Saturday 25 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (01)






 సాయి.బా.ని.డైరీ -  1995  (01)

03.01.1995

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి 1995 సంవత్సరానికి శ్రీ సాయిభక్తులకు సందేశము ప్రసాదించమని వేడుకొన్నానుశ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశాల వివరాలు.



1) నీ ప్రాపంచిక విషయాలలో, నీ బరువు బాధ్యతల నిర్వహణలో సహాయము చేసేవాడు గురువునీ ఆధ్యాత్మిక విషయాలలో నీకు తోడుగా ఉంటూ భగవంతుని దరికి చేర్చేవాడు సమర్ధ సద్గురువు.

2) నిజ జీవిత ప్రయాణములో నీ ప్రేమ నీవాళ్ళ మీదనే యుంటుందినీ వాళ్ళలో ఎవరైనా దారి తప్పిన నీమనసు విల విలలాడిపోతుందిఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో నీ, నా అనే భేదము యుండదుఅందరు సమానమే.

3) గుడిలోని పూజారి నీనుండి దక్షిణ తీసుకొని తన పొట్ట నింపుకొంటాడుఆధ్యాత్మిక రంగములో సమర్ధ సద్గురువు నీ నుండి దక్షిణ తీసుకొని నీకంటే లేనివాని పొట్టనింపి నిన్నుతనతో సమానముగా తీర్చిదిద్ది వివేక, వైరాగ్యాలను ప్రసాదించుతాడు.

4) నీయింటికి వచ్చే నీ బందువులు నీకు ఏమి కానుకలు తెచ్చినారు అని ఆలోచించి ఆ తర్వాతనే వారికి ఏవిధమైన మర్యాదలు చేయాలి అని ఆలోచించుతావుకాని సమర్ధ సద్గురువు తన దగ్గరకు వచ్చేవారికి ఏవిధముగా ప్రేమతో పలకరించాలి అని ఆలోచించుతు వారి అర్హను బట్టి వారికి తన ఆధ్యాత్మిక ఖజాన నుండి కానుకలు తీసి యిస్తారు.

అందుకే నూతన సంవత్సరములో సమర్ధ సద్గురువు ఆశీర్వచనాలు పొందటానికి ప్రయత్నించండి.
04.01.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో ముందుకు వెళ్ళటానికి మార్గము చూపు తండ్రి అని వేడుకొన్నానుశ్రీ సాయి దృశ్యరూపములో చూపిన మార్గము వివరాలు.

1) అన్నార్తులు అన్నము కోసము నిరాహార దీక్ష చేస్తే ఈలోకం హర్షించదుఅదే , అన్ని భోగభాగ్యాలు అనుభవించుతున్నవాడు ఒక పూట ఉపవాసముతో నిరాహార దీక్ష చేసిననాడు ఈలోకం తల్లడిల్లి పోతుందే!  - మరి ఆధ్యాత్మికముగా నీవు ఆలోచించి ఏమార్గములో పయనించాలి నిర్ణయించుకో.

2) నిజ జీవిత ప్రయాణములో నీవాళ్ళు నీ స్నేహితులు నీకు తోడుగా యుంటారుమరి ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో సమర్ధ సద్గురువు మాత్రమే నీదు తోడుగా యుంటారు.

3) ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో గొప్పవాడు బ్రాడ్ గేజి రైలు పట్టాలమీద ప్రయాణము చేస్తాడుబీదవాడు మీటరు గేజీ రైలు పట్టాల మీద ప్రయాణము చేస్తాడుఆఖరికి యిరువురి గమ్యస్తానము ఒక్కటే అని గుర్తు ఉంచుకోవాలి.

మూడు విషయాలు అనుక్షణము గుర్తు ఉంచుకొన్నరోజున ఆధ్యాత్మిక రంగములో నీప్రయాణము సులువుగా సాగిపోతుంది.
05.01.1995

నిన్న రాత్రి ఆధ్యాత్మిక రంగములో ముందుకు వెళ్ళేటప్పుడు ఎదుర్కోవలసిన యిబ్బందులు చెప్పు తండ్రి అని శ్రీసాయినాధుని వేడుకొన్నానుశ్రీ సాయి దృశ్యరూపములో చూపిన సందేశము.

"కన్న కుమార్తెపై ప్రేమభార్యపై వ్యామోహము - తల్లిపై మమకారము నీ ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకములు అని గుర్తుంచుకోవలెను.

10.01.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు నాచేత వేయించు తండ్రి అని వేడుకొన్నాను.  1) చిన్న తనములోనే మంచి నడవడితో పేరు ప్రఖ్యాతలు సంపాదించి అల్ప ఆయుష్ తో మంచముమీద పరుండి లోకమునుండి వెడలిపోయేటప్పుడు తనతో ఏమి తీసుకొని వెళ్ళగలను అని ఆలోచనా శక్తి గలవాడే ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు వేయగలడు

2) జీవితములో సర్వ సుఖాలు అనుభవించి శరీరముపై మమకారమును విడవలేక జవసత్వాలు వడలిపోయిన యింకా శరీరముపై వ్యామోహము గలవాడు ఆధ్యాత్మిక రంగములో వెనుక అడుగు మాత్రమే వేయగలడు.

మరి నీవు ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు వేయాలా, వెనుక అడుగు వేయాలా అని ఆలోచించి తేల్చుకో అన్నారు శ్రీసాయి.

 



 14.01.1995

నిన్నటి రోజున శ్రీసాయి తత్వ ప్రచారములో నేను అవలంబించవలసిన పధ్ధతులను తెలపమని శ్రీసాయిని వేడుకొన్నానుశ్రీసాయి చూపిన దృశ్యముయొక్క సారాంశము.  "నీవు ఎవరినైన మంచిమార్గములో నడవమని చెప్పేముందు నీవు నడుస్తున్న మార్గముగురించి బాగా ఆలోచించుకోనీమార్గములో ప్రయాణానికి అహంకారము అనే వాహనాన్ని ఉపయోగించనినాడు నీవు ఎదుటివానిని నీమార్గములో ప్రయాణము చేయమని వినయముతో చెప్పు.

 (యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


No comments:

Post a Comment