Tuesday 8 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (05)







08.05.2012  మంగళవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ -  1996 5వ.భాగాన్ని చదువుకుందాము


సాయి.బా.ని.స. డైరీ -  1996  (05) 



08.08.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 


"శ్రీ సాయి లీలా అమృతమును కొందరు త్రాగి జీర్ణించుకొని సుఖ శాంతులతో జీవించుతారు.  కొందరు ఆలీలామృతము సీసాను (శ్రీసాయి సత్ చరిత్ర) తమ యింట షోకేసులో పెట్టుకొని సంతోష పడతారు.  ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభించుతుంది.  అందుచేత ఎవరి చేత బలవంతముగా శ్రీసాయి లీలామృతము త్రాగించరాదు. 

20.08.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో ఆలోచనలు రేకెత్తించినవి.  అవి

1) నా తత్వ ప్రచారములో నీమాటలు కొందరికి రుచించుతాయి.  కొందరికి కాలక్షేపము కలిగించుతాయి.  నీవు మాత్రము నేను ఇచ్చిన బాధ్యతను పూర్తిచేయి.

2) నాతో నీవు పొందిన అనుభవాలను నీపిల్లలు డైరీలో వ్రాసి నీకు బహుకరించుతారు.

3) నీవు తెల్లని వస్త్రాలను ధరించినావు.  కాని, నీవు యింకా యితరులను దూషించసాగటము వలన నీవస్త్రాలపై మరకలు పడుతున్నాయి.  ఆమరకలను శుభ్రము చేయడము కష్ఠము.  అందుచేత ఇతరులను దూషించటము మానివేయి.

4) నీవు వ్రాస్తున్న డైరీనుండి సాయి బంధువులు అనేక విషయాలు తెలుసుకొని సుఖ, శాంతులతో జీవించుతారు.


25.08.1996

నిన్నరాత్రి శ్రీసాయి నామాతా మహుని రూపములో దర్శన ము ఇచ్చిఅన్నమాటలు.

"మనిషి చనిపోయి పునర్జన్మ ఎత్తటము సహజము.  ఆమనిషి బ్రతికిఉన్నపుడు అతనికి పూజలు చేయడము గొప్పకాదు.  అతనిమరణానంతరము కూడ ఆతనిలోని గొప్పతనాన్ని గుర్తుంచుకొనిపూజించటము నీఔన్నత్యానికి నిదర్శనము.  సంవత్సరానికిఒకరోజున (ఆభ్ధికమునాడుఅతనిని పూజించు.  అంతేగానిచేదుమాటలు మాత్రము అనవద్దు.

29.08.19996

నిన్నరాత్రి శ్రీసాయి సమాధి మందిరములో సత్ సంగము జరిగినదిఅక్కడ హాలులో ఒక సైకిల్ మీద పదిమంది ఎక్కినారుకాని ఒకముసలివాడు (శ్రీసాయిమాత్రము ఆసైకిలును త్రొక్కసాగినాడుతెల్లవారిన తర్వాత దీనికి అర్ధము ఏమిటి అని ఆలోచించినానునాకు తోచినది.  "శ్రీసాయి సత్ సంగములలో సాయిమార్గమునుచూపించువారు శ్రీసాయి.  ఆమార్గములో ప్రయాణముచేయవలసినవారు శ్రీసాయి భక్తులు.    `

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment