Monday 7 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (04)

07.05.2012  సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు


సాయి.బా.ని.స. డైరీ -  1996  (04) వ.భాగము

19.07.1996

నిన్నరాత్రి కలలో నేను రైలులో ప్రయాణము సాగించసాగినాను.  

 
ఆసమయములో నా ప్రక్కన ఓవృధ్ధుడు నాతో మాట్లాడుతూ అన్న మాటలు నా మనసులో బాగా నాటుకొన్నాయి.  
ఆ మాటలు " రైలు ప్రయాణములో మనము అనేకమందిని కలుస్తాము.  సంతోషముగా మాట్లాడుతాము.  ప్రయాణములో సుఖ సంతోషాలను పాలుపంచుకొంటాము.  కాని ఎవరి స్టేషన్ కు వారు చేరుకోగానే వారు తోటిప్రయాణీకులను మర్చిపోయి వారివారి స్టేషనులో దిగిపోతారు. జీవిత ప్రయాణముకూడ రైలు ప్రయాణమువంటిది.  నీభార్య పిల్లలు, బంధువులు, స్నేహితులు తోటి ప్రయాణీకులు అని సదా గుర్తుంచుకో".

వాణిజ్య బ్యాంక్ లకు శనివారము సగము రోజు పని చెప్పబడుతుంది.  కాని ఆబ్యాంక్ బరువు బాధ్యతలను స్వీకరించిన మేనేజరుకు మాత్రము పూర్తి రోజు పని యుంటుంది.  అదే విధముగా జీవితములో బరువు బాధ్యతలు ఆఖరి శ్వాస తీసుకొనేవరకు ఉంటుంది అని గ్రహించిననవాడు తెలివైనవాడు.  అలాగే మమతలు, మమకారాలు జీవించినంత కాలము ఉండవు అని గ్రహించినవాడు అదృష్ఠవంతుడు.   

03.08.1996

రాత్రి కలలో శ్రీసాయి ఒక పల్లెటూరివాని రూపములో ఒక గుడిశెలో చిన్న కిరసనాయలు దీపము వెలిగించి నాతో అన్నమాటలు. 
"నీజీవితము ఓకిరసనాయలు దీపమువంటిది.  అది వెలుగుతు తన ప్రక్కన ఉన్నవారికి వెలుతురును ప్రసాదించుతుంది.  ఆదీపములో కిరసనాయలు ఆగిపోయినపుడు మాత్రము ఆరిపోయిన ప్రక్కవారి జీవితములో మాత్రము చీకటిని ప్రసాదించదు.  నీవు నీతోటివారికి వెలుతురును ప్రసాదించుతు ఈలోకమును వదలవసిన సమయములో ప్రశాంతముగా ఈలోకము వదలివెళ్ళిపో".

05.08.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఎన్.ఎఫ్.సీ. ఫైర్ ఆఫీసర్ శ్రీబాలకృష్ణ రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు.  "నీ జీవిత యాత్రలో ఆఖరి దశకు చేరుకొన్నావు.  నీవు ఒక్కడివే ప్రయాణము చేయాలి అని నిర్ణయించుకొన్నావు.  ఇటువంటి సమయములో నీవు  సంపాదించిన ధన, కనక, వస్తువులపై మమకారము ఎందుకు?  అవి మంటలలో కాలిపోతున్నపుడు వాటిని ఆర్పటము ఎందుకు?  నీవు మిగిలిన సామానులతో తృప్తిగా జీవించు, అంతేగాని ఆకాలిపోయిన సామానులు గురించి ఆలోచించటంలో అర్ధములేదు. 

(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment