పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
20వ.అధ్యాయము
ప్ర్లియమైన చక్రపాణి,
ఈ రోజు తెల్లవారుఝామున వచ్చిన కలను నీకు ముందుగా తెలియచేసి ఆ తర్వాత శ్రీసాయి సత్ చరిత్రలోని 20వ. అధ్యాయము గురించి వివరించుతాను. ఈరోజు తెల్లవారుఝామున (23.01.1994 - ఉ.4) వచ్చిన కలలోని వివరాలు "నేను మరియు మరికొంతమంది నదిలో నావలో ప్రయాణము చేస్తున్నాము.
నది మధ్యలో యింకొక పడవలో శ్రీసత్యసాయి మరియు యిద్దరు భక్తులు యున్నారు. శ్రీసత్యసాయి నదీమతల్లిని ఆశీర్వదించుతున్నారు. నాకుశ్ రీసత్యసాయి ఉన్న పడవ దగ్గరకు వెళ్ళవలెనని అనిపించినది . నేను ఉన్న పడవవానికి రెండురూపాయలు యిచ్చినాను. నన్ను సత్యసాయి పడవదగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరినాను.
నేనున్న పడవను నడిపేవాడు నేను కోరినట్లుగా చేసినాడు. శ్రీసత్యసాయి నాభుజముపై చేయి వేసి శ్రీసాయిని ధ్యానించమన్నారు. నేను కొంచముసేపు ధ్యానము చేసినాను. వినూత్నమైన భావన, ఆనందము కలిగినది. కళ్ళు తెరచి చూసినాను. శ్రీసత్యసాయి నేను ఉన్న పడవలోని యితర భక్తుల భుజముపై చేయి వేయగానే వారు చాలా బాధతో గిలగిల్లాడిపోయినారు. (1964 సంవత్సరములో నేను అటువంటి బాధ పడినాను) యింతలో నాకు తెలివి వచ్చినది. యిది అంతా కల కదా అనిపించినది. ఈకలకు అర్ధము ఏమిటి అని ఆలోచించినాను. నేను ప్రయాణము చేస్తున్న నావను నడుపుతున్నది శ్రీశిరిడీసాయి. నానుండి రెండురూపాయలు దక్షిణ తీసుకొని నామన్సులోని కోరికను తీర్చగలిగింది శ్రీ శిరిడీసాయి కాక యింక ఎవరు? శ్రీశిరిడీ సాయి 1964 సంవత్సరములో శ్రీసత్యసాయి రూపములో నాభుజముపై చేయి వేసినపుడు నేను గిలగిలలాడిపోయినాను. నా గతాన్ని నామనసులోని కోరికను గ్రహించి శ్రీశిరిడీసాయి, సత్యసాయి రూపములో నేను ప్రయాణము చేస్తున్న నదిలో యింకొక పడవలో నిలబడి నాకు దర్శనము యిచ్చి నాకోరిక తీర్చినారు.
ఈ విధముగా శిరిడీసాయి, తాను సత్యసాయిలోను ఉన్నాను అని తెలియచేస్తున్నారు. శ్రీశిరిడీసాయి మనము ఏరూపములో కోరితే ఆరూపములో దర్శనము యిచ్చి మన ఆధ్యాత్మిక ప్రగతికి సహాయము పడే సమర్ధ సద్గురువు. అటువంటి సద్గురువు పాదాలను నమ్ముకోవటము మన పూర్వ జన్మ పుణ్యఫలము. యింక 20వ. అధ్యాములో శ్రీసాయి తన భక్తులు భోజనము విషయములో ఎంతో శ్రధ్ధ కనపరచి పేరుపేరున పిలచి "అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము, బాబా నీబసకు పో, బాపూ, భోజనము చేయుము" అని పలకరించేవారు.
యిది యదార్ధము అనే భావన నాలో కలిగినది. నాజీవితములో జరిగిన ఒక సంఘటన నీకు తెలుపుతాను. అది చదివిన తర్వాత నీకు కూడా నాభావముతో ఏకీభవించుతావు. అది విజయదశమి రోజు (29.09.1990). ఆనాడు నాయింటికి మన యిల్లు కట్టిన తాపీ పనివాళ్ళను, కూలీలను భోజనమునకు పిలిచినాను. శ్రీసాయికి మధ్యాహ్న్న హారతి యిచ్చి అందరికి వడ్డనలు ప్రారంభించినాను. వచ్చినవాళ్ళలో నాయింట పని చేయని ఒక పది సంవత్సరాల బాలుడు యున్నాడు. బహుశ నాయింట పనిచేసిన తాపీ మేస్త్రీ బంధువు అయి ఉండవచ్చును అని తలచినాను. అందరికి మిఠాయి వడ్డించుతున్నాను. ఆకుర్రవాని విస్తరి దగ్గరకు వచ్చి మిఠాయి వడ్డించుతుంటే ఆవిస్తరి గాలికి ఎగిరిపోయినది. లడ్డు నేలమీద వడ్డించవలసి వచ్చినది. ఆకును సరిచేసి తిరిగి ఆలడ్డుని విస్తరాకులో పెట్టినాను. ఆకుర్రవానికి ఏమి పట్టనట్లుగా లేదు. తన ప్రక్కవారి కేసి చూస్తున్నాడు. తిరిగి బిరియాని వడ్డించుతు ఆకుర్రవాని విస్తరి దగ్గరకు వచ్చినాను. బిరియాని వడ్డించుతుంటే విస్తరాకు గాలికి ఎగిరిపొయినది. బిరియాని నేలపై వడ్డించినాను.
శ్రీసాయి తన భక్తుడు దాసుగణుకు ఈశావాస్యోపనిషత్తును ఆచరణలో చూపించిన విధానము నీవు బాగా చదువు. కష్ఠసుఖాలు అనేవి మన భావనలు. అవి మనోవైఖరిపై ఆధారపడి యుండునని గ్రహించు. భగవంతుడు మనకు యిచ్చినదానితో సంతోషము పడవలెను. యితరుల సొమ్మును మనము ఆశించరాదు. మనకు ఉన్నదానితో సంతుష్టి చెందవలెను.. యివి అన్నీ మనము ఆచరణలో పేట్టగలిగిన రోజున జీవితములో అశాంతి అనేది చోటు చేసుకోదు. తృప్తిగా సుఖప్రదమైన జీవితాన్ని గడపవచ్చు.
అటువంటి జీవితాన్ని నీకు సాయి ప్రసాదించాలని ఆసాయినాధుని వేడుకొంటున్నాను.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment