Friday 24 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (34)

 


 
సాయి.బా.ని.స.  డైరీ -  1994  (34)

14.11.1994


నిన్నటిరోజున మానవుడు పొందవలసిన "ముక్తి" గురించి ఆలోచించి, రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి మానవుడు జీవిత ప్రయాణము ఆఖరిలో పొందవలసిన ముక్తి గురించి తెలపమన్నానుశ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు


 1) జీవితములో బరువు బాధ్యతలు అన్నీ సక్రమముగా పూర్తిచేసి, భగవన్ నామము స్మరించుతూ ఆఖరి హోలీ పండగనాడు అరిషడ్ వర్గాలను మంటలలో పడవేసి పసివారి మనసులాగ మనసును ఉంచుకొని మనవలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ లోకమునుండి నిష్క్రమించటమే ముక్తి
   
2) చెడు వ్యసనాల నుండి, 3) చెడు ఆలోచనలనుండి , 3) పోలీసు భయమునుండి 4) మరణము అంటే భయమునుండి 5) చిల్లర దేవుళ్ళ ఆధిపత్యమునుండి దూరంగా ఏకాంతముగా, ప్రశాంతముగా జీవితము గడపటము కూడ ఒక విధమైన ముక్తి అని గ్రహించు.   

01.12.1994

నిన్నటిరోజున శిరిడీకి వెళ్ళవలెనని ఆలోచన కలిగినది.  12.12.94 నాడు బయలుదేరవలెనని ఆలోచన కలిగినది 
 శ్రీసాయి అనుమతి లేనిదే శిరిడీ వెళ్ళలేము అనే విషయము సాయి బంధువులు అందరికి తెలుసుఅందుచేత రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి అనుమతిని ప్రసాదించమని వేడుకొన్నానురాత్రి కలలో శ్రీసాయి అనుమతిని ప్రసాదించిన విధానము నన్ను సంతోషపరచినదిఆదృశ్యము వివరాలు. "నేను మగ పెండ్లివారితో కలసి పెండ్లికి వెళుతున్నానుమా పెండ్లివారి బస్సు ఒక పట్టణములో ఆగినది.  
 పెండ్లి వారు అందరు హోటల్ లో టిఫిన్ తినటానికి బస్సుదిగి హోటల్ లోనికి వెళ్ళినారుఅక్కడ నాకు నాపాత స్నేహితులు (1967 సంవత్సరమునాటి స్నేహితులు) శ్రీమతి & శ్రీ శుక్లగార్లు టిఫిన్ తినుచు కనిపించినారువారు నన్ను చూసి తమ టేబుల్  దగ్గరకు పిలిచి నాకు మిఠాయి పెట్టినారు 
ఏమిటి విశేషము అని నేను శుక్లాను అడిగినానుతను తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియచేసినారునాకు నిద్రనుండి మెలుకువ వచ్చినదిఒక్కసారి ఆలోచించినానుశ్రీ సాయి శిరిడీకి రమ్మనమని చెప్పిన విధానము 1) శ్రీ సాయి 1858  సంవత్సరములో ధూప్ గ్రామమునుండి చాంద్ పాటిల్ (మగపెళ్ళివారు) తో కలసి శిరిడీ  గ్రామమునకు చేరుకొన్నారు.  2) పిల్లలు లేని దంపతులకు పిల్లలు కలుగబోతున్న శుభవార్త శ్రీ సాయి సత్చరిత్రలో కనిపించుతుందిఈవిధమైన దృశ్యాలు ద్వారా శ్రీ సాయి నా శిరిడీ ప్రయాణానికి అనుమతిని యిచ్చినారు అని నమ్మినాను.

03.12.1994

నిన్నటిరోజున శ్రీ సాయిని గురించి ఆలోచించుతూ శ్రీ సాయి తన భక్తులకు, అన్నీ ప్రసాదించుతున్నారే - మరి శ్రీ సాయి తన భక్తులనుండి ఏమి కోరుతున్నారు అనే ఆలోచన వచ్చినదిరాత్రి నిద్రకు ముందు నా ఆలోచనకు సమాధానము చెప్పమని శ్రీ సాయిని వేడుకొన్నానుశ్రీ సాయి దృశ్యరూపములో చూపిన సూచనలు.

1) వెండి కంచాలలో భోజనము, భోగభాగ్యాలకు దూరముగా యుండవలెను.


2) నీకంటె ధనవంతులను చూసి వారి జీవిత విధానాన్ని అనుకరించవద్దు.  3) జనులను మోసాలు చేసి జీవించేవారినుండి దూరముగా జీవించు.

4) తాము మత ప్రవక్తలమని వేషభాషలు ప్రదర్శించేవారినుండీ, నీకు లంచాలు ఇచ్చేవారినుండి దూరముగా ఉండవలెను. 5) ఎన్నికలు, రాజకీయాలు, పోలీసు గొడవలకు దూరముగా యుండవలెను.  6) గతములో నీకు జరిగిన అన్యాయాల గోతిని తిరిగి త్రవ్వవద్దువీలు అయినంతవరకు ఆగోతిని పూడ్చిపెట్టు. 7) రోడ్డు ప్రక్కన యిసుకలో సుఖముగా నిద్రపోతున్నవారికి నిద్రాభంగము కలుగకుండ నీవు స్కూటర్, కారు దిగి నడచి వెళ్ళు. 8) నీ నా  పేరిట (సాయి పేరిట) ఎవరి దగ్గరనుండీ ధనము స్వీకరించవద్దు.  9) అన్నదానము పేరిట ఎవరైన బియ్యము యిచ్చిన నీవు జోలె పట్టు.

 (యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




No comments:

Post a Comment