Wednesday, 13 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (04)









13.06.2012  బుధవారము


సాయి.బా.ని.స. డైరీ - 1998 (04)
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


23.02.1998


శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక బడిపంతులు రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.


1  నైతిక విలువలు అనేవి స్వతహాగా రావు. సజ్జన సాంగత్యముతో అలవాటు అయి, స్వయంకృషితో నైతిక విలువలు పెరుగుతాయి.  అందుచేత సజ్జన సాంగత్యము మనిషి జీవితములో చాలా అవసరము.


2. ప్రజలలో నైతిక విలువలు పెరగాలి అంటే నాయకులలోముందు నైతిక విలువలు పెరగాలి.  ఆటువంటి నాయకులు ఉన్ననాడు ప్రజలలో నైతిక విలువలు పెరుగుతాయి.  


3. కార్యాలయాలలో పనిచేసేవారు నైతిక విలువలు కలిగియుండాలి.  కార్యాలయాలను తమ స్వప్రయోజనాలకు వినియోగించరాదు.  


4. ఒకరినుండి సహాయము పొందినవారు తమకు సహాయము చేసినవారి పట్ల కృతజ్ఞతా భావము కలిగియుండాలి.  నైతిక విలువలు పెంచుకోవాలి.   


5. సంసార జీవితములో భార్య భర్తలు నైతిక విలువలు కలిగియుండటము చాలా ముఖ్యము. 


24.02.1998


నిన్నరాత్రి శ్రీసాయి నాకు జన్మ యిచ్చిన నాతల్లిరూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.


1) పిల్లలను కనగానె సరిపోదు.  వారిని పెంచిపెద్ద చేసి బరువు బాధ్యతలను పూర్తిచేసుకొన్న జీవితమే ధన్యము. 


2) అనాధపిల్లలకు సాయి పేరిట ప్రేమ, అనురాగాలను పంచిన సాయి ప్రేమకు పాత్రుడివి కాగలవు. 
 


3) నీయింట పెద్దవయసువారు కాలము చేసిన నీబంధుమిత్రులను పిలిచి చనిపోయినవారి ఆత్మశాంతి కోసము కర్మకాండలు సరిగా నిర్వర్తించు. 


4) వయసుమీరినకొలది ఆమనిషిలో మంచి అలవాట్లు పెంచుకోవాలి.  వృధ్ధాప్యములో చెడు అలవాట్లకు బానిస అయి జీవితమును నాశనము చేసుకోరాదు. 


27.02.1998


నిన్నరాత్రి శ్రీసాయి దివంగతులైన నాతండ్రి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 


1) నీజీవిత రైలు ప్రయాణములో నీతోపాటు ప్రయాణము చేయటానికి నీపిల్లలకు టికెట్లు మాతమే కొనగలిగినావు. ప్రయాణములో వారు నీకు చాలా చికాకులు కలిగించుతారు.  నీవు ఆచికాకులను మరచిపోయి నీస్టేషన్ రాగానె నీవు దిగిపో.  నీపిల్లకు వారి గమ్యము చేరడానికి ఆరైలులో ముందుకు సాగిపోతారు.  


2) జీవితములో మమతలు, మమకారాలకు దుర్ వ్యసనాలకు దూరంగా యుండు. 


3) అంటరానితనము అనే భావన నీమనసునుండి తొలగించు. 


4) భార్యా వ్యామోహము విడనాడు.  


 
నీపిల్లలు పెద్దవారు అయినారు.  వారు స్వతంత్రముగా జీవించగలరు అనే విషయాన్ని గ్రహించిన చాలా మంచిది.  


(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment