Wednesday, 9 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (06)






09.05.2012  బుధవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996  6వ.భాగాన్ని చదువుకుందాము.


సాయి.బా.ని.స. డైరీ -  1996 (06) 



07.09.1996

శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక చిన్నస్కూల్ లోని టేచర్ రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నాతత్వ ప్రచారములో భాగముగానీవు పదిమంది సాయి భక్తులుతో కలసిసత్ సంగాలు నిర్వహించులేదా అనేకవందలమందిని ఉద్దేశించి నాతత్వాన్నిఉపన్యాసము రూపములో వారికి అందచేయిఎవరైనా ప్రశ్నలువేసినపుడు ఓరిమితో వారికి సమాధానము చెప్పు.

2) అజ్ఞానము అనే అడవిలో తిరుగుతున్న నావాళ్ళకు సాయితత్వప్రచార పుస్తకాలను ముద్రించి వారికి పంచిపెట్టు

3) సత్ సంగాల తర్వాత నీవు నాకు హారతి ఇచ్చి నైవేద్యముపెడుతున్నావేనేను వాటిని క్రిమికీటకాదుల రూపములోస్వీకరించుతున్నాను
నాకు అర్పించిన ఆనైవేద్యమునుప్రసాదముగా నావాళ్ళకుపంచిపెట్టు. 



08.09.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి శిరిడీలోని వేప చెట్టుక్రింద కూర్చుని తనదగ్గరకు వచ్చిన భక్తులను ఉద్దేశించి అన్నమాటలు.

1) 1918 నాటి సినీమాల ప్రభావము సమాజము శ్రేయస్సుకుఉపయోగపడేలాగ ఉండేది.  కాని నేటి సినీమాల ప్రభావముసమాజము వినాశనానికి ఉపయోగపడేలాగ మారుతున్నది.  

2) 1918 నాటి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసమునమ్మకముతో దేవీదేవతలను పూజించేవారు.  కాని ఈనాడుతల్లితండ్రులు ధనసంపాదన కోసము దేవి దేవతలను పూజించుతు,పిల్లల భవిష్యత్ గురించి పట్టించుకోకపోవటము చాలా విచారకరము.   

3) 1918నాటి డాక్టర్లు రోగులకు వైద్యము చేస్తు భగవంతునిసహాయము అర్ధించేవారు.  కానిఈనాడు వైద్యులు తమ వైద్యముతోరోగి ఆరోగ్యము పొందగలిగితే దానిని తమ ఘనతగాచెప్పుకొంటున్నారు.  రోగి మరణించితే భగవంతుని దయలేదుఅంటున్నారు.

13.09.1996

శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక మందిరములోని పూజారి రూపములోదర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) జీవితములోని కష్ఠాల వరదనుండి బయటపడి నీతల్లితండ్రులఆశీర్వచనములతో భగవంతుని గుడికి చేరుకొన్నావు.  కష్ఠాలవరదలో కొట్టుకొనిపోయి తమ ప్రాణాలను కోల్పోయినవారు అనేకమంది ఉన్నారు.  నీవు చాలా అదృష్ఠవంతుడివి.  భగవంతునిగుడిమెట్లు పైకి ఎక్కగలగినావు.

*** 2) ఉద్యోగాలు లేక అనేకమంది బాధలుపడుతుంటే నీవుఉద్యోగము మానివేస్తాను అంటావు ఎందుకు?  సరి అయినసమయము రాగానే నేనే నీచేత ఉద్యోగము మానిపించి నాతత్వప్రచారానికి నిన్ను నియమిస్తాను.  అంతవరకు ఉద్యోగము చేయి.

3) అడ్డదారులు త్రొక్కుతు ధనసంపాదన చేస్తున్న స్త్రీ,పురుషులనుండి దూరంగా జీవించు.

4) నీజీవితములో ఇంతవరకు పేరుకొనిపోయిన చెడు అనే మురికిని"సాయిఅనే పటికతో శుభ్రము చేసుకొని మంచిమార్గములోపయనించు.   

***శ్రీసాయి ఆదేశానుసారము శ్రీ సాయిబానిస రావాడగోపాలరావుగారు తన ఉద్యోగమునుండి మార్చ్ 2000సంవత్సరములో స్వచ్చంద పదవీ విరమణ చేసి శ్రీసాయి సేవకుఅంకితమైనారు - 

27.09.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చిఅన్నమాటలు.

1) పరస్త్రీలను పొగడటమునీపేరు ప్రఖ్యాతుల కోసము వారినివాడుకోవడము మహాపాపము.

2) ఈజీవిత నాటక రంగములో నీవు ఒకనటుడివి.  ఈవిషయాన్నితెలుసుండికూడా నీవు స్వంతనాటకాలు ఆడుతు ఎవరిని మోసముచేయదలచినావు?

3) సంసారము అనే సముద్రములో కష్ఠాలు కలిగించే పాములుఉన్నాయి.  మరియు ప్రశాంతతనిచ్చే ముత్యపు చిప్పలు ఉన్నాయినీవు భగవన్ నామము ఉచ్చరించుతు పాములకు దూరంగాయుంటు ఆముత్యపు చిప్పలులోని ముత్యాలను ఏరుకోవాలిజీవితాన్ని సార్ధకము చేసుకోవాలి

4) శ్రీసాయినాధుని బడిలో కడుపునిండ ఆధ్యాత్మిక విందు ఆరగించినతర్వాత బయటకు వచ్చి చిరుతిళ్ళు తినడము ఎందుకు

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


No comments:

Post a Comment