Friday, 11 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (09)




12.05.2012  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.డైరీ -  1996  (09)

18.10.1996

నిన్నరాత్రి శ్రీసాయి నా చిన్ననాటిస్కూల్ టీచర్ రూపములో దర్శనముఇచ్చి నాలో దాగి ఉన్న తప్పులనుచూపి నా చేతిమీద బెత్తముతో కొట్టినాకు కనువిప్పు కలిగించినారు.ఆయన చెప్పిన మాటలు.
1) అనవసరముగా ఇతరుల విషయాలలో కలుగచేసుకోకుండ నీపనినీవు చేసుకొంటు యోగిలాగ జీవించుతు మంచి పేరు తెచ్చుకోవాలి.

2) తప్పులు చేయటము మానవ నైజము.  ఆతప్పులనుసరిదిద్దుకోవటము మాధవుని దయకు పాత్రుడు అవటమునీజీవితములో నీవు ఎన్ని తప్పులు చేయలేదు అలోచించు.  యింకఆతప్పులు చేయనని మాట ఇచ్చినావే - నీమాట నిలబెట్టుకోఇకమీదట ఇతరులు చేస్తున్న తప్పులు గురించి ఆలోచించకు.  నీవునమ్ముకొన్న సాయి మార్గములో ప్రశాంతముగా ప్రయాణముకొనసాగించు


20.10.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒకఫకీరు రూపములో దర్శనము ఇచ్చిచెప్పిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించినవి.  ఆమాటలు.

1) ఎంత చెట్టుకు అంత గాలి అనే సామెత నీకు తెలుసు కదా -అదేవిధముగా నీకు ఉన్న గ్రహించే శక్తికి తగిన సందేశాలనుఇస్తున్నాను.  వాటిని నీవు అర్ధము చేసుకొనగలుగుతున్నావుదానితో తృప్తి చెందు.

2) కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఉన్నదే - మరి నాభక్తులునాకు ముద్దు కాదా !

3) నీలో దాగి ఉన్న ఒక్కొక్క దుర్గుణాన్ని విసర్జించుతున్నావు.  అదేనాకు కావలసినది.

4) నా యితర భక్తులను తక్కువ అంచనా వేయవద్దు.  ఎవరిభక్తివారిది.  వారి భక్తిలోని విశిష్ఠత నాకు మాత్రమే తెలుసుఅందుచేత ఇతర సాయి భక్తులను నీవు విమర్శించవద్దు.

5) మత మార్పిడి అంటే నాకు ఇష్ఠము లేదు.  మత మార్పిడిచేసుకొన్నవారిని చూసి జాలి పడతాను వారు చేసిన తప్పు పనికిప్రతివారు తమ స్వధర్మాన్ని పాటించుతు ప్రశాంత జీవనముసాగించుతు భగవంతుని అనుగ్రహము పొందాలి

10.11.1996

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయి సత్ చరిత్రలోని గోపాలనారాయణఅంబేడ్ కర్ ఆత్మహత్య ప్రయత్నముపై శ్రీసాయి ఇచ్చిన సలహాలు,సూచనలపై ఆలోచించుతు నిద్రపోయినాను.  శ్రీసాయి "మానవజీవితములో చేయని తప్పులకు శిక్ష అనుభవించుతున్నవారిని,సంసార బాధలు పడలేక ఆత్మ హత్యలు చేసుకొన్నవారినిఆత్మహత్యఅనంతరము ఆకుటుంబములో తలెత్తిన నూతన సమస్యలనుచూపించిసమస్యల పరిష్కారానికి ఆత్మహత్య సమాధానముకాదుఅని తెలియచేసినారు.  
16.11.1996

నిన్నరాత్రి నిద్రకుముందు మానవ జీవితములో "మరణముఅనేపరిస్థితిపై సలహాలనుసూచనలను ప్రసాదించమని శ్రీసాయినివేడుకొన్నాను.  శ్రీసాయి శ్మసానములోని కాటికాపరి రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు

1) శ్రీసాయి భక్తులు సత్ చరిత్రలోని మేఘశ్యామునిలాగ ఆదర్శముగాజీవించి జీవితగమ్యాన్ని చేరండి.

2) జీవిత ప్రయాణములో నీవు నీగమ్యానికి చేరిన తర్వాత నీవువదలిన శరీరము ఏవిదహముగా పంచభూతాలలో కలుస్తుంది అనేఆలోచన నీకు అనవసరము.  దిక్కులేని శవాలకు దహనసంస్కారాలు చేయించేది నేనే.  

3) నీవు జీవించినంతకాలము నీజీవితాన్ని గంగానదిలాగ పదిమందికిఉపయోగపడని.  యమునా నదిలాగ భక్తితో భగవంతుని పాదాలనుకడగనిఅపుడు నీవు సరస్వతీ నదిలో (కింటికి కనిపించని నది)మోక్షాన్ని పొందగలవు.  అటువంటి జీవితముగడపినవాని పార్ధివశరీరము బూడిద అయిన తర్వాత ఆబూడిదను ఏనదిలో కలిపినత్రివేణి సంగమము (గంగా - యమున - సరస్వతినీటిలోకలిపినదానికంటే ఎక్కువ పవిత్రత సంపాదించుకొంటుంది.  

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment