17.12.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 6
47. పిల్లలు పుట్టలేదని పసి పిల్లలను తెచ్చి పెంచుకొంటారుకొందరు. ఆపసిపిల్లలు తమ పిల్లలు కారుకదా అనే ఆలోచనలతోఆపెంపుడు తల్లిదండ్రులు,
తమ పిల్లలు ఎలాగ పెరుగుతున్నారు అనేఆలోచనలతో
కన్న తల్లిదండ్రులు,
ఆలోచనా తరంగాలలో బాధపడుతూఉంటారు.
తమ పిల్లలు ఎలాగ పెరుగుతున్నారు అనేఆలోచనలతో
కన్న తల్లిదండ్రులు,
ఆలోచనా తరంగాలలో బాధపడుతూఉంటారు.
అందుచేత భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని అర్ధముచేసుకొని తలనొప్పిలేని జీవితాన్ని గడపాలి తల్లితండ్రులు.
- 01.09.96
48. క్రీ.శ. 1918 నాటికే సినీమాల ప్రభావము సమాజముపైపడినది. ఆనాటి సినీమాలు నేటి (1996) సమాజములో నైతికవిలువలు పాడవటానికి పునాదిరాళ్ళుగా మిగిలినవి.
- 08.09.96
49. క్రీ.శ.1918 ముందు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ గురించిఎక్కువగా ఆలోచించేవారు కాదు. వారికి భగవంతునిపై చాలానమ్మకము యుండేది. భగవంతుడు వారి పిల్లలను చక్కగా తీర్చిదిద్ది చక్కని భవిష్యత్ ను ప్రసాదించేవాడు.
- 08.09.96
50. నాపై నీకు నమ్మకము కలగటానికి నేను నీగతించిన జీవితచరిత్రను నీకు చెబుతాను. దానితో నీకు నాపై నమ్మకము కలిగిభవిష్యత్ లో నేను చూపే మంచి మార్గములో నీవు ప్రయాణముచేస్తావు.
- 15.09.96
51. సాయి పేరిట ఎంతసేపు భజన చేసినాము అనేది ముఖ్యముకాదు. సాయి పేరుతో ఏవిధముగా జీవించుతున్నాము అనేదిముఖ్యము.
- 28.09.96
52. ప్రాపంచిక రంగములోని ప్రయాణము ఆఖరులో కాలికిఅంటుకొన్న బురదను కడుగుతాము. ఆధ్యాత్మిక రంగములోనిప్రయాణము మొదటిలో మనసుకు అంటుకొన్న బురదనుకడుగుతాము.
- 28.09.96
53. నీగత జీవిత అనుభవాలను పునాదిరాళ్ళుగా చేసుకొనిఈవర్తమానంలో చక్కటి మేడను నిర్మించు. అందు ప్రశాంతముగాజీవించుతు మంచి భవిష్య ను ఆశించు.
- 10.10.96
54. నీవు జితేంద్రుని దగ్గర నమ్మకముగా పని చేసిన రోజున వేరేగాఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోనవసరము లేదు.
- 11.10.96
55. దొంగలు నీయింటిని దోచుకుంటారు. బందుమిత్రులు నీశరీరకష్టాన్ని దోచుకుంటారు.
నీభార్య పిల్లలు నీమనసును దోచుకుంటారు.
రోగాలు నీశరీరాన్ని దోచుకొంటాయి.
యిక మిగిలినది నీఆత్మ.
నీఆత్మ గురించి తెలుసుకోవటము అంటే నిన్ను నీవుతెలుసుకోవటం.
- 05.10.96
(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment