16.08.2012 గురువారము
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 5
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
41. భార్యభర్తలకు ఒకరిపై యింకొకరికి మోహము అనేది వారి జీవిత బరువు బాధ్యతలు నిర్వర్తించటానికి చాలా అవసరము. ఆబరువు బాధ్యతలు పూర్తి అయిన తర్వాత వారు యిరువురు భగవంతుని వ్యామోహముతో భక్తిమార్గములో పయనించాలి.
- 17.06.96
42. చెడు అలవాట్లకు మొదట్లో చాలా గిరాకీ యుంటుంది. ఆఖరికి ఆగిరాకీ తగ్గిపోయిన తర్వాత మంచి అలవాట్లు కోసము తపన పడిపోతారు ప్రజలు. ఆతపన జీవితములో తొందరగా వస్తే బ్రతికిపోతారు. లేకపోతే ఆల్ప ఆయుష్ తో మరణించుతారు ప్రజలు.
- 21.06.96
43. నీశత్రువు ఈత చెట్టులాంటివాడు. నీశత్రువుని నీవు
కౌగలించుకోనవసరములేదు.
ఈత చెట్టుకు తియ్యటిపండ్లు ఉన్నవిధముగానే నీశత్రువులో కొన్ని మంచి గుణాలు యుండవచ్చు. ఆమంచి గుణాలను నీవు స్వీకరించు.
- 12.07.96
44. ఈప్రపంచములో నీవు నీశత్రువుతో పోరాడే సమయములో నీబంధువులు, స్నేహితులు నీకు తోడుగా నిలచి నీకు సహాయము చేస్తారు. మరి నీవు మరణము అనే శత్రువుతో పోరాడే సమయములో నీకు సహాయము చేయటానికి ఎవరు వస్తారు అని ఒక్కసారి ఆలోచించు.
- 12.07.96
45. పసిపాపకు జన్మ యివ్వబోతున్న స్త్రీ పరిస్థితి, జీవితములో ఆఖరి క్షణాలు లెక్కపెడుతున్న మసలివాని పరిస్థితి, ఒక్కలాగే యుంటుంది. ఆస్త్రీ భగవంతుని స్మరించుతూ ఒకరికి జన్మ యిస్తుంది.
ఆముసలివాడు భగవంతుని స్మరించుతూ
పునర్ జన్మకు ఎదురు చూస్తూ ఉంటాడు.
- 10.08.96
46. బ్రతికి యున్న మనిషిని పూజించలేకపోయిన ఫరవాలేదు. ఆవ్యక్తి మరణీంచిన తర్వాత అతని పుణ్య తిధిరోజున మనసార అతనికి నమస్కరించటము గొప్పవిషయము ఈవిషయాన్ని ఆబ్ధీకము పేరిట మన సాంప్రదాయములో చేస్చినారు మన పూర్వీకులు.
- 25.08.96
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment