Saturday 16 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (06)

 


 



 


17.06.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1998 (06)

14.03.1998

శ్రీసాయి నిన్నరాత్రి తిరిగి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.
1) నేను శిరిడీలో 1916 సంవత్సరములో శరీరముతో యున్న రోజులలోని ప్రపంచ పరిస్థితి, భారతదేశ పరిస్థితిని చూపించుతున్నాను చూడు.  మొదటి ప్రపంచ యుధ్ధములో పట్టుబడిన ఖైదీలను చిత్రహింసలు పాలు చేస్తున్నారు కొందరు నియంతలు.  భారతదేశ స్వాతంత్ర్యము కోసము పోరాడుతున్నవారిని ఉరి కంబము ఎక్కించి చంపుతున్నారు బ్రిటిష్ పాలకులు.  
 
 
ఇది ఆనాటి పరిస్థితి.     

2) ఈనాడు నీవు నీవర్తమానములో సాయి మార్గములో ప్రయాణము చేస్తు నాపాదాల చెంతకు చేరాలని కోరుతున్నావు. 
 
 మరికొందరు వేరే మార్గములో ప్రయాణము చేస్తు తమ గమ్యాన్ని చేరాలని ఆరాటపడుతున్నారు.  ఎవరు ఏమార్గములో ప్రయాణము సాగించిన ఆఖరికి అందరు నాదరికి చేరవలసినదే.   

15.03.1998

నిన్నరాత్రి శ్రీసాయి నాతల్లి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) తల్లితండ్రులు చేసిన మంచి పనులకు, చెడు పనులకు కలిగే ఫలాలు వారి పిల్లలకు చేరుతాయి.  అందుచేత నీవు నీజీవితములో మంచి పనులు చేసి వాటి ఫలాలును నీపిల్లలు అనుభవించేలాగ చూడు. 

2) భగవంతుడు అన్నిచోట్ల అందరిలోను ఉన్నాడు అనేది నీవు నమ్మినావు.  యితరులు నీవు చెప్పినవాటిని నమ్మకపోవచ్చును.  నీనమ్మకాన్ని యితరులపై రుద్ది అనవసరపు గొడవలలో బాధలు పడవద్దు.  

3) సాయి తత్వము గురించి అనేకమంది అనేక రకాలుగా ప్రచారము చేస్తున్నారు.  నీవు వారి గురించి ఆలోచించవద్దు.  ఎవరితోను గొడవలు పడవద్దు. 

4) నీవు సాయి మార్గములో పయనించుతు యితరులకు ఆదర్శముగా నిలబడు.  అపుడు వారే వారంతటగా సాయి మార్గములో ప్రయాణము చేస్తారు.  

19.03.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) మహాబలిపురము సముద్రపు ఒడ్డున పాడుబడిన మందిరాలను చూడు.  గతములో ఆమందిరాలలో భగవంతునికి పూజలు, ఉత్సవాలు జరిగినవి.  కాని ఈనాడు కొన్ని మందిరాలు సముద్ర గర్భములో మునిగిపోయినవి. మిగిలిన మందిరాలు శిధిలావస్థలో సముద్రపు ఒడ్డున జ్ఞాపకాలుగా 

మిగిలిపోయినవి. 

కాలవ్రవాహములో భగవంతునికి ఈకష్ఠాలు తప్పలేదు.  మరి మానవుల సంగతి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించు.    

2) నీజీవితము ఒక పచ్చని చెట్టు.  
 
ఈచెట్టు నీడలో కొందరు తమ కష్ఠాలును మర్చిపోవడానికి, మరికొందరు విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు దగ్గరకు చేరుతారు.  వారి కష్ఠ సుఖాలకు నీవు ఒక సాక్షిభూతుడివి.  ఎందరికో కష్ఠసుఖాలలో తోడుగా నిలిచిన నీవు ఒకనాడు ఎండిపోయిన చెట్టుగా మారిపోతావు. 
 
  ఆఖరికి మట్టిలో కలసిపోతావు.  

(ఇంకా ఉంది)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


No comments:

Post a Comment