Wednesday 24 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది - 7

  Image result for images of shirdi sai
        Image result for images of rose hd
24.05.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది
(శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు


7.  మానవ సేవయే మాధవసేవ
.    నిర్మల శిశుభవన్ – సికింద్రాబాద్
మన ఇళ్ళలో ఒక శిశువు జన్మించినపుడు ఇంటిలోని పిల్లలు,పెద్దలు సంబరాలు చేసుకొంటారు.  మిఠాయిలను పంచుకొంటారు శిశువు పెరుగుతుంటే అచ్చటముచ్చట పేరిట పండగలుచేసుకొంటాము
               Image result for images of birthday for newborn baby
మరి తల్లితండ్రి ఎవరో తెలియక అనాధపిల్లల ఆశ్రమంలో పెరిగిపెద్దవారుగా అవుతున్న  పిల్లల గురించి ఎవరైన ఒకసారిఆలోచించారా?  



ఒక్కసారి మీ పట్టణములోని అనాధ పిల్లల ఆశ్రమానికి వెళ్ళండి.  ఆ పిల్లలతో మీప్రేమను పంచుకోండి.  అప్పుడు మీకు మానవతాదేవతయొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి.
                               Image result for images of nirmala shishu bhavan secunderabad
నేనునాభార్యమాసాయి దర్బార్ కార్యకర్తలందరం కలసిఅనేకసార్లు సిదింద్రాబాద్ లోని నిర్మలశిశుభవన్ కు వెళ్ళాము.  పిల్లలతో కలసి ఆటపాటలలో పాల్గొన్నాము.   పిల్లలతో కలసిభోజనాలు చేసాము.   సమయంలో  పిల్లలతో గదుపుతూంటే ప్రపంచము చాలా విశాలమైనది,   ప్రపంచము నాఇల్లుకు మాత్రమేపరిమితంకాదు అనే భావన కలిగింది.   పిల్లలతో ఆడుకొంటూవారికి కధలు చెబుతుంటే నా జీవితంలో నేను నాపిల్లలతో గడిపినరోజులు గుర్తుకు వచ్చాయి.  వాళ్ళు తాతఅంకులు అని పిలుస్తుంటేవారికీ నాకు గతజన్మ నుండి బంధము ఉంది అనే భావన కలిగిందిశ్రీసాయి షిరిడీలోని చిన్నపిల్లలతో ఆటలు ఆడేవారు.  
    Image result for images of shirdi sai baba playing with children
    Image result for images of shirdi sai baba playing with children
వారికి పాటలు పాడి వినిపించేవారు అనే విషయాన్ని మనం శ్రీసాయిసత్ చరిత్రలో చూడగలము.  నిత్యము తన వద్దకు వస్తూ ఉండేఇద్దరు పిల్లలు అమాలిజమాలిలకు చెరొక రూపాయి ఇస్తూఉండేవారు బాబా.  బాబాను మొదటిసారిగా 1908లో పూజించినబాలుడు బాపూరావు.  అతను ప్రతిరోజూ బడికి వెడుతూద్వారకామాయికి వచ్చి బాబా శిరస్సు పైన ఒక గులాబి పూవునుఉంచి బాబాను పూజించేవాడు.  ఒకనాడు షిరిడీకి దూరములో ఉన్నఒక గ్రామములో ఒక కమ్మరివాని పసిపాప కమ్మరికొలిమిలోపడిపోయినపుడు బాబా తన చేయిని ద్వారకామాయి ధునిలో పెట్టి గ్రామములోని పసిపాపను కాపాడిన విషయము మనందరికితెలిసినదే.
                             Image result for images of shirdi sai baba putting his hand in dhuni
మనం భగవంతుని అనుగ్రహము కోసం మందిరాల చుట్టూప్రదక్షిణలు చేస్తాము.  అది మన ఆరోగ్యానికి మంచిది.  కానిభగవంతుడు నీచుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే నీవు ఒకఅనాధపిల్లవానిని నీ ఒడిలో కూర్చుండబెట్టుకొని నీ ప్రేమను వానికిపంచిపెట్టు.  అపుడు భగవంతుడు తన అనాధపిల్లవానికి నీవుప్రేమను పంచుతున్నావా లేదా,  లేక ఆపిల్లవానినిహింసించుతున్నావా అనే విషయాన్ని తెలుసుకోవడానికి నీచుట్టూతిరుగుతూ ఉంటాడు.  అందుచేత ప్రతి వ్యక్తి సమాజంలో ఉన్నఅనాధపిల్లలకు తన ప్రేమను పంచి భగవంతుని ఆశీర్వచనాలు పొందిసాయిమార్గములో పయనంచాలి

జై సాయిరామ్

.  వృధ్దుల ఆశ్రమాలు – సికింద్రాబాద్,  హైదరాబాద్

నాజీవితంలో మాసాయిదర్బార్ కార్యకర్తలతో కలసి అనేకసార్లువృధ్దుల ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ అన్నదానంవస్త్రదానం,కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమాలు చేసాము.  వృధ్ధులఆశ్రమాలలోనివారి జీవితాలలో ఒకసారి తొంగి చూసిన వారువృధ్ధాప్యములో ఎంతగా మానసికముగా బాధ పడుతున్నది మనకుతెలుస్తుంది.  వారిలో చాలా మందికి పిల్లలు ఉన్నా వారు తమపిల్లల ప్రేమకు నోచుకోలేక వారి పిల్లల చేతనే ఇంటినుండిగెంటివేయబడి ఇటువంటి వృధ్ధుల ఆశ్రమాలలో చేరుతున్నారు.  
               Image result for images of old age homes in india

ఒక స్త్రీని (వయస్సు సుమారు 80.)  అమె బంధువులు ఒకఆటోలో తీసుకొనివచ్చి ముషీరాబాద్ జైలు దగ్గర  ఉన్న వృధ్ధాశ్రమంగేటు దగ్గర దింపివేసి వెళ్ళిపోయారు.  ఆమెను  వృధ్ధాశ్రమంలోనిక్రేస్తవ సిస్టర్స్ ఆదుకొని ఆశ్రమములో చోటు కల్పించారు.  
    Image result for images of old age homes in india

ఇక్కడ ఉన్నవృధ్ధులతో మాట్లాడాను.  వారు అన్నమాటలు నాకుగుర్తున్నాయి.  మా ఇళ్ళలో మాపిల్లలు పెట్టే బాధలు భరించలేక ఆశ్రమానికి చేరుకొని భగవంతుని దయతో ప్రశాంతముగాజీవిస్తున్నాము.  వారి మాటలు గుర్తుచేసుకొన్నపుడు మనజీవితాలలో వృధ్ధాప్య దశ ఏవిధముగా గడుస్తుంది అనే ఆలోచనరాకమానదు.  నేడు ప్రభుత్వమువారు వృధ్ధుల పట్ల గౌరవముతోపింఛను ఇవ్వడము సంతోషకరం.  మనము  వృధ్ధాశ్రమాలకుమన పుట్టినరోజున లేదా మనపెళ్ళిరోజునలేదా మనపిల్లలపుట్టినరోజులనాడు వెళ్ళి వృధ్ధులతో మన సంతోషాన్నిపంచుకొన్ననాడుమనము మానవతాదేవతయొక్క ఆశీర్వచనాలనుపొందగలము.
                         Image result for images of sevashram secunderabad
ప్రభుత్వమువారే కాకుండాహెల్ప్ ఏజ్ డ్ ఇండియా అనే స్వఛ్చందసంస్థ కార్యకర్తలు వృధ్ధులకు సేవచేస్తూ ఈసమాజములో వృధ్ధులకుకూడా గౌరవప్రదమైన స్థానము ఉంది అని తెలియపరుస్తున్నారుబాబా ఏనాడు తనకు బంగారు కిరీటాలుబంగారు సింహాసనముకావాలని కోరలేదు.  ఆయన ఒక సాధారణ ఫకీరుగానే జీవించిషిరిడీలో మహాసమాధి చెందారు.  దయచేసి సాయినాధులవారి పేరిటఅనాధాశ్రమాలకువృధ్ధుల ఆశ్రమాలకుమానసిక వికలాంగులఆశ్రమాలకు ధనసహాయము చేసి బాబావారి కృపకుపాత్రులమవుదాము.  సాయి చూపిన మార్గములో పయనిద్దాముఇంకా “ఈసమాజములో మానవత్వము బ్రతికే ఉంది” అనిప్రపంచానికి చాటి చెప్పుదాము.

జై సాయిరామ్

.  మరణానికి చేరువలో ఉన్న అనాధులకు ఆశ్రయము ఇస్తున్నసంస్థ

ఇది సిదింద్రాబాద్ భోలక్ పూర్ లో ఉంది.  ఇది మదర్ థెరిసాస్థాపించిన సంస్థ.   సంస్థలోకి ఒకసారి వెళ్ళి చూసినమానవత్వానికి ప్రతీక అయిన మదర్ థెరిసా యొక్క సేవలను గుర్తుచేసుకోవచ్చును.  అనాధ ఆశ్రమాలువృధ్ధుల ఆశ్రమాలలో మనంఆరోగ్య వంతులను చూడగలము.  కాని  ఆశ్రమంలో మృత్యువుతోపోరాడుతు సమాజములో తోటి మానవుల నిరాదరణకు గురయినఅభాగ్యులను ఈసంస్థవారు చేరదీసి వారికి సహాయముచేస్తున్నారు

 సంస్థలో అనేక పర్యాయాలు అన్నదానము వస్త్రదానముచేసాము.  ఒకసారి అన్నదానములో ఒక వృధ్దురాలికి మిఠాయిపెట్టాను.  ఆమె సంతోషంతో రాత్రి భోజనము చేయనుఇంకొకమిఠాయి ఉండ ఇవ్వమని కోరింది.  ఆమె ఆమిఠాయిని ప్రేమతోస్వీకరించి తన దగ్గర ఉన్న చిన్న డబ్బాలో దాచుకోవడంనాహృదయాన్ని కలచి వేసింది వీరందరిని చూసిన తర్వాత మనంచాలా అదృష్టవంతులమనిసమాజంలో గౌరవప్రదమైన స్థానంలో,ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నామని అనిపించింది.

 ఆశ్రమంలో ప్రత్యేకత ఒకటుంది.   ఆశ్రమంలో మతాలకుఅతీతంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను చేర్చుకొంటారు.  దాతలుఇచ్చే ధనంతో  ఆశ్రమాన్ని నడుపుతున్నారు.   ఆశ్రమంలోనివృధ్ధులు మరణించితే వారివారి మత సాంప్రదాయములతో అంతిమసంస్కారములు నిర్వహిస్తారు.  ఇది చూసిన తర్వాత ‘సమాజంలో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది’ అనే భావనకలిగింది.  అందుచేతనే  పుస్తకానికి ఆ పేరు పెట్టాను.  శ్రీసాయిఅంటారు. “భగవంతుడు నీలో ఉన్నాడునీతోటివానిలో ఉన్నాడునీవు నీతోటివానికి సేవ చేసిన అది మాధవసేవ అని గుర్తుంచుకో”. అందుచేతనే మనపెద్దలు చెప్పిన ఒక్కమాటను సదా గుర్తుపెట్టుకొందాము.  అదే "మానవసేవయే మాధవసేవ”.   సేవాకార్యక్రమాలలో పాల్గొని శ్రీసాయి మార్గములో మన జీవనప్రయాణాన్ని కొనసాగిద్దాము.
జై సాయిరామ్

.  మానసిక వికలాంగుల ఆశ్రమము

ఇది సికింద్రాబాద్ లోని జీరా ప్రాంతములో ఉంది.   ఆశ్రమంలోఅనేక పర్యాయాలు అన్నదానముపండుగ రోజులలో మిఠాయిమరియు ఫలాల దానము చేసిన రోజులు గుర్తుకు వస్తునాయి.

 ఆశ్రమాన్ని క్రైస్తవ మిషనరీలు నడుపుతున్నాయి.   ఆశ్రమంలోచూడటానికి అందరూ ఆరోగ్యవంతులుగా కనిపిస్తారు.  కాని వారుమానసిక వికలాంగులు.  వారు శారీరకముగా 30, లేదా 40సంవత్సరముల వ్యక్తులు.  కాని మానసికముగా వారు 5 లేక 10సంవత్సరాల పిల్లయినట్లుగా ప్రేమతో పలకరించి వారిమంచిచెడులను కన్నపిల్లలలాగ చూసుకుంటున్న అక్కడి క్రైస్తవసిస్టర్స్ కు నమస్కరించాలి.  వారు ఆపిల్లలకు  మాతృప్రేమనుపంచుతున్నారు.  సమాజములో కన్న పిల్లలను పెంచలేకఇటువంటి ఆశ్రమాలవద్ద వదలి వెళ్ళిపోతున్న తల్లిదండ్రులకన్న క్రైస్తవ సిస్టర్స్ మానవతాదేవతలకు ప్రతిరూపాలు.  అందుచేత వారికినమస్కరించాలి.   ఆశ్రమానికి నా మనసులో ఒక ప్రత్యేకస్థానంఉంది

ఒకసారి నేనునాభార్య  ఆశ్రమంలో అన్నదానం చేయడానికివెళ్లాము   సమయంలో ఒక బాలిక నాభార్య చేయిపట్టుకొని తనకుఅటువంటి గాజులు కావాలి అని కోరసాగింది.   బాలిక కోరిన చిన్నకొరిక తీర్చాను.  ఆమె కళ్ళలోని తృప్తిని సంతోషాన్ని చూసాము.

భారతప్రభుత్వమువారు మానసిక వికలాంగులకు ప్రత్యేకమైనపాఠశాలను నిర్వహించుతున్నా  సదుపాయము అందరకుచేరువలో ఉండటంలేదు.  ఈనాటి సమాజంలో సాయిప్రేమికులుఅందరూ ముందుకు వచ్చి ఇటువంటివారి కోసం ప్రత్యేకమైనపాఠశాలలను నిర్వహించాలి.  సాయిప్రేమకు పాత్రులు కావాలిసాయి మందిరాలలో ఎన్నిసార్లు పాలాభిషేకాలు చేసాము అనేదిముఖ్యము కాదు.  ఇటువంటి పాఠశాలలలో ఎంతమంది పిల్లలకుమనము పాలు త్రాగడానికి ఇచ్చాము అనేది ముఖ్యముఅభిషేకాలు పేరిట పాలను వృధాచేయకండి.  అనాధపిల్లలఆశ్రమాలలోని పిల్లలు త్రాగడానికి క్షీరదానము చేయండి.  మరియుశ్రీసాయి అనుగ్రహానికి పాత్రులయి సాయి మార్గములోపయనించండి.
జై సాయిరామ్
(రేపటి సంచికలో మరికొన్ని)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment