభక్ష్య పరమాన్నాలను ఇస్తూ ఉండేది.
శ్రీ సాయి సత్చరిత్ర 27వ. అధ్యాయములో నాకు ఇటువంటి సంఘటనే కనపడింది. లక్ష్మి కాపర్దె ఒక రోజు మధ్యహన్నము వేళ తాను స్వయంగా తయారు చేసిన వంటకాలను, తీపి పదార్ధాలను బాబాకు సమర్పించడానికి ద్వారకామాయిలోకి వచ్చింది. అప్పటికే బాబాగారు భోజనం చేయబోతున్నారు.
ఆయన తనవద్దనున్న వంటకాలన్నిటినీ ప్రక్కకు పెట్టి, లక్ష్మి తెచ్చిన పదార్ధాలను తినడం ప్రారంభించారు. మేము తెచ్చినవాటినన్నిటిని వదలి లక్ష్మి తెచ్చిన వాటిని ఎందుకంతా ఆతృతగా తింటున్నారని బాబాను శ్యామా అడిగాడు.
బాబా లక్ష్మి యొక్క గత ఐదు జన్మల వృత్తాంతాన్ని వివరించారు. ఐదు జన్మల క్రితము ఆమే ఆవుగా నాకు మంచి పాలను ఇస్తూ ఉండేది. ఆ తరువాత ఆమె ఒక తోటమాలి యింట, ఒక వణిజుని యింట, ఒక క్షత్రియుని యింట, జన్మించి ఈ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కాపర్దేనువివాహమాడి ఆమె నా దర్శనానికి వచ్చి నాకు పంచభక్ష్య పరమాన్నములతో కూడిన భోజనము సమర్పించినది. నేనెంతో తృప్తిగా ఆరగిస్తున్నాను. నేను మరొక రెండు ముద్దలు తిన్న తరువాత నీకంతా వివరంగా చెపుతాను."
ఆవిధంగా బాబా లక్ష్మి కాపర్దే యొక్క అయిదు జన్మల వృత్తాంతాన్ని వివరించారు. రామాయణంలోని కామధేనువు శబలకు, ఇప్పటి లక్ష్మికి మధ్యనున్న పోలికలను మీకు తెలియచేసాను.
(అయోధ్యకాండకు వెళ్ళడానికి తయారుగా ఉండండి)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment