14.05.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ -1996 (10)
19.11.1996
శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనముయిచ్చి ఆధ్యాత్మికజీవనముగొప్పతనాన్ని వివరించుతు అన్నమాటలు.
1) ప్రాపంచిక జీవితములో మనిషి సుఖ సంతోషాలతో జీవితముగడుపుతున్నపుడు అందరు, అతను ఎంత అదృష్ఠవంతుడు అనిఅంటారు. కాని, ఆవ్యక్తి కష్ఠాలు అనేవానలో తడిసినపుడుమానసిక వ్యాధులతో మంచాన పడతాడు. అదే మనిషి ఆధ్యాత్మికచింతన కలిగిననాడుకష్ఠాల వానకుభయపడడు. ధైర్యముగానిలబడతాడు.
2) గత జీవితములో చేసిన తప్పుడు పనులు పగపట్టిన పాములామనలను వెంటాడుతుంది. తన తప్పులను తెలుసుకొనిపశ్చాత్తాపముతో ఆధ్యాత్మిక జీవితము ప్రారంభించినవానికి ఆపాముఏమీచేయలేదు. జీవితములో బరువు బాధ్యతలను నిర్వర్తించడముకూడా ఆధ్యాత్మిక జీవితములో ఒకభాగము అని మర్చిపోరాదు.
20.11.1996
నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి, పిల్లలపట్లతల్లితండ్రుల బాధ్యత గురించి వివరించమని వేడుకొన్నాను. శ్రీసాయినాపినతండ్రి శ్రీసోమయాజులుగారి రూపములో దర్శనము ఇచ్చిఅన్నమాటలు.
1) పిల్లలను కని - వారిని పెంచి పెద్ద చేసి వారితోనే ఈలోకము అనిభావించటము తప్పు. భగవంతుని అనుగ్రహము సంపాదించటానికిఆయన మనకు ప్రసాదించిన పిల్లలను ఆయన తరపున పెంచిపెద్దచేయటముఈప్రకృతిలో మన భాధ్యత అనిగ్రహించాలి.
2) తల్లితండ్రులు లేని పిల్లలు ఏనాటికి అనాధ పిల్లలు కారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కు. ఆభగవంతుడుఏదో ఒకరూపములోవచ్చి ఆపిల్లలను ఆదుకొంటాడు.
తనప్రేమను వారికి పంచిపెడతాడు.
22.11.1996
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి సుఖప్రదమైన గృహస్థ ఆశ్రమానికిసలహాలు, సూచనలు ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయినావివాహముజరిపించిన పురోహితుని రూపములో దర్శనముఇచ్చిఅన్నమాటలు.
1) గృహస్థ జీవితములో భార్యను ప్రేమగా చూసుకోవాలి, అంతే గానిఆమెతెచ్చిన స్త్రీధనాన్ని దుబారాచేయడము మంచిది కాదు.
2) గృహస్థజీవితము సుఖప్రదముగా సాగటానికి ధనసంపాదన చాలాఅవసరము. అలాగని ధనసంపాదనే ధ్యేయముగా పెట్టుకొని భార్య,పిల్లలకు దూరంగాయుంటు, వారికి కావలసిన మానసిక, నైతికసహాయము అందచేయకపోవటము మహానేరము.
3) నీబరువు బాధ్యతలను తప్పించుకోవటానికి నీవు కన్నపిల్లలనుఇతరులకు దత్తత యివ్వటము మంచి పధ్ధతికాదు.
(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment