Sunday, 21 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది - 4

Image result for images of shirdi saibaba 3dImage result for images of rose hdఈనాటి సమాజములో

మానవత్వము ఇంకా బ్రతికేఉంది

(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)

సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు4.  తల్లిడండ్రుల ఆకలిబాధ తీర్చటానికి ఆరాటపడుతున్న
      కన్నెపిల్ల దీనగాధ

 సంఘటన 1992.సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిందితారీకు గుర్తు లేదు.  సాయంత్రం మోండా మార్కెట్ వీధిలో ఉన్నశ్రీసాయి మందిరంలో హారతి పూర్తి చేసుకొని సికిందరాబాద్ స్టేషన్చేరడానికి క్లాక్ టవర్ పార్కు దగ్గరకు వచ్చి కొంతసేపు విశ్రాంతి కోసంఅక్కడి బెంచీమీద కూర్చొన్నాను.   సమయంలో ఓబాలిక (వయస్సు సుమారు 15 సంవత్సరాలుఉంటుందివచ్చి నాప్రక్కన కూర్చుంది.  నేను ఆమెను ఎక్కడచదువుతున్నావు అని అడిగాను.  ఆమె కొంతసేపు తర్వాత నాతోమాట్లాడుతు తాను 5.తరగతి వరకు చదివి మానేసాననిచెప్పింది.  ఆమెది తూర్పుగోదావరి జిల్లా అని తన తండ్రి రిక్షాతొక్కుతాడని తన తల్లి కూలిపని చేసుకొంటుంది అని చెప్పిందితాను తన తల్లిదండ్రుల ఆదేశానుసారం హైదరాబాద్ లోని తమబంధువుల ఇంటికి చేరుకొన్నానని చెప్పింది.  ఒక్క 500రూపాయలు ఇస్తే తాను నాతో రాత్రి అంతా గడుపుతానని చెప్పిందిఅప్పుడు అర్ధమైంది ఆబాలిక ఎంత పొరబాటు చేస్తున్నదిసాయిమందిరంలో హారతి పూర్తి చేసుకొని ఈపార్కుకు చేరుకొంటేఇక్కడ ఈసమస్య ఎదురవటం నాకు బాధ కలిగించినాఅధైర్యపడకుండా ఆమెతో మాట్లాడుతూ ఆమె ఎంచుకొన్న మార్గముతప్పు అని ఆమెకు నచ్చ చెప్పాను

         

నేను ఆమెకు ఇటువంటి మార్గములో ప్రయాణం చేసిన ఆరోగ్యమునశించి ఎయిడ్స్ వ్యాధిపాలు అవుతావు జాగ్రత్త అని హెచ్చరించానునామాటలకు ఆమె మనసు గాయపడి ఉండవచ్చు.  ఆమె కన్నీరుపెట్టుకుందిఏమి చేయాలి అని ఆలోచిస్తూ తిరిగి కాకినాడకు రైలులోవెళ్ళిపోయి తన తల్లితో కలసి కూలి పని చేసుకొంటూ సంతోషముగాగడపమని చెప్పి టిక్కెట్టు నిమిత్తం 200 రూపాయలు ఆమెకుఇచ్చాను.  ఆమె సిగ్గుపడుతూ ఆడబ్బు తీసుకొని తన తల్లితోకూలిపని చేసుకొని బ్రతుకుతాను అని మాట ఇచ్చింది.  సమయంలో ఆమె కళ్ళలో ఆశాజ్యోతిని చూసాను.  నేను చేసిందితప్పా లేక సరిఅయినదా నాకు తెలీదు.   సమయంలో ఆమెపతనం కాకూడదు అనే భావనతో నేను అలాగ చేసాను అనే తృప్తిమిగిలింది.  ఆమె నాకు నమస్కరించి వెళ్ళిపోయింది.  నేనునాఇంటికి చేరుకొన్నాను.  నేను మానవతా దృష్టితో ఈపని చేసానుమానవతాదేవత యొక్క ఆశీర్వచనాలు నాపై ఉంటాయి అనేభావనతో తృప్తిగా నిద్రపోయాను.

ఈనాటికీ నేను ఈసంఘటన గుర్తు చేసుకొన్నప్పుడు నాకు శ్రీసాయిసత్ చరిత్రలో 49.అధ్యాయములోని నానాసాహెబ్ చందోర్కర్ కుజరిగిన సంఘటన గుర్తు చేసుకొంటాను.

ఒక భక్తుడు సకుటుంబముగా ద్వారకామాయికి వచ్చిబాబాదర్శనము చేసుకొన్నాడు.  ఆసమయంలో నానా సాహెబ్చందోర్కర్ బాబా ప్రక్కనే కూర్చొని ఉన్నాడు.

ఆవచ్చిన కుటుంబములోని ఒక స్త్రీ బాబా ఆశీర్వాదాలుతీసుకోవడానికి ఒక్క క్షణం తన మేలిముసుగును తీసిందిఅధ్భుతమైన ఆమె సౌందర్యానికి నానాసాహెబ్ కు మనసు చలించిఅతని మనసులో ఆమెను మరలా మరలా చూడాలనే కోరికజనించింది.  


అపుడు బాబా తన సటకాతో నానాను మెల్లగా తట్టి అందంభగవంతుని సృష్టి.  మనసులో ఎటువంటి చెడు ఆలోచనలులేకుండా కళ్ళతో చూసి ఆనందించవలసినదే.  నీకు చెందనిదానికోసం నీవు ఆశపడకూడదు అని అన్నారు.  బాబా నానా సాహెబ్చందోర్కర్ కు చెప్పిన మాటలు నాకూ వర్తించుతాయి అనిభావించాను.  నేను ఆబాలిక విషయంలో చేసినది సరిఅయినదే అనిభావించి తృప్తిచెందాను.  మానవతా దృష్టితో నేను ఆబాలికను ఆమెతల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాను అని భావించిఆసంఘటనను మర్చిపోయాను.

  19.05.2017    తారీకున ప్రచురించిన మద్రాసులోని పెళ్ళిమండపము – 

ఎంగిలి బ్రతుకులు చదివే ఉంటారు.  సాయిబానిసగారికి ఆసంఘటన 

1990వ. సంవత్సరంలో జరిగింది.  అనగా 16 సంవత్సరాల క్రితమే ఆయన 

తన అనుభవం దృష్ట్యా పెళ్ళిళ్ళల్లో ఎంత ఆహారం వృధా అవుతున్నదో 

చెప్పారు.  ఈ నాడు (21.05.2017) ఈనాడు వార్తా పత్రిక చూడండి.  

ప్రధాన హెడ్ లైన్ “ తినేదెంత -  పారేసేదెంత”  వేడుకల్లో లెక్కకు మించిన 

వంటకాలు….

                  
         Image result for images of wastage of food in marriages
          Image result for images of wastage of food in marriages
కనీసం ఇప్పటికయినా మనమందరం ఆర్భాటాలకు, హోదాలకు విలువ 


ఇవ్వకుండా ఆహారానికి తగిన విలువ ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు.  


వృధాగా పడవేసే బదులు అన్నార్తులను ఆదుకుంటె భగవంతుని 

అనుగ్రహం మనమీద ఎల్లప్పుడూ ఉంటుంది.  వివాహ శుభ కార్యాలలో ఏమి వంటాకాలు వండి వడ్డిస్తున్నారు (మగ పెళ్ళివారు గాని,  ఆడపెళ్ళివారు గాని  ఇరుపక్షాలవారు ఆహార పదార్ధాలను వృధా చేయరాదు అనే మాట మీద నిలబడాలి) అనేదానిమీద భేషజాలకు పోకుండా, మానవత్వానికి విలువ ఇస్తే అంతకన్నా విందు భోజనం మరొకటి ఉండదు.  ఎంత ధనం వృధాగా పోతూఉందో మన సాయి భక్తులందరం గుర్తించి దానికనుగుణంగా నడచుకుంటే మిగిలినవారికి ఆదర్శప్రాయులమవుతాము.  త్యాగరాజు

(రేపటి సంచికలో మరొక మానవత్వమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment