శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 9
21.08.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 9
76. ఆపదలలో ఉన్న తన పిల్లలను తల్లికోడి తన రెక్కల క్రింద దాచికాపాడునట్లుగా
- ఈ ద్వారకామాయి తన పిల్లలను ఆపదలనుండి రక్షించుకొంటుంది.
- 04.04.97
77. ఇంటిదగ్గర బంగారు నగలను దాచుకొని తీర్ధ యాత్రలకుబయలుదేరి అనుక్షణము యింటదాచిన బంగారు నగలు గురించి
ఆలోచించుతూ ఉంటే యింక ఆ తీర్ధ యాత్రలకు అర్ధము ఏమిటి ? ఆలోచించు.
- 13.05.97
78. నీతల్లిని గుళ్ళుగోపురాలకు తీసుకొని వెళ్ళటముముఖ్యముకాదు. ఆమె ఆఖరి శ్వాస తీసుకొనే సమయములోఆమెకు గుక్కెడు నీరు త్రాగించటము ముఖ్యము.
- 13.05.97
79. ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో గురువు బస్సు డ్రైవరుగాయుండి మనలను ముందుకు తీసుకొనివెళతారు. ఆప్రయాణములోమధ్యలో ఎవరైనా దిగిపోతే వారి గురించి ఆడ్రైవరు (గురువు)బస్సును ఆపరు.
బస్సులో మిగిలియున్న కొద్దిమందితోను ముందుకు సాగిపోతారు.
- 13.05.97
80. ఎవరో తప్పుడు పనులు చేస్తూ సుఖముగా జీవించుతున్నారుఅని నీవు గట్టిగా అరచినా వారు ఆపనిని మానివేయరు కదా! మంచిమార్గములో ప్రయాణము చేసేవారికి మాత్రమే సుఖశాంతులులభించుతాయి. "నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏమి చేయాలిఅనేది నీవు ఆలోచించుకోవాలి."
- 16.05.97
81. జీవించటానికి కొందరు శ్రమపడి ఫలాన్ని సంపాదించుతారు. జీవించటానికి కొందరు దొంగతనము చేసి ఫలాన్ని సంపాదించుతారు. జీవించటము ముఖ్యము అయినపుడు జీవించటానికి ఎన్నుకోవలసినమార్గము కూడా ముఖ్యమైనదేకదా - నీవు ఎన్నుకోవలసినమార్గము నీవిజ్ఞత మీద ఆధారపడినది.
- 29.05.97
82. జీవించటానికి మానవుడు ప్రకృతిలోని అడవులను కొట్టివేసిమేడలు కడుతున్నాడు.
ఈప్రపంచములో జీవించటానికి మానవులకు ఎంత హక్కు ఉందోఅడవులలో జీవించుతున్న జీవరాశులకు అంతే హక్కు ఉంది
- 29.05.97
83. భగవంతుని గొప్పతనాన్ని నేను కళ్ళారా చూసేను. మీకళ్ళకుఉన్న అజ్ఞాన పొరలను తొలగించి మీలో ఉన్న జ్ఞానముతో భగవంతునిమీకు చూపటమే నా కర్తవ్యము.
- 14.06.97
84. వృధ్ధాప్యములో నీకు మంచినీరు అందించటానికి నీపిల్లలునీదగ్గర ఉండనవసరము లేదు. నీమనసు మంచిది అయితే నీప్రక్కయింటి పిల్లవానిని నీపిల్లవానిగా ప్రేమించు. ఆపిల్లవాడే నీకు గుక్కెడునీరు అందించుతాడు నీ ఆఖరి క్షణాలలో.
- 14.07.97
85. శ్రీహరిని కీర్తించేవారు కూడా తమ ఆయువు తీరిన వెంటనేశరీరాన్ని వదలివేస్తారు. శ్రీహరిని కీర్తించేవారికి ఆయువుపెరగకపోయినా మరణానంతరము హరిసాన్నిధ్యము కలిగితీరుతుంది.
- 15.97.97
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment