Wednesday, 29 August 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 15



                                        
29.08.2012  బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు  బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 15

141.  జలతరంగిణి వాద్యములో మనము పోసే నీరును బట్టి ధ్వనితరంగాలు సృష్ఠించబడతాయి.  
 
అదే విధముగా జీవితములో మనకు ప్రశాంతత కావాలి అనే కోరికను బట్టి మన జీవితములో ప్రశాంతత లభించుతుంది.   

      - 08.09.97

142.  కళ్ళు లేకపోయిన ప్రపంచమును చూడలేకపోయిన ఆవ్యక్తి భగవంతుని గొప్పతనాన్ని గానం చేస్తున్నాడే 

మరి కళ్ళు ఊండి కూడా నీవు భగవంతుని గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నావే! మరి నీవుకళ్ళు ఉన్న కబోదివా!  
 
      - 09.10.97

143.  అతిగా భోజనము చేసినపుడు అనారోగ్యము వస్తుది.  అతిగా యితరుల గురించి మాట్లాడేటప్పుడు గొడవలు వస్తాయి.  అందుచేత అనారోగ్యము కలగకుండయుండేలాగ, జీవితములో గొడవలు రాకుండయుండేలాగా మార్గాన్ని నీవే వెతుకు. 

      - 09.10.97

144.  పసిపిల్లలు ఆటలు ఆడేటప్పుడు దెబ్బలు తగిలించుకొంటారు.  
 
అయినా ఆబాధలను మర్చిపోయి మరుసటిరోజున ఆటలు ఆడటానికి ఆటస్థలానికి వస్తారు.  అదేవిధముగా జీవితము అనే మైదానములో ఎన్ని కష్టాలు   వచ్చిన ఆటలు ఆడటానికి నిత్యము సిధ్ధపడాలి.  

      - 07.11.97

145.  నీగురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నీవు వారిని శిక్షించుతున్నావు.  అపుడు ఆశిక్ష అనుభవించినది నేనే.  మరి నీపై కోపముతో నీప్రత్యర్ధి నిన్ను శిక్షించుతున్నాడు.  అపుడు ఆశిక్షను అనుభవించినది నేనే.  మీరు యిరువురు ఒకరిని యింకొకరు శిక్షించుకొంటున్నారు.  కాని ఆశిక్షను అనుభవించుతున్నది నేను.  యిది మీకు న్యాయమా?  

      - 11.11.97

146. నీవు కష్టపడి సంపాదించిన ధనాన్ని దొంగలు దోచుకొనిపోయిన రోజున నీవు బాధపడలేదు.  మరి ఈనాడు ఎవరో ఏదో ఒక చిన్నబహుమానాన్ని నీకు యిచ్చినారు అని తెలిసి సంతోషపడటములో అర్ధము ఉందా !

      - 21.11.97

147. యితరులతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేటప్పుడు వినయవిధేయతలతో మాట్లాడాలి.  అహంకారము ఆధ్యాత్మిక రంగానికి శత్రువు.  అందుచేత ఆశత్రువుని ముందుగా సం హరించి ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించు.  

      - 27.11.97

148. భగవంతుని విధేయసేవకుడు "హనుమాన్" అతడు భగవంతుని భక్తులను సదాకాపాడుతూ ఉంటాడు. 
 
      - 09.12.97

149. ప్రాపంచిక రంగములో ఉన్నతస్థితిలో ఉన్నవానినుండి సహాయమును నీవు కోరితే నీకు మిగిలేది అశాంతి. 

     ఆధ్యాత్మిక రంగములో ఉన్నతస్థితిలో ఉన్నవానినుండి సహాయమును నీవు కోరితే నీకు లభించేది శాంతి.  

      - 31.12.97

(అయిపోయింది)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  

No comments:

Post a Comment