Wednesday 23 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (02)




23.05.2012  బుధవారము


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1997 తరువాయి భాగాన్ని చదువుకుందాము. 



సాయి.బా.ని.డైరీ -  1997 (02)

28.01.1997

శ్రీసాయి ఒక సన్యాసి రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు నాలోఅనేక ఆలోచనలను రేకెత్తించినవి.

1.  నీజీవితములో సుఖశాంతులు కావాలి అంటే ఆబీద యింటిలోపుట్టి చిరునవ్వుతో ఏచీకు చింత లేకుండ జీవించుతున్న ఆపసివారినిచూడు.  


నీమనసుకూడ ఆపసివారి మనసులాగ యున్నరోజున మరియునీలోని దురాలోచనలు అనే మలినాన్ని విసర్జించిన రోజుననీజీవితములో సుఖశాంతులు వాటంతట అవే వస్తాయి

2.  జీవితములో శతృత్వము మంచిది కాదు.  అదే వచ్చేజన్మకుప్రాకుతుంది అని తెలిసికూడా ఈజన్మలో తోటివాడితో శతృత్వముపెంచుకొని నరకయాతన పడటములో అర్ధము లేదు.  ఈజన్మకుసార్ధకత లేదు.  


29.01.1997

శ్రీసాయి ఒక పోలీసు ఆఫీసరు రూపములో దర్శనము ఇచ్చిఅన్నమాటలు.

1) నీవు అక్రమ మార్గములో సంపాదించిన ధనమును చూసిఆనందము పడుతున్నావే అదే సమయములో నీకుటుంబ సభ్యులనుఅపహరించుకొనిపోయి పెద్దమొత్తములో ధనము ఇచ్చి నీవారినివిడిపించుకొని వెళ్ళమని గజదొంగలు నీకు ఉత్తరము వ్రాసిన నీపరిస్థితిఎలాగ ఉంటుంది ఒక్కసారి ఆలోచించు.  అందుచేత అక్రమమార్గంలోధనసంపాదన చేయవద్దు.  

2) పరుల సొమ్ముపై ఆశను వదలించుకోవాలి అంటే నీవు కష్ఠపడిసంపాదించిన ధనాన్నిముందుగా దానధర్మాలకు వినియోగించు

30.01.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చిఅన్నమాటలు.

1) నీవు చదువుతున్న ధర్మ శాస్త్రము అనే పుస్తకములోని ఒక పేజీఊడిపోయి రోడ్డుమీద పడియున్నపుడు అధర్మ మార్గములోనడుస్తున్న ఓవ్యక్తి ఆపేజీని తీసుకొని చింపి వేసిన సమయములోనీవు ఆవ్యక్తిని దూషించటములో అర్ధములేదు.  ధర్మ శాస్త్రాన్నిజాగ్రత్తగా నీమన్సులో దాచుకొని ఆమార్గములో పయనించవససినదినీవు అనేది సదా గుర్తుంచుకో.

2) ఈదేశములో తినడానికి ఆహారములేక బాధపడుతున్నఅభాగ్యులు ఉన్నారు.  

పెండ్లిళ్ళు శుభకార్యాలలో విందుల పేరిట అన్నాన్ని నేలపాలుచేస్తున్నవారు ఉన్నారు.  

అటువంటి సమయములో నీవు చేయవలసిన పని ఏమిటి అంటేఅన్నార్తులకు అన్నము దొరికేలాగ చూడు.  అన్నమును బాగా తినిబలిసినవాడికి బ్రహ్మజ్ఞానము కలిగేలాగ ఆభగవంతుని ప్రార్ధించు

31.01.1997

శ్రీసాయి నాకు జన్మ ఇచ్చిన నాతల్లి రూపంలో దర్శనము ఇచ్చిఅన్నమాటలు.

1.  శ్రీసాయి తత్వ ప్రచారములో అనేకమంది తమ స్వంతఆలోచనలను ప్రజలకు చెబుతున్నారు.  వారిమాటలలోనిమంచి,చెడులను ప్రజలు గుర్తించి అటువంటి దొంగస్వామీజీల బండారమును బయటపెడతారు.  అందుచేత నీవుభగవంతుని గురించి తెలుసుకోవాలని కోరికయున్న శ్రీసాయి సత్చరిత్రను నిత్యము పారాయణ చేస్తు శ్రీసాయి అనుగ్రహాన్ని పొందు.

2)  నీవు న్యాయమార్గములో నడుస్తున్నాఅన్యాయ మార్గములోనడిచేవారు నిన్ను హింసించుతున్నారు.  అందుచేత నీవు దుష్ఠులకుదూరంగా యుండటము నేటి యుగధర్మము అని గుర్తించు.

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment