25.02.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మనబ్లాగులో ప్రచురణకు 10 రోజులు ఆలస్యం జరిగింది..క్షంతవ్యుడను..పొద్దుటే ఆఫీసుకు, వెళ్ళడం..తిరిగి ఇంటికి వచ్చినాక కొన్ని పనులవల్ల సమయం కుదరలేదు...
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి,
43, 44 వ. అధ్యాయములు
15.02.1992
ప్రియమైన చక్రపాణి,
42,43,44వ.అధ్యాయములలో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయిబాబా మహా సమాధి చెందటము గురించి వివరించినారు. అందుచేత నేను కూడా ఈ మూడు అధ్యాయములను రెండు ఉత్తరాలలో వివరించుచున్నాను. క్రిందటి ఉత్తరములో చివర్లో నాపిన తండ్రి శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గారు శ్రీసాయి దయతో మరణ శయ్యపై ఉండగా కుడా గృహప్రవేశము చేసిన సంఘటన వివరించినాను.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
42వ.అధ్యాయము
14.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయమునకు, నా జీవితానికి గల సంబంధము నేను మాటలలో చెప్పలేను. నేను అనేక సార్లు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసినాను. 42,43,44 అధ్యాయాలు పారాయణ చేస్తున్నపుడు నేను 1918 సంవత్సరానికి వెనక్కి వెళ్ళిపోయి బాబా మహాసమాధి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
41వ.అధ్యాయము
13.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి పటముయొక్క ప్రాముఖ్యము, మధ్యవర్తులు లేకుండ శ్రీ సాయి సేవ చేసుకొనే విధానము, నిత్య పారాయణకు ఉపయోగపడు గ్రంధాలను గురించి శ్రీ హేమాద్రిపంతు చక్కగా వివరించినారు.
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పదిహేనురోజులుగా, కాశీ యాత్ర వలన ప్రచురణకు సాధ్యపడలేదు..మా కాశీ యాత్ర విశేషాలను మీకందరికీ త్వరలోనే అందిస్తాను.కాశీ యాత్ర ముగించుకొని 18వ.తారీకున క్షేమంగా చేరుకొన్నాము..బాబాగారు ముందునుంచీ తను ఉన్నానని నిరూపించారు.తను మాయాత్ర కు ఆమోదం తెలుపుతూ ప్రతిక్షణం మాకు యాత్రలో కనపడుతూనే ఉన్నారు..ఆవిశేషాలన్నిటినీ త్వరలోనే అందిస్తాను..కొన్ని అనివార్య కారణాలవల్ల విష్ణుసహస్రనామం శ్లోకాన్ని అందించలేకపోతున్నాను..పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 40 వ.భాగము
12.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి లీలలను చక్కగా వర్ణించినారు. ఆ లీలలు చదువుతు ఉంటే అటువంటి సంఘటనలు శ్రీసాయి మనకు కలిగించితే ఎంత బాగుండును అనే కోరిక కలుగుతుంది.
ఆకోరికను శ్రీసాయి కార్యాచరణలో పెట్టి తన భక్తునికి సంతోషము కలిగించుతారు. శ్రీసాయి చూపిన లీలలతో సంతోషము పొందిన సాయి భక్తులలో నేను ఒకడిని. ఈ ఉత్తరములో నేను శ్రీసాయితో పొందిన అనుభవాన్ని వ్రాస్తాను. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు, "సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేద భావమును నశింపచేసి, అప్రాప్యమును ప్రాపింప చేయును". ఈ విధమైన అనుభవాన్ని నేను పొందినాను. 29.01.1992 నాడు సాయి భక్తుడు, నా పినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల సర్వేశ్వర సోమయాజు గారు శ్రీసాయి యొక్క మధ్యాహ్న్న హారతి పూర్తి అయిన పిదప తను మరణ బాధ పడుతూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొని నాతలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందినాను. శ్రీహేమాద్రిపంతు శ్రీసాయితో తనకు కలిగిన సాయి లీలను వర్ణించినారు.
29.05.2013 బుధవారముఓం సాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు ఒక గమనిక: ఈ నెల 31వ.తేదీన కాశీ యాత్రకు వెడుతున్నందువల్ల పది రోజులపాటు ప్రచురణకు వీలు కుదరదు. వచ్చిన తరువాత యధావిధిగా కాశీ యాత్ర విశేషాలతో మరలా మీముందుంటాను.. సాయిరాం
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
39 వ.భాగము
11.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు శ్రీసాయికి ఉన్న సంస్కృత పరిజ్ఞానము గురించి, బూటీవాడ (రాతిమేడ) నిర్మాణము గురించి వివరించినారు.
26.05.2013 ఆదివారముఓం సాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
38వ. అధ్యాయము
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శిరిడీలో శ్రీసాయి చేసిన అన్నదానం విషయాలు - ఆ అన్నదానములో ఉపయోగించిన వంటపాత్రల వివరాలు - నైవేద్యము తయారు చేసే విధానము, హేమాద్రిపంతుపై శ్రీసాయికి ఉన్న ప్రేమ, వివరించుతారు.
20.05.2013 సోమవారముఓం సాయి శ్రీసాయి జయజయసాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వారం రోజులుగా హైదరాబాదులో ఉన్నకారణంగా ప్రచురించటానికి వీలుకుదరలేదు..ఈ రోజు, పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి అందిస్తున్నాను చదవండి.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
37వ. అధ్యాయము
09.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి యొక్క గుణగణాలను, చావడి ఉత్సవము గురించిన వివరాలు వ్రాసినారు. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు " వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడివారు కారు. వారు ఎల్లపుడు ఆత్మను సంధానము చేసిడివారు."