Saturday, 31 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (18)
సాయి.బా.ని.స. డైరీ - 1995 (18)

31.03.2012 శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 18 వ.భాగాన్ని చదువుకుందాము.

10.07.1995

నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో కలిగే ఋణానుబంధములు గురించి చెప్పమని వేడుకొన్నాను. 

Friday, 30 March 2012

సా.యి.బా.ని.స డైరీ - 1995 (17)

సా.యి.బా.ని.స డైరీ - 1995 (17)

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1995 17 వ. భాగాన్ని చదువుకుందాము.

Thursday, 29 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (16)29.03.2012 గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 16వ. భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.. డైరీ - 1995 (16)
01.06.1995
నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి "గత జీవితములోని స్నేహితులతో ఏవిధముగా మసలుకోవాలి చెప్పు తండ్రి" అని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి చూపిన దృశ్యాలు.
1) అది గోల్కొండ కోట. పాతబడిన భవనాలు. ఆభవనాల్లో నివసించిన నవాబుల చరిత్రను గైడు చెప్పసాగినాడు.
యాత్రికులు అందరు శ్రధ్ధగా వినసాగినారు. సాయంత్రము అయినది. ఆభవనాలలో దీపాలు పెట్టేవారు కూడా లేరు. యాత్రికులు బరువైన మనసుతో తమ యిండ్లకు వెళ్ళిపోయినారు.
2. అది పాత పాడుబడిన టేప్ రికార్డరు. అతి కష్ఠము మీద దాని టేప్ మీద కొత్త సినీమా పాటలు రికార్డు చేసినాను. వినాలని కుతూహలముతో ఆటేప్ రికార్డరును ఆన్ చేసినాను. టేప్ రికార్డరులోని మోటారు మెల్లిగా తిరగటము వలన కొత్త సినీమా పాట కూడా పాతకాలము పాటలాగ వినబడసాగినది. ఆపాట వినలేక ఆపాత టేప్ రెకార్డరును ఆఫ్ చేసినాను.
02.06.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ శిరిడీలోని నీసమాధి గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యము. అది శిరిడీ గ్రామము. ఆగ్రామములో ఒక స్త్రీ, మట్టిని ప్రోగుచేసి నమ్మకము అనే యిటికలను తయారు చేసి తన పిల్లలకు పంచసాగినది.
ఆవిధముగా యిటుకలను తయారు చేస్తూ వాటిని తన పిల్లలకు పంచుతూ ఆమట్టిలో సమాధి అయిపోయినది. యిపుడు ఆమె పిల్లలు అందరు శిరిడీకి వెళ్ళి ఆక్కడి మట్టితో నమ్మకము అనే యిటుకలను వారే తయారు చేసుకొని తమ జీవిత సౌధములను నిర్మించుకొంటున్నారు.
21.06.1995
నాలుగురోజుల క్రితము సాయంత్రము వేళలో నాలుగు పిల్లి పిల్లలు నాయింట చేరినవి.
అవి నన్ను చూసి సంతోషముతో నాకాళ్ళవద్ద గెంతులు వేయసాగినవి. సమయములో 18, 19, అధ్యాయము 162 పేజీలో శ్రీసాయి అన్నమాటలు. "ఏదైన సంబంధము యుండనిదే ఒకరు యింకొకరి దగ్గరకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువుగాని నీవద్దకు వచ్చిన నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వాటి ఆకలిని తీర్చిన మరియు వాని దాహమును తీర్చిన భగవంతుడు ప్రీతి చెందును." గుర్తుకు వచ్చినవి. వెంటనే వంట యింటిలోనికి వెళ్ళి ఒక గిన్నెలో పాలుతెచ్చి వాటికి పెట్టినాను. ఆనాలుగు పిల్లులు ఆపాలు త్రాగి వెళ్ళిపోయినవి. ఆనాటినుండి రోజు నేను ఆఫీసు నుండి తిరిగి వచ్చే సమయానికి ఆపిల్లులు నాయింట చేరి నాకాళ్ళ దగ్గర గెంతులు వేయసాగినవి.
నేను వాటికి పాలు పట్టడము ఒక అలవాటుగా మారినది. అందుచేత నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి నాయింట చేరిన ఈనాలుగు పిల్లి పిల్లలకు నాకు గల సంబంధము తెలియచేయమని శ్రీసాయిని వేడుకొన్నాను. శ్రీసాయి రైల్వే మంత్రి శ్రీ జాఫర్ షరీఫ్ రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. "గోపాలరావు నీవు 1918 సంవత్సరానికి ముందు జన్మించి యుంటే నాసేవ చేసుకొని యుండేవాడిని అని అనేక సార్లు నాపటము ముందు నిలబడి అన్నావు. 1974 సంవత్సరములో నీతండ్రి చనిపోయినారు. ఆయన 54 సంవత్సరాలకే చనిపోవటము వలన ఆయన సేవ చేసుకోలేదని అనేక సార్లు నీమనసులో బాధపడినావు. భౄణహత్య పాపము అని తెలిసి కూడ నీజీవితములో రెండుసార్లు నీభార్యకు గర్భస్రావము చేయించినావు. నిన్ను ఋణ విముక్తుని చేయటానికి నా ఆత్మ, నీతండ్రి ఆత్మ, గర్భస్రావములో చనిపోయిన నీయిద్దరి పిల్లల ఆత్మలు పిల్లిపిల్లల ఆత్మలలో ప్రవేశించి నీయింట కొన్నిరోజులు పాలు త్రాగుతాయి. నీవు ఋణవిముక్తుడివి కాగానే వాటి అంతట అవి నీయింటినుండి వెళ్ళిపోతాయి." కలలో ఈమాటలు విన్నతర్వాత నిద్రనుండి లేచి శ్రీసాయికి నమస్కరించినాను. మరి యింకా ఎన్నిరోజులు ఈపిల్లిపిల్లలు నాయింట పాలు త్రాగుతాయి వేచి చూడాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Tuesday, 27 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (15)
26.03.2012 మంగళవారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 15 వ.భాగాన్ని చదువుకుందాము.


సాయి.బా.ని.. డైరీ - 1995 (15)
27.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి జీవిత ప్రయాణములో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు.  

Monday, 26 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (14)26.03.2012 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

నుతన సంవత్సరాదికి శుభాకాంక్షలతో సాయి.బా.ని.స. డైరీ - 1995 14 వ.భాగాన్ని ప్రచురిద్దామనుకున్నాను. కాని నేను నరసాపురం నుండి విజయవాడ వెళ్ళడము వల్ల ప్రచురించడానికి ఆటంకం ఏర్పడింది. ఏమయినప్పటికీ మన సాయి బంధువులందరికీ ఆలశ్యంగానయినా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బాబా వారు మనలనందరినీ ఎల్లాపుడు చల్లగా చూడాలని ఆయన అనుగ్రహం మనందరిమీద ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను.


Wednesday, 21 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (13)


సాయి.బా.ని.. డైరీ - 1995 (13)

03.05.1995
నిన్న రాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "కష్ఠము - దఃఖము" లను వివరణ యిస్తు చూపిన దృశ్యాలు - వాటి వివరణ. 

సాయి.బా.ని.స. డైరీ - 1995 (12)
20.03.2012 మంగళవారము

.
సాయి.బా.ని.. డైరీ - 1995 (12)
18.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీ సాయి నేటి సమాజములోని కొందరు వ్యక్తుల నడవడికను చూపించి వీరు అందరు మదముతో జీవించుతున్నారు. అటువంటి జీవితము మంచిది కాదు అన్నారు. శ్రీసాయి చూపిన వ్యక్తుల వివరాలు

Saturday, 17 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (11)సాయి.బా.ని.. డైరీ - 1995 (10)


13.04.1995
శ్రీ సాయి నిన్నరాత్రి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము.

Friday, 16 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (09)సాయి.బా.ని.. డైరీ - 1995 (09)
06.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి, యిచ్చిన సందేశము.

Thursday, 15 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (08)సాయి.బా.ని.. డైరీ -  1995  (08)

02.04.1995

నిన్నటిరోజు ఉగాది, నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి నూతన సంవత్సరానికి సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను.  శ్రీసాయి చూపిన దృశ్యాలు నాలో చాలా ఆలోచనలను రేకెత్తించినవి.  వాటి వివరాలు.

Tuesday, 13 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (07)సాయి.బా.ని.డైరీ -  1995  (07)


17.03.1995

నిన్నరాత్రి కలలో విచిత్రమైన దృశ్యాన్ని చూపించినారు శ్రీసాయివాటి వివరాలు.

Monday, 12 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (06)


12.03.2012  సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత పది రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది.  నేను హైదరాబాదు, అక్కడినుండి బెంగళూరుకు వెళ్ళడం వలన ప్రచురిద్దామనుకున్నాగాని వీలు చిక్కలేదు.  ఈ రోజు సాయి.బా.ని.స.  డైరీ -  1995 6వ.భాగాన్ని చదువుకుందాము.  

సాయి.బా.ని..  డైరీ -  1995  (06)

07.03.1995

 నిన్నటిరోజున జనన మరణాలు గురించి ఆలోచించి రాత్రి నిద్రకుముందు మరణము అంటే భయము లేని మార్గము చూపు తండ్రీ అని వేడుకొన్నాను. 

Friday, 2 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (05)

03.03.2012 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 5వ.భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1995 (05)
26.02.1995

జన్మలలోకెల్ల మానవ జన్మ ఉత్తమమైనది. రాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి మానవ జన్మలో చేయవలసిన మంచి పనులు చూపించు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీసాయి చూపిన దృశ్యాల వివరాలు.

సాయి.బా.ని.స. డైరీ - 1995 (04)14.02.1995

నిన్నటిరోజున మనిషిలోని స్వార్ధము దాని పరిణామాల గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి మనిషిలోని స్వార్ధమును తొలగించుకునే మార్గము చూపించమని వేడుకొన్నాను. శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.