Wednesday, 6 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (13)





06.06.2012  బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1997 (13)
 
07.11.1997
 
శ్రీసాయి నిన్న రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
 
1.  నీవు ఆధ్యాత్మిక ప్రగతికి జమిస్థాన్ పూర్ బడికి వెళ్ళనవసరములేద్. నా యింటపని చేస్తున్న "శ్రధ్ధ" అనే పిల్లవాడు నీకు తన పెన్నును బహూకరించినాడు.  

కనుక ఆపెన్నుతో  శ్రీసాయి తత్వాలను ఒక చోట ఏరికూర్చి పదిమంది సాయి భక్తులకు "సహనము" తో బోధించు.  ఈతత్వప్రచార బోధన ఫలితము నాకు వదలిపెట్టు.  నీకు సదామేలు జరుగుతుంది.
 
2.  వయసులో ఉండగా వృత్తిలోని రాజకీయాల గొడవలు, వృత్తినుండి విరమణ చేసిన తర్వాత ధన, దార, సంతానములపై మమకారముతో గడిపి వేస్తే యింక నిన్ను సృష్ఠించిన భగవంతుని గురించి ఆలోచించేది ఎప్పుడు, ప్రశాంత జీవితమును గడిపేది ఎప్పుడు ఆలోచించు.
 
13.11.1997
 
శ్రీసాయి నిన్నరాత్రి వృథ్థుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
 
1) సాయి తత్వ ప్రచారము అనేపంటను పండించేటప్పుడు పంటను నాశనము చేసే దోమలబాధ ఎక్కువ అగుతుంది.  ఆదోమల బాధపోవాలి అంటే కొన్నాళ్ళపాటు పంటను పండించరాదు.
 
2) సాయి తత్వప్రచారము అనే ఆలోచనలతో కొందరు కష్ఠపడి పని చేస్తారు.  మరికొందరు భిక్షమెత్తుకొని జీవించుతారు.   వారి యిరువురిని నేను గమనించుతు ఉంటాను.  నాపేరిట భిక్ష కోరినవారికి నీవు ధనసహాయము చేయకపోయిన ఫరవాలేదు.  వారిని నిందించి వారితో గొడవలు పడవద్దు.
 
3) సాయి తత్వ ప్రచారములో నీవు పొగడ్తలకు పొంగిపోవద్దు.  ఎవరైన నిన్ను నిందించిన ఆనిందలు నేను భరించుతాను.  నీవు మాత్రము నీవు నమ్ముకొన్న మార్గములో ప్రయాణము కొనసాగించు.
 
17.11.1997
 
శ్రీసాయి నిన్నరాత్రి ఒకవృధ్ధుని రూపములో దర్శనము ఇచ్చి ప్రశాంత జీవితము కావాలి అంటే అన్నమాటలు.
 
1) భగవంతుడు ఉన్నాడు, లేదు, అనే వివాదములో ఎన్నడు దిగవద్దు.
 
2) జీవించటానికి ఆహారము అవసరము.  అంతేగాని రుచులతో గూడిన ఆహారము మాత్రముకాదు.
 
3) వైవాహిక జీవితములో పరస్త్రీ వ్యామోహము తలనొప్పిగా మారుతుంది అందుచేత అటువంటి ఆలోచనలకు దూరంగా జీవించు.
 
4) జీవితములో నీకు శారీరక శక్తి లోపించిననాడు, మిగిలియున్న శక్తిని శేష జీవితము ప్రశాంతముగా గడపడానికి వినియోగించటము ఉత్తమము.
 
5) జీవితములో వృధ్ధాప్యములో నీవారి పట్ల మమతలకు, మమకారాలకు దూరంగా జీవించు.  వీటివలన కలిగే సంతోషములో లభిచేది ఏమిలేదు. అలాగే విచారములో పోయేది ఏమిలేదు.  అందుచేత కనీసము వృధ్ధాప్యములోనైన భగవంతుని నామస్మరణతో జీవించు.
 
18.11.1997
 
నిన్నరాత్రి శ్రీసాయి ఒక హరిదాసు రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.
 
1) సాయి బంధువులు తమ శరీరానికి అంటుకొన్నమురికిని నదిలో స్నానము చేసి పోగొట్టుకోగలరు.  మరి మనసులోని మురికిని పోగొట్టుకోవాలి అంటే "రామాయణ రసావాహిని" లో మునిగి తేలవససినదే.  అందుచేత సాయి భక్త్లులు   అందరు రామాయణ మహాకావ్యమును చదివి తీరవలసినదే.

 
2) నీవు బుఱ్ఱ కధ విననవసరము లేదు.  అలాగే హరికధ విననవసరములేదు .  నీవు చేయవలససినది హరినామస్మ్రరణ.  

ఆహరినామ స్మరణ బిగ్గరగా చేసిన లేదా మెల్లిగా చేసిన శ్రీహరి వచ్చి నీమనసులో ఆసనము వేసుకొని కూర్చుంటాడు.
 

(ఇంకా ఉంది)  
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
  

No comments:

Post a Comment