Wednesday 22 August 2012

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 10


22.08.2012  బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

            
                                  

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 10

86.  మనము ఎక్కడ నివాసము ఏర్పరుచుకుంటే అదే మనఊరు.అక్కడివాళ్ళే మనవాళ్ళుమనం వాళ్ళతో కలసిపోయి జీవితములోఒడిదుడుకులు లేకుండ చూసుకోవాలి.

     - 04.07.93


87.  చదువు చేప్పే గురువుని నేనే

     నేర్చుకొనే శిష్యుడుని నేనే

     దానము ఇచ్చే దాతను నేనే

     దానము స్వీకరించే గ్రహీతను నేనే.

     - 11.07.93

88.  నీతల్లిదండ్రుల ఋణము ఎలాగూ తీర్చుకోలేదు.  కనీసమువాళ్ళ దశదిన కర్మలునాడు అన్నదానము చేసి వాళ్ళ ఋణముతీర్చుకో
     - 11.07.93

89.  నీగురువు పాదాలను గట్టిగా పట్టుకో.  పట్టు వదలరాదు.  
అపుడు నీలో జ్ఞాన దీపాలు వెలిగి చీకటి తొలగిపోతుంది.

     - 15.07.93

90.  నీబరువు బాధ్యతలు తీరిపోయిన - కర్మలను ఆచరించటానికిసంపాదన అవసరము.  నీలో ఆరోగ్యము ఉన్నంత వరకు సంపాదనచేయటము కూడా నీవు ఆచరించవలసిన కర్మలలో ఒక భాగమే.

     - 15.07.93

91.  నీతోడపుట్టినవాడు నీకంటే ఎక్కువ ధనము సంపాదించినాడనిఅసూయ -  నీకంటే తక్కువ హోదాలో యున్న వ్యక్తి నీసహపంక్తిలోభోజనము చేసినాడు అనే ద్వేషము - ఉన్నంతకాలము నానుండిప్రేమను పొందలేవు

     - 16.07.93

92.  పాలలో నీరు పోసిన రోజున ఆపాలు పలచన అవుతాయిశ్రీసాయి అనేపాలలో భక్తి అనే నీరుపోసిన ఆపాలు చిక్కబడుతాయిశ్రీసాయి అనే సూర్యుని కిరణాలు నీయింటవికసించనీ,  జ్ఞానపుష్పాలుపై పడగానే అవి వికసించుతాయి.

     - 17.07.93

93.  స్నేహితుల దగ్గరబంధువుల దగ్గర అప్పు చేయవద్దు.  నీవుచేసిన అప్పులు ఆఖరికి నీశవపేటికకు వాడే మేకులు కొనడానికిమాత్రమే పనికి వస్తాయి -   జాగ్రత్త.


     - 19.07.93

94.  నీవు భోజనము చేస్తున్నపుడు నీప్రక్కవాడికి భోజనముపెట్టడము ధర్మము.  వాడు నిరాకరించినాడు అని బాధపడటము నీఅవివేకము.  వాడు భోజనము చేసిన తర్వాత నీకు కృతజ్ఞతచెప్పలేదు అని తలంచటము నీమూర్ఖత్వము.

     - 22.07.93

95.  నీవు ఎంత గొప్ప పదవిలో యున్నా నిరాడంబర జీవితానికిగుర్తుగా నీతోటివానితో కలసి భగవంతుని ప్రార్ధించు.  నీతోటివానితోకలసి సహపంక్తి భోజనము చేయి.  ఏకాంతముగా యున్నపుడుకటిక నేలమీద నిద్రించు

     - 24.07.93

96.  ఈద్వారకామాయిలో పూజల కోసమునమాజు చేసుకోవటానికివచ్చే భక్తులను వారివారి గమ్య స్థానాలకు చేరవేసే బస్సు డ్రైవరునునేనే.


     - 27.07.93

97.  నీవు ఆధ్యాత్మిక రంగములో ఒకేసారి అన్ని మెట్లు ఎక్కగలనుఅనే అహంకారముతో పరిగెత్తి మెట్లు ఎక్కితే జారిపడిపోగలవు జాగ్రత్త.

     - 26.07.93

98.  నీకు పిల్లలు జన్మించలేదని బాధపడవద్దు.  అనాధశరణాలయములోని పిల్లలు నాపిల్లలే.  నీవు వారితోకలసిమెలసి పిల్లలు లేని లోటు తీర్చుకో.

     - 27.07.93

99.  నీతోటివారికి ఆకలి వేసినపుడు నన్ను తలచుకొని వానికిఅన్నముపెట్టు.  
అది నాకే చెందుతుంది.  నీతోటివానిపై అసూయద్వేషాలుపెంచుకొన్న అవి నిన్నే దహించి వేస్తాయి.

     - 28.07.93


100. "సబ్ కా మాలిక్ ఏక్ హై" - అల్లా మాలిక్ హై " అని ఆనాడుమీకు చెప్పినాను.  
                                                       
ఈనాడు మీకు చెప్పేది వినండి. "హం సబ్ కా ఖూన్ ఏక్ హై - సాయిఉస్ ఖూన్ కా తాకత్ హై".

    - 10.08.97

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



No comments:

Post a Comment