Saturday 2 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (09)






02.06.2012
సాయి.బా.ని.స. డైరీ - 1997  (09)

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


14.06.1997

నిన్నరాత్రి శ్రీసాయి షిరిడీ సాయిమందిరములోని పూజారిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు. 
1) భగవంతుడు తన గొప్పతనాన్ని శ్రీసాయికి చూపినారు.  పంచభూతాలలో ఉన్న భగవంతుడిని శ్రీసాయి తన భక్తులకు చూపించినారు.  

2) శారీరిక సుఖాలుకోసము మీరు అడ్డదారులులో ప్రయాణము చేసిన మిగిలేవి మీశరీరాలకు రోగాలు మాత్రమే. అదే మీరు మానసిక సుఖశాంతులకోసము ప్రయత్నాలు చేసిననాడు అవి కొంచము ఆలస్యముగా వచ్చిన ఆసుఖశాంతులు శాశ్వతముగా మిగులుతాయి.

3) గృహస్థ జీవితములో భార్యయొక్క ధనసంపాదన పైనే ఆకుటుంబము ఆధారపడినపుడు భర్త ఆకుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త పడకపోతే ఆకుటుంబము రోడ్డున పడే ప్రమాదముయుంటుంది. 

16.06.1997

నిన్నరాత్రి శ్రీసాయి నేను పుట్టిన గ్రామపెద్దగా దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1)  జీవితములో ఎగుడు, దిగుడులు సహజము.  ఈవిధమైన జీవిత ప్రయాణములో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవలి.  నీవు ఇంకొకరి గురించి ఆలోచించటములో అర్ధము లేదు. 

2)  ప్రతి తల్లికి తన పిల్లలు అంటే చాలా ప్రేమ.  నీవు వారి వ్యవహారాలలో తలదూర్చటము ఆతల్లి కోపానికి గురికావటము అని గ్రహించు. 
3) మామిడి చెట్లు అన్నీ చూడటానికి ఒకే రూపములో యుంటాయి.  కాని ఆచెట్లకు కాచే మామిడి పండ్లు యొక్క రుచులు వేరు.  

అలాగే శ్రీసాయి భక్తులు అందరు ఒక్కలాగే యుంటారు.  కాని వారిమనోభావాలు వేరువేరుగా యుంటాయి అని గ్రహించు.  
4)  నీగురువుకు నీగురించి అన్ని విషయాలు తెలుసును.  నీవు వారియోగ క్షేమాలు తెలుసుకోవాలి అనే తాపత్రయము పడేకన్న వారి సేవలో నీజీవితాన్ని గడిపి నీజీవిత గమ్యాన్ని చేరుకో.   

08.08.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) జీవితములో ప్రతిఒక్కడు ఒక సమయములో ఉన్నత స్థితిని చవిచూస్తాడు.  తర్వాత అక్కడనుండి సాధారణ స్థితికి చేరుకొంటాడు.  అటువంటి సమయములో నిజాలను అంగీకరించటమే ఆధ్యాత్మిక శక్తి. 

2)  ఆధ్యాత్మిక రంగములో కాలుపెట్టిన వ్యక్తి తన చుట్టు ఉన్నవ్యక్తులు తనను చూస్తున్నారు అనే భావనతో మంచి మార్గములో ముందుకు సాగిపోవాలి.  తనప్రక్కవాడికి మార్గదర్శకుడిగా యుండాలి.  అంతేగాని, ప్రాపంచిక రంగములోని తలనొప్పిలను తెచ్చుకోరాదు.  

3) ఆనాడు బాబా " సబ్ కా మాలిక్ ఏక్  హై , అల్లా మాలిక్  హై అని అన్నారు.  కాని మనమందరము ఇపుడు ఒక మాటపై నిలబడదాము. అదే " హం సబ్ కా ఖూన్ ఏక్ హై, సాయి ఉస్ ఖూన్ కా తాకత్ హై" 

16.08.1997

నిన్నరాత్రి శ్రీసాయి నేను చదివిన హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయునిగా దర్శనము ఇచ్చి, భారతదేశ జాతీయ జెండాను ఆవిష్కరించి అన్నమాటలు. 

1) పదవులు సంపాదించుకోవటానికి కులము, మతమును అడ్డుగా పెట్టుకొంటారు.  పదవులు వచ్చిన తర్వాత ఆపదవులను కాపాడుకోవటానికి కులము, మతముల మధ్య వైషమ్యాలు కలిగించుతారు.  నిజానికి కులమతాల మధ్య స్నేహము లేదు, శత్రుత్వము లేదు.  భగవంతుని దృష్ఠిలో అన్నికులాలు మతాలు సమానమే.   

2) నీవు వెండి కంచములో భోజనము చేసినావా, లేక బంగారు కంచములో భోజనము చేసినావా, అనేది ముఖ్యము కాదు.  అలాగే ఏమతములో జన్మించినావు  అనేది ముఖ్యము కాదు.  నీవు చేసే ఆధ్యాత్మిక భోజనము వలన నీమనసులో ఉన్న ఆకలి తీరినదా లేదా అనేది ముఖ్యము. అందుచేత ఏమతము గొప్పది అనే విషయమును ఆలోచించవద్దు.   

(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment