Sunday 7 May 2017

ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు - 1

    Image result for images of shirdisai
       Image result for images of rose hd
  07.05.2017 ఆదివారమ్
    ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
     సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

           రోజునుండి సాయిబానిస గారి  “ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు ప్రచురిస్తున్నాను.  చదివి మీ అభిప్రాయాలను తెలపండి.

ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు - 1
        
         సంకలనం :  ఆత్రేయపురపు త్యాగరాజు
        E mail. Id.   Tyagaraju.a@gmail.com

1.            నీ  కష్ట  సుఖాలను భగవంతునితో పంచుకో.  అదే నీసుఖాన్ని మాత్రము నీతోటివానితో పంచుకో.

2.            నీవు ఆధ్యాత్మిక సాగరములోని ఒక కెరటానివి.  సాగర తీరాన్ని తాకే ప్రతిసారి భగవంతుని పాదాలను కడుగుతున్న అనుభూతిని పొందు.

3.            నీలో దాగి ఉన్న అనంతమైన ప్రేమను నీతోటివానితో పంచుకోలేనపుడుఆప్రేమకు అర్ధము లేదు.

4.            ప్రేమ ఒక పవిత్రమైన నదివంటిది.   నది సాగరములో కలిసే ముందు ఎందరి దాహమునో తీర్చాలి.

5.            ముందుగా నిన్ను నీవు నీ అధీనములో ఉండే స్థితిని అలవరచుకో.  అపుడు నీజీవితములో నీకు ఎదురు పడే కష్ఠసుఖాలు ఏమి చేయలేవు.

6.            నీజీవితములో కోరికలు అనే వృక్షము అతిగా పెరిగిపోతుంటే ఆవృక్షము కొమ్మలను నరకటము అవివేకమునీవు నీహృదయములో దాగియున్న ఆవృక్షము వేర్లను నరకడము అలవాటు చేసుకో.  (సమయానుకూలముగా వేరులను నరుకుతూ వృక్షము మహావృక్షముగా మారకుండా చూసుకో)

7.            నీజీవితములో అపజయాలను చూసిన తర్వాత ఇంక విజయాలను సాధించలేను అని తలచటము అవివేకము.  విజయాన్ని సాధించలేకపోయినా ఫరవాలేదుకాని అపజయాలకు తలవంచవద్దు.

8.            నీకు తెలిసిన విషయాలనుండి సత్యమును గుర్తించటము సులువు.  కాని నీకు తెలియని విషయాలలో తలదూర్చి సత్యశోధన చేయటము అవివేకము.

9.            నీవు కొండరాళ్ళమధ్య ఒక రాయి అయినా ఫరవాలేదు.  ఏనాటికైన ఒక శిల్పి వచ్చి ఆరాయిని ఒక సుందర శిల్పంగా మలచుతాడు అనే ఆశతో జీవించు.

10.          అడవిలోని వెదురు చెట్లు తమ రూపాన్ని కోల్పోయి అనేక విధాలుగా మానవాళికి ఉపయోగపడుతున్నాయి.  కాని కొన్ని వెదురు కొమ్మలు మాత్రము వేణువుగా మారి మంచి సంగీత విద్వాంసుని పెదాలను ముద్దుపెట్టుకొని సంగీత సామ్రాజ్యములో తమ స్థానాన్ని నిలబెట్టుకొనుచున్నవి.

11.          సంసారసాగరములో వచ్చే కష్టసుఖాలు అనే కెరటాల మధ్య,  భగవంతుని భక్తుడు ప్రశాంతముగా ఈత కొడతాడు.  అదే నాస్తికుడు కెరటాల తాకిడికి  సంసార సాగరములో మునిగిపోతాడు.

12.          నీలోని ఆత్మ మరియు నీతోటివానిలోని ఆత్మ ఒక్కటే అని నీవు భావించినపుడు నీతోటివాడు మానసికముగా బాధపడుతుంటే అదే బాధను నీవు అర్ధము చేసుకోగలగాలి కదా!

       (ఇంకా ఉన్నాయి)
       (సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment