Tuesday, 15 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (11)



                                         


15.05.2012  మంగళవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


అందరకు సర్వ శుభములూ కలగాలని హనుమంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 


ఈ రోజు హనుమజ్జయంతి  


హనుమత్ గాయత్రీ మంత్ర 


ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి


తన్నో హనుమత్ ప్రచోదయాత్ 


సాయి.బా.ని.స.  డైరీ -  1996  (11) 


28.11.1996

నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికినమస్కరించినాజీవితములో నాకుజరుగుతున్న అన్యాయాలునేనుపడుతున్న కష్ఠాలు ఏకరువు పెట్టినన్నుకాపాడమని వేడుకొన్నాను.  
శ్రీసాయి తుఫాన్ లో సముద్రముమధ్య ప్రయాణము చేస్తున్నఓనావను చూపించినారు.  

ఆయన ఆనౌక నడిపే వ్యక్తిని పిలచి ఆనౌక మీద విష్ణు సహస్రనామంఅనే జండాను ఎగరవేయమన్నారు.  అపుడు ఆతుఫాన్ తగ్గి నౌకచక్కగా తన ప్రయాణము సాగించసాగినది.  

తుఫాన్ తగ్గిన తర్వాత ఆనౌక యజమాని తనపుట్టినరోజు పండగఆనౌకలో జరుపుకొంటు తనవద్దనున్న "శ్రీ విష్ణు సహస్రనామము"పుస్తకమునుండి శ్రీమహావిష్ణువు 1008 నామాలను చక్కగాచదవసాగినాడుఆసమయములో ఆకాశము నుండి ఆనౌకయజమాని పితృదేవతలు ఆనౌకలోనికి వచ్చి ఆనౌకలోనివారినందరినిఆశీర్వదించినారు.    

ఈవిధమైన కలద్వారా శ్రీసాయి నాకు తెలియచేసిన సందేశాన్నిఅర్ధము చేసుకొన్నాను.  జీవితములో కష్ఠాలను తొలగించుకోవడానికిశ్రీవిష్ణుసహస్రనామము చదవాలి అని నిర్ణయించుకొన్నాను.   

12.12.1996

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి జీవితములో సుఖశాంతులుపొందాలి అంటే అనుసరించవససిన మార్గము చూపు తండ్రి అనివేడుకొన్నాను.  శ్రీసాయి చూపిన దృశ్యాల సారాశము.

1) ధనసంపాదనలో అత్యాశ పనికిరాదు.  నీకు ఉన్న అర్హతప్రకారము ధనము సంపాదించాలి.

2) జీవితములో నీవు పొందలేకపోయిన "ప్రేమనుగుర్తుచేసుకొంటుఎవరినుండి అయిన సానుభూతి పొందాలి అనిప్రయత్నించినపుడు నీకు మిగిలేది "అశాంతిఅని గుర్తుంచుకోనీవు పొందలేకపోయిన ప్రేమ సముద్రములో కలసిపోయిన త్రాగే నీరుఅని గ్రహించు.

3) ఒకపని మొదలుపెట్టినపుడు ఆపని పూర్తి అగువరకు యింకొకపని మొదలుపెట్టరాదు.

4) దూరముగాయున్న బంధువుల గురించి ఎక్కువగాఆలోచించేకంటే దగ్గరలో యున్న మంచి వ్యక్తులతో సత్ సంగాలలోపాల్గొనటముమంచిది.
  
  19.12.1996

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగముపై సలహాలు,సూచనలు ప్రసాదించమని వేడుకొన్నాను.  శ్రీసాయి ఒక కాలేజీవిద్యార్ధి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో అనేకఆలోచనలు రేకెత్తించినవి.

1) కొందరు ఆధ్యాత్మిక రంగములో సేవ చేస్తున్నాము అనేఉద్దేశముతో సంఘములో తన మనుషులను తయారు చేసి కీర్తిప్రతిష్ఠలను సంపాదించగలరు.  నిజానికి ఆకీర్తి ప్రతిష్ఠలు వారికిఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించలేవు

2) యోగీశ్వరుల జీవిత చరిత్ర నాకు బాగాతెలుసు అనే అహంకారమువిడనాడినేను ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచనలతో సత్సంఘాలలో పాల్గొనాలి.  

అపుడే భగవంతుని అనుగ్రహము సంపాదించగలరు


23.12.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక పల్లెటూరివాని రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు మర్చిపోలేనివి.

1)  ప్రస్తుతము శ్రీసాయిపై నీకు ఉన్ననమ్మకము నీటితొట్టిలోనిచేపపిల్లవంటిది.  అది ఒకనాటికి సాగరములోని పెద్ద చేపలాగమారాలి

2) శ్రీసాయి మనపాలిటి గోమాత.   గోమాత పొదుగునిండ పాలుఉన్నాయి.  ఆపాలును నీవు ప్రేమతో పిండుకొని నీవుత్రాగి,నీప్రక్కవారికి కూడ పంచిపెట్టు.

30.12.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి నాబంధువు శ్రీసోమయాజులుగారిరూపముతో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాజీవితములో బరువుబాధ్యతలను సక్రమముగా నిర్వహించడానికి ఉపయోగపడినవిఆయన అన్నమాటలు.

1) నీ గ్రామ సరిహద్దులలో ప్రవహించుతున్న తెలుగుగంగ (గోదావరి)చాలా పవిత్రమైనది

కొన్నివేల ఎకరాల వరిపొలాలకు నీరు అందచేసి కోటానుకోట్లమందిఆకలిని తీర్చుతున్నది.

2) గృహస్థ ఆశ్రమములో భార్యపిల్లప్రేమను పొందాలి అంటే ధనసంపాదన చాలా ముఖ్యము.  ధనసంపాదన ఆగినరోజున ఆయింటగొడవలు ప్రారంభము అగుతాయి.  అందుచేత గృహస్థ ఆశ్రమములోఉన్నంత కాలము ధన సంపాదనను కొనసాగించుతు ఉండాలి.

3) సంసార బాధ్యతలునుండి పారిపోయి సన్యాస  ఆశ్రమము తీసుకోవటము కంటే గృహస్థ ఆశ్రమములో బాధలు పడుతుభగవంతుని అనుగ్రహము పొందటము మేలు అని గుర్తించు.





(ఇంకాఉంది)


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment