10.06.2012
ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 (16) & 1998 (01)
30.12.1997
శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి కలలో అన్నమాటలు.
1) మనము మనతోటి మనిషి పట్ల ఉన్న మంచిభావాలను, గౌరవమును, నమస్కారము ద్వారాను,
పాదనమస్కారము ద్వారాను తెలియపర్చుతాము. కొందరు తమ భావాలను పైకి వెలిబుచ్చలేరు. అంతమాత్రాన వారు నమస్కారము చేయడము అన్నా, పాదనమస్కారము చేయడములకు వ్యతిరేకము అని భావించరాదు. భక్తి, గౌరవము అనేది మనసులో ఉన్న చాలు.
2) కొందరు అహంకారముతో తోటివారిని అగౌరవము పర్చుతు జీవించుతారు.
అదివారి సంకుచిత స్వభావానికి నిదర్శనము. అటువంటివారినుండి దూరముగా యుండటము ఉత్తమము.
3) యితరుల ధర్మాలు విషయములో ఆసక్తి చూపించవద్దు. నీస్వధర్మాన్ని అర్ధము చేసుకొని ఆధ్యాత్మిక రంగములో జీవితాన్ని ముందుకు నడిపించి, నీగమ్యాన్ని చేరుకో.
సాయి.బా.ని.స. డైరె - 1998 (01)
03.01.1998
శ్రీసాయి నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.
1) నాసత్ చరిత్రను వ్రాయడానికి నేను హేమాద్రిపంతుకు అనుమతిని ఇచ్చినాను. కాని ఈనాడు అనేకమంది నాసత్చరిత్రకు వక్ర భాష్యాలు వ్రాస్తు నాకు బాధను కల్గించుతున్నారు. ఏది ఏమైన నాజీవిత ఘట్టాలను మాత్రము మార్చకుండ వ్రాయడము నాకు కొంతవరకు ఊరట కలిగించినది.
2) నాతత్వ ప్రచారములో నేను నీకు ఇచ్చిన మిఠాయిని నీవు తిను. నీపక్కవాడికి కొంచము పంచిపెట్టు.
3) ప్రశాంత జీవితము కోరుకొనేవారు ముందుగా ఆహారములో రుచులకు పోరాదు. నిరాడంబర జీవితానికి కావలసిన లక్షణాలు అలవర్చుకొని జీవితాన్ని కొనసాగించాలి.
08.01.1998
శ్రీసాయి నిన్నరాత్రి కలలో నాచిన్ననాటి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాఉనిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు
1) కొందరు భగవంతుని అనుగ్రహమును సంపాదించి దాన్ని యితరులకు అమ్ముకొని ధనసంపాదన చేస్తారు. మరికొందరు తాము సంపాదించిన భగవంతుని అనుగ్రహాన్ని తోటివారి మేలుకోసము ఉపయోగించుతారు. అటువంటివారు అంటేనే నాకు చాలా ఇష్ఠం.
2) కొందరు ప్రకృతిలోని అందచందలను గుర్తించలేక భగవంతుడు లేడు అని అంటారు. మరికొందరు ప్రకృతిలోని అందచందాలను చూసి ఈప్రకృతి భగవంతుని రూపమే అంటారు.
3) నీవుభగవంతుని పూజ చేసుకొంటున్న సమయములో నీయింటికి నీమిత్రులు రావచ్చును. నీకు ఇష్ఠము లేనివారు రావచ్చును. అందరిలోను భగవంతుడు ఉన్నాడు అని నమ్మినపుడు నీవు పూజ ప్రసాదమును అందరికి పంచిపెట్టు.
4) భగవంతుని సేవలో సంగీతము ద్వారా భగవంతుని కీర్తించు. నీకు సంగీతమురాని పక్షాన జలతరింగిణి వాద్యముతో శబ్దతరంగాలను సృష్ఠించి ఆశబ్దతరంగాలలో భగవంతుని అనుభూతిని పొందు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment