Thursday, 28 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (16)


 
     






28.06.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1998 (16)

09.10.1998

నిన్నరాత్రి శ్రీసాయి నేను చదివిన కాలేజీలోని అధ్యాపకుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీవు తెలిసి కూడ చీకటిలో ప్రయాణము కొనసాగించిన నీకు ఎవరు సహాయము చేయలేరు.  నీవు నీగురువుని నమ్ముకొని జీవిత ప్రయాణము కొనసాగించుతు,  తెలియక చీకటిలో ప్రయాణము కొనసాగించినపుడు నీగురువు నిన్ను ప్రమాదాలబారినుండి కాపాడుతాడు.  నీచేత మంచి పనులు చేయించుతాడు.  అందుచేత సాధారణ మానవుడు గురువుని నమ్ముకొని జీవించటము మంచిది.   

2) ఒకడు మంచి సంస్కారముతో తెలివితేటలుతో కష్ఠపడి ధన సంపాదన చేసి తాను సుఖపడతాడు, తనవాళ్ళను సుఖపెడతాడు.  యింకొకడు అడ్డదార్లు తొక్కి ధనము సంపాదించి అహంకారముతో జీవించుతు తాను నాశనము చెంది తనతోటివారిని నాశనము చేస్తాడు.  అటువంటివారినుండి దూరముగా యుండాలి.   

10.11.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి  అన్నమాటలు.

1) మైకంలో ఉన్నవాడికి చీకటి అయిన వెలుతురు అయిన ఒక్కటే.  భగవంతుని అనుగ్రహము ఉన్నవాడు చీకటిలో ఉన్నా వెలుతురు ఉన్నా వెలుతురు కోసము ఎదురుచూడకుండానే చీకటిలో కూడా మంచి పనులు చేస్తాడు.  

2) దొంగతనము చేయడము నేరము.  దొంగతనము జరుగుతున్నపుడు దొంగను పట్టుకొని శిక్షించాలి అనే తపనలో దొంగ యొక్క ప్రలోభాలకు లోనయి నీవు కూడా దొంగతనము చేయటము మహానేరము.  అందుచేత దొంగలకు,  దొంగతనానికి దూరముగా జీవించు.   

3) నీకంటే శారీరకముగా బలమైనవాడు నిన్ను హింసించటానికి ప్రయత్నించినపుడు నీవు బుధ్ధి బలాన్ని ఉపయోగించి  అక్కడనుండి తప్పుకోవటములో తప్పులేదు.  అంతేగాని అక్కడ రణరంగము సృష్ఠించి పదిమిందికి తలనొప్పి కలిగించవద్దు. 


14.12.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీవు దొంగతనము చేసిన తర్వాత నీవు చేసినది తప్పు అని గ్రహించిననాడు, దాని పాప పరిహారార్ధము నీవు దొంగిలించిన ధనముతో కట్టెలు కొని ఆ కట్టెలను పొయ్యిలో వెలిగించి ఆసమయములో నీదగ్గర ఉన్న ధనముతో వంటలు తయారు చేసి బీదలకు అన్నదానము చేసిన నీపాపము కడిగివేయబడుతుంది.    



2) పూర్వకాలములో వార్తా సౌకర్యాలు లేకపోయిన దూరదేశములో ఉన్న తమవారు భగవంతుని దయతో కులాసాగ యున్నారు అని భావించేవారు.  కాని, ఈనాడు వార్తా సౌకర్యాలు ఎక్కువయి క్షణక్షణము దూర దేశములవారితో మాట్లాడుతు 
 

తమవారు తమ గొప్పతనము వలన కులాసాగయున్నారు అని భావించుతున్నారు.  యిది తప్పు.  ఆనాడు, ఈనాడు మనమందరము ఆవిశ్వంబరుని దయతో కులాసాగ జీవించుతున్నాము అని గ్రహించటము మంచిది. 

3) ప్రాపంచిక  రంగ ములో నీఅభ్యున్నతికి  మధ్య దళారుల సహాయము కోరుతావే మరి ఆధ్యాత్మిక రంగములో ముందుకుసాగిపోవడానికి యోగుల సహాయము పొందటము మంచిదే కదా. 



నేటితో సాయి.బా.ని.స. డైరీలు

(సమాప్తము)    

  సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment