Thursday, 10 May 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (08)




11.05.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.డైరీ -  1996  (08)

02.10.1996

నిన్నరాత్రి కలలో ఒక గుడికివెళ్ళినానుఆగుడి ఆవరణలో ఒకస్వామీజి భక్తులను ఉద్దేశించిఉపన్యాసము ఇవ్వసాగినారు

 వారిఉపన్యాసములో  ముఖ్య విషయాలునన్ను ఆకర్షించినవి.



1)  ఆధ్యాత్మికపరమైనవిషయాలు వినేటప్పుడుప్రాపంచిక విషయాలు గురించిఆలోచించరాదు.  అట్లాఆలోచించినవాడు తన్ను తానుమోసముచేసుకోవటమే.

2)  ఆధ్యాత్మిక విషయాలు చేప్పే గురువు తన శిష్యుడిని తోసమానముగా చూడాలి.

3)  భగవంతుని గొప్పతనాన్ని గుర్తించి భగవంతునికి సేవ చేస్తున్నక్రిమికీటకాదులుజంతువుల చరిత్రను (శ్రీకాళహస్తీశ్వరుని చరిత్ర)

తెలిసిన మానవుడు మాత్రముఆధ్యాత్మికపరమైన విషయాలనుతెలుసుండి కూడసాధుస్వభావాన్నిఅలవర్చుకోలేకపోతున్నన్నాడే.

04.10.1996

శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి నాధ్యాత్మిక రంగప్రయాణములోని తప్పుడునడకలను చూపించికనువిప్పుకలిగించారు.  వారు చెప్పినమాటలు.

1) యితరులు నాసేవ చేసుకొని పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారుఅనే భావనవారి సేవలోని దోషాలను చూడటము మానివేయిభక్తిలో ఇతరులతో పోల్చుకోవద్దు.  ఎవరి భక్తి వారిది.  నీకు ఉన్నపరిధిలో నీవే నాసేవ చేసుకొని తృప్తిపొందు.    

15.10.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్త్రి రూపములో దర్శనము ఇచ్చినాతో అన్నమాటలు నాలోని కొన్ని బలహీనతలను తొలగించినవిఆమాటలు::

1) నీకు ఇష్ఠములేని వ్యక్తులను జంతువులతో పోల్చి ఆజంతువులనుఅవమానపర్చకు.  ఆజంతువులు నీపొలములో పనిచేస్తాయి.  కొన్నినీయింట పాలు ఇస్తాయి.  అవి చనిపోయిన తర్వాత వాటి చర్మమునీచెప్పుల తయారీకి ఉపయోగపడతాయి.  మరి నీకు ఇష్ఠము లేనివ్యక్తి నీకు పనికిరాడుగా!  

2) భగవంతుని గుడిలో పూజలుగుడి చుట్టు ప్రదక్షిణలునీఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఒకవేళ నీవు అనారోగ్యముతో ఉన్నసమయములో భగవన్ నామస్మరణ ఒక్కటే నీలో మానాసిక పరివర్తనకలిగించి నీఅనారోగ్యానికి మూలకారణము చూపించి నిన్నువాటినుండి దూరముగా ఉంచుతుంది.

3) నీవు అధికారములో యున్నపుడు నీఅధికారదర్పముతో ఎవరిమనసు గెలవలేవుయుక్తిగా ప్రేమతో నీతోటి ఉద్యోగులమనసు గెలవగలవు.  అదే విధముగా భగవంతుని అనుగ్రహము పొందాలిఅంటే భక్తి,  ప్రేమలతో ఆయనను అనుక్షణము స్మరించుతు ఉండాలి.

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


No comments:

Post a Comment