సాయి.బా.ని.స. డైరీ -
1994 (30)
22.10.1994
నిన్నటి
రాత్రి నిద్రకు
ముందు "నాలోని అజ్ఞానాన్ని తొలగించు తండ్రి"
అని సాయినాధుని
వేడుకొన్నాను. శ్రీ
సాయి దృశ్యరూపములో
తెలిపిన విషయాల
సారాంశము.
1) పిల్లలను
పెంచి పెద్ద
చేయటము తల్లితండ్రుల
బాధ్యత . వృధ్ధులైన తల్లిదండ్రుల
సేవ చేయటము
పిల్లల కర్తవ్యము. అని గ్రహించు.
2) నీవు
ఋణానుబంధానుసారము ఎవరికైన సహాయము
చేసిన అది
నీకు ఋణవిముక్తిని కలిగించుతుంది. అది నీకు లభించిన
అదృష్టము. నీవలన
సహాయము పొందినవారు
నిన్ను
గుర్తించటము లేదు అనే
భావన నీనుండి
నీవు తొలగించవలసిన
అజ్ఞానము.
3) ఈ
జీవితములో అన్నదానము చేయగలగటము చాలా అదృష్టము. అన్నదానము
చేయడానికి డబ్బు
ఖర్చు అగుతుంది
అని అన్నదానము
చేయటానికి వెనకాడరాదు.
నీవు ఈ
లోకము నుండి
నిష్క్రమించే సమయములో డబ్బు నీతో రాదు. అన్నదాన
ఫలమే నీతో
వస్తుంది అని గ్రహించు. - శ్రీ
సాయి -
27.10.1994
నిన్న
రాత్రి శ్రీ
సాయినాధులు కలలో యిచ్చిన సందేశము "ధనము
మీద వ్యామోహము
ఉన్నంత కాలము
పరస్త్రీ వ్యామోహము పోదు.
ఎలాగ అంటే
రూపాయి నోటుమీద
కంటికి కనిపించని
వాటర్ మార్క్
లో ముద్రించబడిన
సిం హము
ముద్రవంటిది ఈ పరస్త్రీ వ్యామోహము.
అందుచేత ముందుగా ధన వ్యామోహాన్ని వదిలించుకో. - శ్రీ
సాయి -
28.10.1994
నిన్నటి
రాత్రికలలో శ్రీ సాయి చూపిన దృశ్యాలు
నాలో ఆధ్యాత్మిక
భావాలను రేకెత్తించినది. వాటి
వివరాలు. జీవితము
ఒక పూలచెట్టు
విత్తనములాగ ప్రారంభము అగుతుంది. ఆ విత్తనము
చక్కటి నేలలో పడి వానకు తడిసి
మొక్క అయి
పెరిగి చక్కటి
పూవులను ప్రసాదించుతుంది.
ఆపూలు
వాటి అదృష్టానుసారము
కొన్ని భగవంతుని
పాదాల చెంతకు
చేరి ఎండిపోతాయి.
మరికొన్ని మానవుల పాదాలక్రిద నలిగి ఎండిపోతాయి.
ఈ విధముగా ఎండిపోయిన
పూలు గాలికి
దూరముగా కొట్టుకొని
వెళ్ళి తమ
గమ్య స్తానాలు
చేరుతాయి. అక్కడ
భగవంతుని అనుగ్రహము అనే వానజల్లు ఆ ఎండిన పూల
మీద పడి
తిరిగి పూల
మొక్కలగా మారిపోయినవి. నిద్రనుండి
మెలుకువ వచ్చినది.
ఈ దృశ్యము ద్వారా
శ్రీ సాయి
యిచ్చిన సందేశము
ఏమిటి?
అని ఆలోచించినాను. నా మనసులో
సమాధానము దొరికినది. మానవ జీవితము
ఒక పూలమొక్క
లాంటిది. ఆమొక్కకు
పూచిన పూవులు
వాటి అదృష్టానుసారము
పరిమళించి కొన్ని భగవంతుని పాదాల దగ్గరకు
మరికొన్ని తోటి మానవుల పాదాల క్రిందకు
చేరుతాయి.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment