Wednesday 27 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (15)


                                            


                               
                                  
27.06.2012 బుధవారము 
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు

సాయి.బా.ని.డైరీ - 1998 (15)

16.09.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసిరూపములో దర్శనముఇచ్చిఅన్నమాటలు.
1) వెలుతురు లేని చోట మొక్కలనుపెంచడానికి నీవు కరెంటు దీపాలువెలిగించి మొక్కలను పెంచుతున్నావే,
అలాగే నీజీవితములోని చీకటిని తొలగించటానికి సద్గురువునునమ్ముకో
భగవంతుని శక్తి సద్గురువులో యున్నది.  సద్గురువు భగవంతునికిప్రతిరూపము అని గుర్తించు.

2) గురుశిష్యుల బంధము తండ్రి కొడుకుల బంధము .  తండ్రికొడుకులు శారీరకముగా ఒక్కరే.  అలాగే గురుశిష్యులుమానసికముగా ఒక్కరేఅలాగే గురు శిష్యులు మానసికముగాఒక్కరేగురు శిష్యులు శరీరాలు వేరు కాని వారిలోని ఆత్మలుమాత్రము ఒక్కటే.

3) నీ గురువు గురించి ఎవరైన చులకనగా మాట్లాడిన  నీకు కోపమురావడము సహజము.  కాని తర్వాతనీవు వారితో ప్రేమగా మాట్లాడినీగురు తత్వము వారికి బోధించు.

18.09.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక స్త్రీ రూపములో దర్శనం ఇచ్చి అన్నమాటలు.

1) కొందరు జీవితములో కంగారు జంతువులాగ తల్లి చాటున పెరిగిపెద్దవారు అగుతారు.  మరికొందరు పెంగ్విన్ పక్షులలాగ పుట్టుకతోనేతల్లిప్రక్కన తమ కాళ్ళపై నడుస్తు పెద్దవారు అగుతారు.  మరికొందరుతల్లి తాబేలు పిల్ల తాబేలులాగ ఒకరిని యింకొకరు చూసుకోపోయినపెద్దవారు అగుతారు.  ఎవరు ఏవిధముగా పెరిగి పెద్ద్దవారు అయినతల్లిగర్భమునుండి బయటకు వచ్చి తల్లి ఆశీర్వచనాలతో పెరిగిపెద్దవారు కావలసినదే అని గ్రహించాలి.   
 
2) ఈజన్మలో నీవు నీపిల్లలను ప్రేమతో పెంచి పెద్దవారిని చేయకపోతే,వారు మరు జన్మలో మరల నీకు పిల్లలుగా పుట్టి నీనుండిఋణానుబంధమును పూర్తిగా స్వీకరించుతారు.  అందుచేతఈజన్మలో నీపిల్లల పట్ల నీబాధ్యతను సరిగా నిర్వర్తించి మరు జన్మలోప్రశాంత జీవితాన్ని అనుభవించు.

05.10.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చిఅన్నమాటలు.

1) తల్లి తన పిల్లల కష్ఠ సుఖాలను ముందుగానే అర్ధము చేసుకొనివారి మంచి భవిష్యత్ కోసము వర్తమానములో తన ప్రయత్నాలుప్రారింభించుతుంది.  అలాగే   సమర్ధ సద్గురువు తన భక్తుల బంగారుభవష్యత్ కోసము వారికి ముందుగానే సలహాలు సూచనలు ఇచ్చిఆదుకొంటారు

2) కొందరు తమ జీవితములో ముందుగా సుఖపడతారు.  జీవితఆఖరు దశలో కష్ఠ్డపడతారు.  మరికొందరు ముందుగా కష్ఠ్డపడతారు, తరువాత జీవితం  ఆఖరి దశలో సుఖపడతారు.  నేను నాభక్తులకష్ఠసుఖాలలో సాక్షి భూతుడిని.  వారు కష్ఠ్డపడుతున్నపుడు వారుష్ఠాలను అధిగమించడానికి వారికి శక్తిని ప్రసాదించే ఓమంచిమిత్రుడిని నేను. 

3) నీశత్రువు నిన్ను మానసికముగానుశారీరకముగాను హింసించియుండవచ్చును.  హింసకు ప్రతిహింస సమాధానము కాదు.  నీవునీశత్రువునుండి దూరముగా యుండి వానిలో పశ్చాత్తాపముకలిగేలాగ చూడు

4) శ్రీసాయి సత్ చరిత్రను నిత్యము పారాయణ  చేస్తు నిస్వార్ధముగాఆసత్  చరిత్రలోని  సాయి తత్వాన్ని యితరులకు బోధించినీజీవితములో ఒక మంచి పని చేసిన అనుభూతిని పొందు.  

(యింకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment