Sunday 6 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (03)



06.05.2012  ఆదివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి 

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996 3వ. భాగాన్ని చదువుకుందాము. 


సాయి.బా.ని.. డైరీ -  1996 (03)


1) శ్రీ సాయి తత్వమును సాయిబంధువులకు ధైర్యముగా చెప్పు నీకుతెలిసిన విషయాలు ఆధారలుతో సహాతెలియచేయి శ్రీ సాయి జీవిత చరిత్రలోరహస్యాలు ఏమీ లేవు.

2) నీ దైనందిక జీవితములోశ్రీసాయిసేవలో శ్రధ్ధ-సహనము అనేసైకిలును వాడు కష్ఠపడిపాలదుకాణానికి వెళ్ళి పాలు తెచ్చుకో.

3. నీ భార్యను కూడ సాయి బంధువుగా చూడు అపుడు ఆమెపైవ్యామోహము తగ్గుతుంది వ్యామోహము లేకుండ ప్రశాంతముగాసంసార జీవితము సాగించు ఆమెతో.

19.06.1996

శ్రీసాయి నిన్న రాత్రి నాచిన్ననాటి స్కూల్ టేచర్ రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు.

"మానవ జీవితము తెల్లకాగితమువంటిది ఆకాగితము మీద మంచివిషయాలు వ్రాసిననాడు అందరు ఆకాగితాన్ని గౌరవముగాచూస్తారు అదే కాగితముమీద చెడ్డ విషయాలు వ్రాసిననాడు అందరుఆకాగితాన్ని చింపి వేసి బుట్టదాఖలు చేస్తారు." అందుచేత జీవితాన్నితెల్లకాగితముగా భావించి మంచి పనులు చేయాలి.   

24.06.1996

శ్రీసాయి అజ్ఞాత వ్యక్త్రి రూపములో అన్నమాటలు.


1) ఈనాటి సమాజములో మానవుడు తన అధికారాన్నిప్రదర్శించడములోను, అక్రమ మార్గములోధనముసంపాదించడములోను, మునిగియున్నాడు కనీసము తోటిమానవుడి గురించి ఆలోచించటములేదు అటువంటి పరిస్థితిలలోఆధ్యాత్మిక విషయాలు చెబితే వినేవాడు ఎవడు?

2) తోటిమానవుడికి ఒక రూపాయి ఇవ్వలేకపోయిన బాధపడకుఆకలితో ఉన్న ఆవుకు ఒక రూపాయి గడ్డిని కొనిపెట్టు భగవంతుడుసంతోషించుతాడు

01.07.1996

శ్రీ సాయి నిన్నరాత్రి నేను చదివిన పోలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీపీ.హెచ్.ఎన్.బీ.శర్మగారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలునాలో ఆలోచనా శక్తిని వృధ్ధిపరిచినది ఆయన అన్నమాటలు.

"మానవ జీవితాన్ని ఒక యంత్రముతో పోల్చి చూడు నీవేఆశ్చర్యపడతావు. యంత్రము తన జీవిత కాలములో ఏవిధమైన కీర్తిప్రతిష్ఠలు ఆశించకుండ తన జీవితకాలము పూర్తి చేసి తర్వాతఇనుపబట్టీలో కరిగించబడి తిరిగి నూతన యంత్రముగా తయారుఅయి కర్మాగారములో పని చేస్తుంది. మరి మానవ జీవితములోఈశరీరమును నీ బరువు బాధ్యతలను పూర్తి చేసుకోడానికివినియోగించాలి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించటానికి కాదు నీబరువుబాధ్యతలు పూర్తి అయిన తర్వాత ఒకనాడు ఈశరీరము మట్టిలోకలసిపోవలసినదే కదా. మరి మట్టిలో కలసిపోయే శరీరముపైవ్యామోహము విడనాడి ఈజన్మలో మంచిపనులకు మరియు మంచిపునర్ జన్మ పొందటానికి చేయవలససిన పనులకు వినియోగించు శరీరాన్ని

02.07.1996

నిన్న రాత్రి శ్రీసాయి నాతండ్రి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. "నీతల్లి తండ్రులు నీకు తెలియచేసిన ధర్మాన్ని పాటించుపరమత సహనాన్ని పాటించు క్షణిక ప్రయోజనాల కోసముపరధర్మాన్ని స్వీకరించకు స్వధర్మాన్ని పాటించుతూ నీగమ్యాన్నిచేరుకో."

"ఒకనాటి నీస్నేహితుడు ఇంకా చెడుమార్గములో నడుస్తున్నాడనిఅతనిని నిందించవద్దు నీకు వీలు అయితే అతనినిమంచిమార్గములో పయనించమని సలహా ఈయి ఒకప్పుడు నీవుకూడ అతనితోపాటు చెడుమార్గములో ప్రయాణము చేసినవాడివేకదాఅతను నీసలహాను పాటించనపుడు నీవు అతనినుండిదూరముగాయుండటమే మేలు." 

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment