25.05.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది
(శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
7. మానవ సేవయే మాధవసేవ (రెండవ భాగమ్)
ఉ. కుష్టురోగుల కాలనీలు - అశ్రమాలు
ఆనాడు షిరిడీలో భాగోజీ షిండే కుష్టురోగంతో బాధపడుతూ ఉంటే షిరిడీ ప్రజలు అతనిని దగ్గరకు రానీయలేదు. బాబా మాత్రం భాగోజీ షిండేను చేరదీసి ద్వారకామాయిలో తన సేవకుడిగా అతనికి స్థానం ఇచ్చారు.
బాబా ముందుగా భాగోజీషిండే కుష్టువ్యాధి నివారణకు సహాయం చేసారు.
ఆ తరువాత భాగోజీ షిండే తన జీవితాంతం వరకు బాబా సేవ చేసుకొన్నాడు. బాబా షిరిడీకి దగ్గరలో ఉన్న గ్రామంలోని కమ్మరివాని పసిపాపను రక్షించటానికి తాను ద్వారకామాయిలోని ధునిలో చేయిపెట్టి తన చేయిని కాల్చుకొని ఆ పసిపాప కర్మను తాను అనుభవించారు. సాయిభక్తులు బొంబాయినుండి డాక్టర్ పరమానందను రప్పించిన బాబా తన చేతి గాయానికి కట్టుకట్టడానికి అంగీకరించలేదు. కాని భాగోజీ షిండే నిత్యం బాబా కాలిన చేతికి నేయి వ్రాసి ఆకుతో పట్టీ కట్టేవాడు. బాబా అతని సేవను అంగీకరించారు.
ఈవిధముగా కుష్టువ్యాధిగ్రస్థులను అంటరానివారుగా చూడవద్దు అని బాబా మనందరికి సలహా ఇచ్చారు.

బాబా ఇచ్చిన సందేశము, ఆదేశము ప్రకారం నేను, మాసాయిదర్బారు సభ్యులం అనేకసార్లు కుష్టురోగులకు సేవాకార్యక్రమాలు చేసాము. కుష్టురోగులపట్ల సేవాభావంతో వారు నివసిస్తున్న కాలనీలకు వెళ్ళి అక్కడ వారికి అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు చేసాము. ఈ కార్యక్రమాలు చేస్తున్న సమయంలో శ్రీసాయి మామధ్య నిలబడే ఉన్నారు అనే భావనను కలిగించేవారు.
ఒకసారి నేను నా మిత్రబృందం సనత్ నగర్ దగ్గర ఉన్న బల్కమ్ పేట కుష్టురోగుల కాలనీకి అన్నదానం, వస్త్రదానం చేయడానికి వెళ్లాము. అన్నదానంలో భాగంగా పులిహార పొట్లాలు తీసుకొని వెళ్ళాము.
వారికి అన్నదానం చేస్తున్న సమయంలో మాసిన బట్టలు ధరించిన ఒక వ్యక్తి దర్శనము ఇచ్చి, తను దగ్గరలోని గుడిపూజారినని అన్నారు. తనకు రెండు పులిహార పొట్లాలు మరియు ఒక కొత్త పంచెను ఇవ్వమని కోరాడు. అతని మాటలను విని ఇక్కడ కుష్టురోగులకు వస్త్రదానం, అన్నదానం, జరిగిన తర్వాతనే మిగిలిన ఆహారపొట్లాలు మరియు పంచెల చాపు మీకు ఇస్తాను అని మాట ఇచ్చాను. కుష్టురోగులకు వస్త్రదానం, అన్నదానం పూర్తి చేసాము. ఆశ్చర్యం – ఒక కొత్త పంచెల చాపు, రెండు పులిహార పొట్లాలు మిగిలాయి. నేను వాటిని ఆ గుడి పూజారికి దానం చేసాను. ఆ గుడిపూజారి నన్ను నాపేరుతో “గోపాలరావు! నీవు బయట ఎక్కడా భోజనాలు చేయవు. ఇపుడు మధ్యాహ్నము మూడుగంటలు కావస్తున్నది. ఇంటికి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకో” అన్నారు. నేను ఆశ్చర్యపడ్డాను. ఈ గుడిపూజారికి నాపేరు ఎలాగ తెలుసును. తర్వాత బయట భోజనాలు చేయనని ఇంటికి వెళ్ళి భోజనం చేయి అని చెప్పి నన్ను ఆశీర్వదించినది సాక్షాత్తు నా సద్గురువు శ్రీసాయినాధులవారే అని భావించి వారికి రెండు చేతులతో నమస్కరించాను. మేము అనేకసార్లు మౌలాలీలో ఉన్న కుష్టురోగుల కాలనీలో అన్నదానం, వస్త్రదానం చేసాము. మేము అన్నదానం చేస్తున్న సమయంలో బాబా మామధ్య నిలబడి ఉన్నారు అనే భావన కలిగించేవారు. సాయి భక్తులు అందరము శ్రీసాయి తత్వాన్ని అర్ధము చేసుకొని శ్రీసాయి చూపిన మార్గములో ప్రయాణము చేస్తూ మానవతాదేవత ఆశీర్వచనాలు పొందుదాము.

జై సాయిరామ్
ఊ. డాన్ బాస్కో అనాధ పిల్లల ఆశ్రమము
ఇది సికింద్రాబాద్ రైల్ స్టేషన్ దగ్గర ఉన్న బాలుర అనాధాశ్రమం. ఇక్కడ ఆశ్రమాన్ని క్రైస్తవ మిషనరీలు నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలోని పిల్లలలో చాలా మంది తమ తల్లిదండ్రులను వదలివేసి రైలులో పారిపోయివచ్చి సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ లలో తిరుగుతూంటే ఈ ఆశ్రమ సూపర్ వైజర్లు వారిని చేరదీసి ఆ పిల్లలకు ఈ ఆశ్రమంలో విధ్యాబుధ్ధులు నేర్పిస్తున్నారు.
ఈ ఆశ్రమంలోని పిల్లలు జూనియర్ కళాశాలలలోను, ఐ.టి.ఐ లలో విద్యను అభ్యసించి సమాజములో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇటువంటి ఆశ్రమాలు లేకపోతే సమాజములో అనాధపిల్లలు దొంగలుగాను, మాదకద్రవ్య వ్యాపారులుగాను, మారి సమాజానికి పెద్ద తలనొప్పిగా మారుతారు. అందుచేతనే సమాజము ఇటువంటి పిల్లలను మంచి మార్గములో పెట్టడానికి డాన్ బాస్కో అనాధ ఆశ్రమాలను ఆదుకోవాలి. ఇక్కడ సుమారు వందమంది పిల్లలు ఆశ్రయమును పొందుతున్నారు. ఈ ఆశ్రమంలో ఆరుసంవత్సరాలనుండి పదహారు సంవత్సరాల వయసు వరకు గల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు.

నేను మరియు మాసాయి దర్బార్ సభ్యులం అనేక పర్యాయాలు ఇక్కడ పిల్లలకు అన్నదానం చేసాము. విద్యాదానములో నోటు పుస్తకాలను పంపిణీ చేసాము.
ఇక్కడి పిల్లలలో చాలామంది తమ ఇండ్లలో సవతి తల్లి పెట్టే బాధలు, తాగుబోతు తండ్రి పెట్టే బాధలు భరించలేక ఇల్లువదలి పెట్టి దొంగతనంగా రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకొన్నవారే. అటువంటి పిల్లలను మానవత్వముతో డాన్ బాస్కో కార్యకర్తలు చేరదీసి పెంచి పెద్ద చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలను మనము ఎంతో గారంగా, అల్లారుముద్దుగా పెంచుతాము. మరి ఈ అనాధపిల్లల గురించి కూడా కాస్త ఆలోచించి వారికి కొంత సహాయము చేసి శ్రీసాయి అనుగ్రహాన్ని పొంది, శ్రీసాయి మార్గములో ప్రయాణము కొనసాగిద్దాము.
జై సాయిరామ్
(రేపటితో ముగింపు)
(సర్వమ్ శ్రీసాయినాధర్పణమస్తు)
No comments:
Post a Comment