Monday 6 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (22)


సాయి.బా.ని.. డైరీ -  1994  (22)

25.07.1994

నిన్నటిరోజున ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయటానికి ఆచరించవలసిన నియమాలు గురించి ఆలోచించినానుఆనియమాలను తెలియచేయమని శ్రీ సాయిని వేడుకొన్నాను.


రాత్రి నిద్రలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి తెలియ చేసిన నియమాలు.

1) యితరులను నిందించరాదు


2) చెడు మాటలు వినటం మానివేయాలి



3) ధన సంపాదన కోసము అడ్డదారులు త్రొక్కరాదు

4) ఒక మంచి పని చేయటము మొదలు పెట్టినపుడు ఆపని పూర్తి అగువరకు విశ్రమించరాదు.

5) పరస్త్రీ విషయాలు మాట్లాడరాదు


6) నిత్యము భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి.


విధమైన నియమాలు పాటించినవారికి ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించటానికి అర్హత కలుగుతుంది.

27.07.1994

నిన్నటిరోజున నా తండ్రి స్వర్గీయ శ్రీ ఆర్.వీ.రావుగారు గుర్తుకు వచ్చినారుఆయన కేరళలోని "యిడికి" గ్రామములో చనిపోయినారుఆయన మరణ సమయములో (1974 జూలై 30 .తారీకున) నేను  హైదరాబాదులో ఉన్నానుఆయన మరణ సమయములో ఆయనతో మాట్లాడలేదు అనే బాధ  చాలా కాలమునుండి నా మనసులో ఉందిరాత్రి శ్రీ సాయికి నమస్కరించి నా మనసులోని బాధను తొలగించు తండ్రీ అని వేడుకొన్నానుశ్రీ సాయి నాకలలో చూపిన దృశ్యము నా బాధను  తొలగించినదిశ్రీ సాయికి నాగురించి, నా తండ్రి గురించి అన్ని విషయాలు తెలుసును అని మరొక్కసారి గ్రహించగలిగినానుశ్రీ సాయి చూపిన దృశ్య వివరాలు "ఒక గ్రామములో సినీమా షూటింగు జరుగుతున్నది సినిమా కధ - రెవెన్యూ శాఖలో ఒక గుమాస్తా చాలా కష్టపడి    పనిచేస్తున్నాడుఅతనికి ఏనాటికైన ఆఫీసరు కావాలని యున్నదిఒక రోజున జిల్లా కలెక్టర్ అతని  దగ్గరకు వచ్చి రెండురోజులలో మంత్రిగారు ఈగ్రామమునకు వస్తున్నారువారు వచ్చేసరికి గ్రామములోని రోడ్లు బాగుచేయించి ఉంచితే నేను మంత్రిగారితో మాట్లాడి మీకు ఆఫీసరు ఉద్యోగము యిప్పించెదను అని చెబుతారుఆఫీసరు కావాలి అనే కోరికతో గుమాస్తా రాత్రి, పగలు కష్టపడి గ్రామములోని రోడ్లు బాగుచేయించుతున్నాడుఅనుకొన్న ప్రకారము మంత్రిగారు రానే వచ్చినారుకాని గుమాస్తా రోడ్లు బాగుచేయించి అలసిపోయి కొంచము సేపు   చెట్టుకింద నిద్రపోయినారుమంత్రిగారు ఆగ్రామములోని సభలో మాట్లాడిన తర్వాత తిరుగు ప్రయాణముకై కారు ఎక్కి వెళ్ళిపోసాగినారుయింతలో గుమాస్తాకు తెలివి వచ్చి కారు వెనుక పరిగెత్తసాగినారుకారు చాలా వేగముగా వెళ్ళిపోసాగినది గుమాస్తా ఆకారు వెనుక  పరిగెత్తలేక రోడ్డుమీద గుండెనొప్పితో మరణించినారు."  షూటింగులో గుమాస్తా పాత్ర వేసినది ప్రఖ్యాత కన్నడ నటుడు శ్రీ గిరీశ్ కార్ నాడ్ 

నిజ జీవితములో నా తండ్రికి మరియు శ్రీ గిరీశ్ కార్ నాడ్ కి చాల పోలికలు ఉన్నాయియిద్దరూ అన్నదమ్ముల లాగ ఉంటారు. నిజజీవితములో నా   తండ్రి హెచ్.సీ.సీ. కంపెనిలో అక్కౌంట్స్ గుమాస్తాగా 30 సంవత్సరాలు పని చేసినారుఏనాటికైన అక్కౌంట్స్ ఆఫీసరు పదవి సంపాదించాలి అని చాలా కష్టపడి హెచ్.సీ.సీ. కంపెనీలో పని  చేయసాగినారు. దురదృష్టవశాత్తు పని ఒత్తిడికి తట్టుకోలేక 30.07.1974 నాడు ఆఫీసులో గుండెనొప్పితో మరణించినారు.  31.07.1974 నాటికి నేను విమానములో "ఎర్నాకులం" చేరుకొని ఆయన శరీరమునకు దహన సంస్కారములు చేసినానుఆయన శరీరమునకు అంతిమ  సంస్కారములు చేయగలిగినాను కాని ఆయన ప్రాణము పోతున్న సమయములో ఆయనతో ఆఖరి  మాటలు మాట్లాడలేక పోయినాను అనే బాధను శ్రీ సాయి కలలో శ్రీ గిరీశ్ కార్నాడ్ రూపములో నాతో మాట్లాడి, నాలో మిగిలిపోయిన బాధను తొలగించినారుశ్రీ సాయికి తన భక్తుల భూత  భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలుసును అని మరొక్కసారి నిరూపించినారు.

 (యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment