17.05.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1997 ప్రారంభము
సాయి.బా.ని.స. డైరీ - 1997 (01)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1997 ప్రారంభము
సాయి.బా.ని.స. డైరీ - 1997 (01)
04.01.1997
నిన్న రాత్రి శ్రీసాయి
ఒక సన్యాసి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
"ఆధ్యాత్మిక రంగములోని వ్యక్తులతో
స్నేహానికి భాష, వయసు, మనిషి ఆకారము
అనేవి అడ్డంకములు
కావు.
మనిషి మనసు అతనికి భగవంతునిపై యున్న
నమ్మకము ముఖ్యము. భగవంతునిపైయున్న
నమ్మకము ఉన్నవారితో
కలసి ఆధ్యాత్మిక
రంగములోని విషయాలు చర్చించాలి. కాని,
ప్రయాణము మాత్రము ఏకాంతముగా చేయాలి.
08.01.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక
ముసలివాని రూపములో దర్శనము ఇచ్చి అన్న
మాటలు.
1) ఇతరులు చేసిన తప్పులు
తెలుసుకోవటములో తప్పు లేదు. నీవు
మాత్రము ఆతప్పులు
చేయకుండ జీవించటము
ఒక గొప్పవిషయము.
2) ప్రశాంత జీవితము గడపాలి
అంటే మంచి
చెడులను గుర్తించాలి. వాటిలో
మంచివి మాత్రమే
స్వీకరించాలి.
19.01.1997
శ్రీసాయి ఒక తోటమాలి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
"నీవు గతములో విషబీజాలు నాటితే అవి
విష వృక్షాలుగా
ఎదుగుతాయి. ఆవృక్షాలు
నీకు చల్లటి
నీడను యిస్తాయి
అని తలచటము
నీభ్రమ.
ఆచెట్టు
సమాజానికి పనికిరాదు కనుక ప్రజలే ఆచెట్టును
కూకటి వేళ్ళతో
పెకలించివేస్తారు.
22.01.1997
శ్రీసాయి ఒకబస్సు డ్రైవరు
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
"నీవు ఆధ్యాత్మిక రంగములో
ముందుకు పయనించాలి
అంటే, ప్రాపంచిక
రంగములోని నీబరువు బాధ్యతలను భగవంతునిపై నమ్మకముతో
నిర్వహించాలి. అప్పుడే
నీవు నీగమ్య
స్థానమును ఒడిదుడుకులు లేకుండ చేరగలవు.
24.01.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక
అజ్ఞాత వ్యక్తి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) ఈసమాజములో ధనవంతులు, మరియు
బీదవారు సంతోషముగా
జీవించుతున్నారు. జీవించటానికి
ధనము ఒక్కటే
ప్రధానము కాదు. సంతోషముగా జీవించాలి అనే
పట్టుదల ముఖ్యము.
2) నీవునివసించుతున్న
నీస్వంత ఇల్లుకు
ఖరీదు కట్టడము
అవివేకము. నీయింటిలో
నీవు సుఖ
శాంతులతో జీవించటానికి ప్రయత్నించటము
వివేకము.
3) జీవిత ప్రయాణములో నీబంధువులు,
నీస్నేహితులు నీసుఖసంతోషాలను దోచుకోగలరు. కాని
నీకు ఉన్న
భగవంతుని అనుగ్రహాన్ని ఎవరు దోచుకోలేరు.
అందుచేత భగవంతుని అనుగ్రహముతో ప్రశాంత జీవితము
గడుపు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment