Monday, 27 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (02)


 
సాయి.బా.ని.. డైరీ -  1995  (02)
23.01.1995

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో మంచిమార్గములో ప్రయాణము చేయటానికి సూచనలు ప్రసాదించు తండ్రి అని వేడుకొన్నాను. 


 శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సలహాలు.  1) భగవంతుడు తన భక్తుల రక్షణ కొరకు తాటాకు గొడుగు తయారు చేసి యిస్తాడు.   

ఆగొడుగును భక్తుడు తన తలపై ధరించటానికి తనే ప్రయత్నము చేయాలి.  అంతేగాని యితరుల సహాయము కోరరాదు.  2) నీజీవిత విధానము నీ వీధిలోనివారికి యిబ్బంది కలిగించకుండా యుండాలి.  3) జీవితములో నీవు గొప్పపనులు చేసి యుండవచ్చును.  నేను ఆగొప్ప పనులు చేసినాను అని గొప్పగా చెప్పరాదు.  4) నీబంధువులతోను, సాయిబంధువులతోను, ప్రేమతో జీవించు.  5) బీదవారి ధనాన్ని ఆశించకు.  బీద స్త్రీలను అగౌరవము పర్చకు. 5) పదిమందితో కలసి ప్రయాణము చేస్తు కష్ఠ సుఖాలు తెలుసుకో.

24.01.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి మంచి మార్గములో ప్రయాణము చేయటానికి శక్తిని ప్రసాదించు తండ్రీ అని వేడుకొన్నాను.  శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశము. 1) సమాజములోని ప్రజలు ధర్మదేవతను బంధించినారు.   

ధర్మదేవతను విడిపించటానికి పధకము వేసుకొని యుక్తిగా వ్యవహరించాలి.  దానికి మేధాశక్తిని ఉపయోగించాలి.  అంతేగాని నీవు దెబ్బలు తిని నిరుత్సాహము పడరాదు.  2) నీవు నీయింటికి వచ్చిన వారికి దానధర్మాలు చేసేటప్పుడు నీగొప్పతనము ప్రదర్శించటానికి నీ భార్యకుకూడా చెప్పనవసరములేదు.  దానము చేసేవాడికి, దానము స్వీకరించేవారికీ తెలియాలి.  అప్పుడే నీలో మానసిక శక్తి పెరుగుతుంది.  3) అన్నదానము మినహాయించి మిగతా దానధర్మాలు చేటప్పుడు విచక్షణా శక్తి కలిగియుండాలి.

30.01.1995

సత్ సంగాలలో శ్రీ సాయిని గురించి మాట్లాడే సమయములో మంచి భాష మాట్లాడలేకపోతున్నానే అనే బాధ ఎక్కువ కాసాగినది.  రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను.  శ్రీసాయి అజ్ఞాతవ్యక్త్రి రూపములో దర్శనము యిచ్చి నా సమస్యకు చూపిన పరిష్కారపు వివరాలు.  1) మనిషి తన శారీరక కోరికలు తీర్చుకోవటానికి, తన శరీరాన్ని సింగారించుకోవటానికి, కాలాన్ని, ధనాన్ని వినియోగించుతాడు.  అపుడు ఆనందాన్ని అనుభవించుతాడు.  కాని భక్తికి సంబంధించిన విషయాలు మనసుకు సంబంధించినవి.  మనసును సింగారించలేము కాని, మనసులోని భక్తిని కాలముతో అన్వయించి ఆనందము పొందగలము.  భక్తి అనేది భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న భావన మాత్రమె.  దానికి భాష సమస్య కాదు.  2)  అకలితో యున్నవానికి అన్నము ముఖ్యము, అనారోగ్యముతో యున్నవానికి ఔషధము ముఖ్యము.  అలాగే భక్తికి భావన ముఖ్యము.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment