26.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9
శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
8. అనాధ ప్రేత సంస్కారము
శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయములో మేఘశ్యాముడి గురించివివరాలు చదవండి. మేఘశ్యాముడు బాబాకు అంకిత భక్తుడు. అతను బాబా సమక్షములో తన 35వ.సంవత్సరములోమరణించాడు. షిరిడీలో అతనికి బంధువులు ఎవరూ లేరు. బాబాసేవలోనే తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు. ఒంటి కాలుపైనిలబడి బాబాకు హారతి ఇచ్చిన మహానుభావుడు. అటువంటిమేఘశ్యాముడు మరణించినపుడు బాబా చిన్న పిల్లవానివలేదుఃఖించి అతని శవమువెంబడి స్మశానమువరకు వెళ్ళి అక్కడఅతని పార్ధివ శరీరానికి అంతిమసంస్కారాలు చేయించి,సాయిభక్తులు కూడా అనాధప్రేత సంస్కారం చేయవలసినది అని ఒకమంచి సందేశాన్నిచ్చారు.