Friday, 19 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది



Image result for images of shirdisai cooking
Image result for images of rose garland




19.05.2017  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో
మానవత్వము ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు
Image result for images of sai banisa

2.  మద్రాసులోని పెళ్ళిమండపము – ఎంగిలి బ్రతుకులు

అది 1990.సంవత్సరం మే నెలలో నా ఆఫీసు పని మీదమద్రాసులోని ఒక చిన్న కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్ళాను.  కంపెనీ చిరునామా సరిగా లేదు.  నేను మద్రాసు నగరములోని LICభవనం సమీపంలోని ఒక వీధిలో ఎండవేడికి తట్టుకోలేక ఒక చెట్టుక్రింద విశ్రాంతి తీసుకొంటున్నాను


దాహం వేస్తూ ఉంది.  కాని చేతిలో మంచినీరు సీసా లేదు.  బాగాఅలసిపోయాను.   చెట్టుకు కొంచము దూరములో ఒకకల్యాణమండపం ఉంది
          Image result for images of marriage functionhall at madras
              Image result for images of full meals in plantain leaf

అక్కడ పెళ్ళివారు మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసారు.  పనివాళ్ళుపెళ్ళివారి భోజనాలు అనంతరం ఎంగిలి విస్తర్లను కట్టగా తెచ్చికళ్యాణమండపం బయట ఉన్న మునిసిపాలిటీవారు ఏర్పరిచిన చెత్తకుండీలో వేశారు.   విస్తర్లలో ఉన్న ఎంగిలి మిఠాయిమరియుఅన్నము తినడానికి ఇద్దరు పిల్లలు  చెత్త కుండీలోకి దిగారుకుక్కలు రాకుండా కాపలా కాయడానికి మూడవ పిల్లవాడు  చెత్తకుండీ బయట నిలబడ్డాడు.  ఒక పదినిమిషాల తర్వాత చెత్తకుండీనుండి ఇద్దరు పిల్లలు  ఎంగిలి విస్తర్లనుండి మిఠాయిఉండలుఅన్నమును ఒక ఆకులో పెట్టుకొని బయటకు వచ్చారుమూడవపిల్లవాడు దగ్గరకు వచ్చిన రెండు కుక్కలను తరిమివేశాడు ముగ్గురు పిల్లలు  ఎంగిలి ఆహార పదార్ధాలను సంతోషముగాతినసాగారు.  
           Image result for images of poor boys searching for meals in dust bin

 దృశ్యాన్ని నేను చూడలేక నాకళ్ళు మూసుకొనిఆలోచించసాగాను.  నాకు ఆకలిగా ఉంది.  నీరసంతో చెట్టు మానుకుఆనుకొని నిద్రపోయాను.   నిద్రలో నేను కలగన్నాను.   కలలోనేను  ముగ్గురు పిల్లల వద్దకు వెళ్ళి నాకు ఆకలిగా ఉంది,అన్నము పెట్టమని వేడుకొన్నాను.   పిల్లలు సంతోషముతో వారుతింటున్న ఎంగిలి పదార్ధాలనుండి మిఠాయినిపులిహారను నాకుపెట్టారు.  వారు పెట్టిన భోజనముతో నాకడుపు నిండింది.  నాలో శక్తివచ్చింది.   పిల్లలకు ధన్యవాదాలు తెలియచేశాను.

ఇంతలో నాకు మెలుకువ వచ్చింది.  నిద్రనుండి మేల్కొన్నాను.  నాఎదురుగా ముగ్గురు పిల్లలు సంతోషముగా ఎంగిలి మిఠాయి ఉండలుతింటూఉన్నారు.  మరి నేను తిన్న ఎంగిలి మిఠాయి సంగతి ఏమిటిఅని ఆలోచించాను.   నేను కలలో వారితో కలిసి ఎంగిలిమిఠాయిలను తిన్నాను.   పిల్లలు నన్ను చూసి చిరునవ్వుచిందించారు.  నేను  పిల్లలను ఆశీర్వదించి నూతనశక్తితో తిరిగి నాఆఫీసుపని పూర్తి చేయడానికి అక్కడివారిని నాకు కావలసినచిరునామా తెల్పమని కోరాను.  వారు నాకు కావలసిన చిరునామాభవనము చూపించారు.

నేను అక్కడినుండి బయలుదేరి నాకు కావలసిన కంపెనీకి వెళ్ళి నాఆఫీసు పని పూర్తి చేసుకొన్నాను.  ఇప్పటికీ  సంఘటననుమర్చిపోలేదు.  ఇటువంటి సంఘటనను మనము శ్రీసాయి సత్చరిత్రలోని 32.అధ్యాయములో చూడగలము “బాబా తనమిత్రులతో కలిసి అడవిలో భగవంతుని అన్వేషణ ప్రారంభించినపుడువారికి ఒక బంజారావాడు తారసిల్లి ఆకలితో అన్వేషణ చేయవద్దు,తాను ఇచ్చే రొట్టెలని తినమని కోరాడు.  బాబా స్నేహితులుఅహంకారముతో  బంజారావాని మాట వినకుండా వెళ్ళిపోయారుబాబా మాత్రము  బంజారావాడు పెట్టిన రొట్టెలు తిని భగవంతునిఅన్వేషణ ప్రారంభించి తన గురువును కలుసుకొన్న సంఘటనతలపించింది.”

 మద్రాసులోని కళ్యాణమండపములోని ఎంగిలి పదార్ధాలను తిన్నఆపిల్లలను మర్చిపోలేకపోతున్నాను.   పెళ్ళివారు బయటకువచ్చి  ముగ్గురు పిల్లలకు భోజనము పెట్టి ఉన్నట్లయితేభగవంతుడు వారిని ఆశీర్వదించి ఉండును కదా అని తలచి నేనుమద్రాసునుండి తిరిగి హైదరాబాద్ కు చేరుకొన్నాను.  ఆనాటినుండినేటివరకు నాజీవితంలో పెళ్ళిళ్ళకు వెళ్ళటము  వధూవరులనుఆశీర్వదించిఅక్కడ పెళ్ళి భోజనము చేయకుండా ఇంటికి వచ్చిఇంటిభోజనము చేయటము కొనసాగిస్తున్నాను.  నాకు కలలోఎంగిలి భోజనము పెట్టిన  ముగ్గురు పిల్లలలోని మానవత్వానికిమానవతాదేవతకు నమస్కరించాను.

జై సాయిరామ్

                 Image result for images of full meals in plantain leaf


(ఈ ఆధునిక యుగంలో పెళ్ళిళ్ళల్లో విందు భోజనాలు తమ తమ హోదాకు 

తగినట్లుగా ఎన్ని రకాలు తయారు చేసి వడ్డిస్తున్నారో మనమందరం 

గమనించే ఉంటాము.  అన్ని రకాలు ఒకేసారి ఎవరూ తినలేరని తెలుసుండీ 

విందు ఏర్పాట్లు చేస్తున్నారంటే అందులో సగం పదార్ధాలు తినలేక పారేసేవే 

అయిఉంటాయి. ఇంక మిగిలిన విషయాలను చెప్పడం అనవసరం. --- 

త్యాగరాజు)

(రేపటి సంచికలో మరొక మానవత్వమ్ రాత్రి చలిలో మాతృప్రేమ)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment