25.05.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 నాలుగవ భాగము
సాయి.బా.ని.స. డైరీ - 1997 (04)
24.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి కలలో నాపిన తండ్రిశ్రీసోమయాజులుగారి రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) తమ స్వంత పనులుకోసము, తమసుఖాలకోసము నిన్నువినియోగించుకొంటారు ఈప్రజలు. మరినీవు కష్ఠాలలో ఉన్నపుడునీముఖము చూడటానికి ఎవరైన నీదగ్గరకు వస్తున్నారా!ఆలోచించు. అందుచేత అన్నిసమయాలలోను ఆభగవంతుని తోడుకోరుకో.
2) నీవు ఎవరి కష్ఠా న్ని ఉంచుకోవద్దు. కష్ఠానికి కూలి సరిగాఈయవలెను.
3) నీజీవిత ప్రయాణములో అహంకారము చోటు చేసుకొన్ననాడుఆప్రయాణములో నీ ఉనికే యుండదు అని తెలుసుకో.
4) నీయింటికి ఎవరు ఊరికే రారు. అటువంటివారిని ప్రేమతోపలకరించి గౌరవించు.
5) జీవితములో ధనవ్యామోహము, పరస్త్రీ వ్యామోహము నీకుతలనొప్పినే కలిగిస్తాయి. నీకు ప్రశాంత జీవితము కావాలి అంటేఈరెండు వ్యామోహాలకు దూరంగా జీవించు.
26.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి నా సాయి సోదరుడు శ్రీశంకరయ్య గారిరూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నిత్యము శ్రీహేమాద్రిపంతు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రనుపారాయణ చేయి. అదినిన్ను నీకుటుంబాన్ని కాపాడుతుంది.
2) ఇతరులను దూషించటము మానివేయాలి.
3) నీకు బహుమానముగా వచ్చే వస్త్రాలను వస్త్రహీనులకు దానముచేయాలి.
4) దర్పముతో తమ ఉనికిని పదిమంది గుర్తించాలి అనే భావనగలవారినుండి దూరముగా జీవించాలి.
5) 1996 లో నీఆరోగ్యాన్ని దొంగలు దోచుకొంటున్న సమయములోనాప్రేరణతో నీవు వారిని ఎదిరించి విజయాన్ని సాధించి నాబడిలోచేరినావు. నాబడిలో సర్వమతాలవారికి, అన్ని వయసులవారికిచోటుయుంది. నాబడిలో చేరినవారి అందరికి అన్నవస్త్రాలకు,ఆధ్యాత్మిక సంపదకు లోటుయుండదు అని గుర్తించు.
28.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి నాతండ్రి శ్రీరావాడ వెంకటరావుగారి రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) అనుక్షణము మంచిపనులు చేస్తు ఉండాలి అనే తలంపుతోజీవించగలిగితే జీవితములో పాపాలకు, తప్పుడు పనులకు చోటేలేదు. అప్పుడు పాపాలకు తప్పుడు పనులకు శిక్ష గురించిఆలోచించనవసరమే లేదు.
2) న్యాయ స్థానాలలో న్యాయము అమ్మబడుతున్న ఈరోజులలోతప్పుడు పనులకు, పాపాలకు శిక్ష వెంటనే ఎక్కడనుండివెలువడుతుంది. కొంచము ఆలస్యముగా భగవంతుడే శిక్షనువిధించుతాడు. అంతవరకు ఓరిమిపట్టక తప్పదు.
3) నీవు చేసిన పుణ్యాలలో నీభార్య పిల్లలకు వాటా ఉంది. మరినీవుచేసిన పాపాలలో వారికి వాటాలేదు. నీవు చేసే పాపాలలోపాలుపంచుకొనేవారు లేనపుడు నీవు ఆపాపాలను ఎందుకు చేయాలిఆలోచించు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment