25.08.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 12
111. ప్రకృతిలో స్త్రీపురుషుల కలయికను
- జనన మరణాలను సమదృష్టితో చూడాలి అంతే గాని వివాహముతర్వాత జననము అయితే సంతోషపడటము, మరణము సంభవించితేవిచారించటము మంచి పధ్ధతి కాదు. జనన మరణాలను ప్రకృతిధర్మముగా పరిగణించాలి.
- 02.10.1993
112. పరిపూర్ణ జీవితము గడిపిన వ్యక్తి చావు భోజిలోని (వైకుంఠ సమారాధన భోజనము) ప్రసాదము భగవంతుని పేరిట యివ్వబడేప్రసాదముకంటే గొప్పది అనే విషయము మర్చిపోవద్దు.
- 02.10.1993
113. సంసార సాగరములో మానసిక జ్వరముతో బాధపడేవాళ్ళనుశారీరిక జ్వరముతో బాధపడే వాళ్ళను ప్రశాంతముగా ఈతకొట్టనిచ్చివాళ్ళను గట్టు ఎక్కించే బాధ్యత నాది.
- 02.11.93
114. చక్కెరవాధి ఉన్న రోగి డాక్టర్ చెప్పిన మాట ప్రకారముమిఠాయి తినరాదు. రొట్టెను మాత్రమే తినాలి. కాని ఆరోగి రొట్టెమధ్యమిఠాయిని పెట్టుకొని ఎవరు చూడటములేదని మిఠాయిని తింటేఎవరికి నష్టము.
అలాగే సద్గురువు చెప్పిన మాటలు వింటూ దానికి వ్యతిరేకముగాతనపని తాను చేసుకొనిపోతే ఎవరికి కష్ఠము ఆలోచించు.
- 05.11.93
115. నీపూర్వీకులు అందరు చనిపోయినారు. వాళ్ళనుఈరాతిబండమీద దహనము చేసినారు. ఆఖరికి ఆరాతి బండకూడావేడికి పగిలిపోయినది. యింకా ఆరాతి బండమీదనే నీవాళ్ళనుదహనము చేసినారు అనే విచారము దేనికి - మరచిపో.
- 18.11.93
116. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయము చేయటానికివెళ్ళినపుడు ముందు వాళ్ళు నీరాకకు భయపడటము సహజము. అటువంటి భయానికి కూడా తావు యివ్వకుండ ఎవరికి తెలియనివిధముగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయము చేసి వారినిమర్చిపో.
- 20.11.93
117. భగవంతుని ఏవిధముగా పూజించినా ఫరవాలేదు. పూజతర్వాత భగవంతుని అనుగ్రహము సంపాదించాలి కాని అప్పులవాళ్ళబాధను మాత్రము కాదు.
- 30.11.93
118. మనిషి జీవితము నాగుపాము జీవితమువంటిది. అహంకారము అనే కుబుసాన్ని వదలిపెట్టి ఈశ్వరుని మెడలోహారముగా మారాలి.
- 06.01.94
119. ఆత్మ లింగము పేరిట స్పటికలింగాలు ప్రదర్శించటము ఒకగారడీ విద్య.
ఆత్మకు స్వరూపములేదు. ఆత్మలింగము ప్రశ్నేలేదు.
- 11.03.94
120. ఈజగత్తులో ప్రాణము నిలుపుకోవటానికి ముఖ్యమైనదినీరు.
అదే జీవశక్తికి మూలాధారము. అదే పరమేశ్వరుడు ప్రసాదించినజీవశక్తి.
- 11.03.94
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment